జగన్.. మీ ప్రత్యర్థి ఎవరో తేల్చుకున్నారా ..!
వైసీపీ అధినేత జగన్‌కు రాజకీయ ప్రత్యర్థి ఎవరు? అంటే.. తడుముకోకుండా.. చెప్పే మాట చంద్రబాబు!.;
వైసీపీ అధినేత జగన్‌కు రాజకీయ ప్రత్యర్థి ఎవరు? అంటే.. తడుముకోకుండా.. చెప్పే మాట చంద్రబాబు!. ఇది వైసీపీ నాయకులే కాదు.. జగన్ కూడా ఇదే భావనతో ఉన్నారు. ఉంటున్నారు కూడా!. కానీ, చంద్రబా బు కంటే కూడా.. బలమైన ప్రత్యర్థి, జగన్‌ను ఓడించి తీరుతామని చెబుతున్న నాయకుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈయనే అసలు సిసలు ప్రత్యర్థి.. అనడంలో సందేహం లేదు. అయితే.. ఈ విషయాన్ని వైసీపీ గ్రహించడంలో కొంత తాత్సారం చేస్తోందన్నది వాస్తవం.
2014కు ముందు జరిగిన పరిణామాలను గమనించినా.. తర్వాత జరిగిన పరిణామాలను గమనించినా వైసీ పీకి ప్రధాన ప్రత్యర్థి.. పార్టీ కాదు.. వ్యక్తే. ఆయనే పవన్ కల్యాణ్. 2014 ఎన్నికల్లో తాను పోటీ నుంచి దూరంగా ఉన్నా.. అప్పటి కూటమి.. బీజేపీ-టీడీపీలకు మద్దతు ఇవ్వడం ద్వారా తన అభిమాన గణాన్ని ఈ కూటమి వైపు నడిపించారన్నది వాస్తవం. దీంతో 2014లో దక్కాల్సిన అధికారం వైసీపీకి దక్కలేదు. ఇక, 2019 విషయానికి వస్తే.. ఇక్కడ కూడా పవనే జగన్‌కు ప్రత్యర్థి.
అయితే.. అప్పటి వ్యూహం మాత్రం కొంత మేరకు బెడిసి కొట్టింది. అప్పటి టీడీపీ-బీజేపీల మధ్య విభే దా లు రావడం.. ప్రజల్లో ప్రత్యేక హోదాపై ఆశలు ఉండడం. అదేసమయంలో అవినీతి.. ఆరోపణలు కూడా ఎక్కువగా రావడంతో పవన్ చాలా తెలివిగా.. వేర్వేరుగా పోటీకి దిగారు. నిజానికి అప్పట్లో వేర్వేరుగా చేసిన సమయంలో బీజేపీ-టీడీపీ-జనసేనకు ఆశించిన మేరకు సీట్లు వచ్చినా.. తిరిగి చేతులుకలిపేవారు. కానీ.. గుండుగుత్తగా జనం వైసీపీకి మద్దతు పలికారు.
ఇక, 2024 ఎన్నికలకు వచ్చేసరికి నేరుగానే జగన్‌ను టార్గెట్‌చేసి అధికారం నుంచి దింపేస్తామని ప్రకటిం చిన విషయం తెలిసిందే. అదే జరిగింది. అంటే.. మొత్తంగా జగన్ రాజకీయాలను నిశితంగా గమనిస్తున్న నాయకుల్లో పవన్ ముందు వరుసలో ఉన్నారన్నది సందేహం లేదు. సో.. జగన్ రాజకీయ ప్రత్యర్థి కూడా ఆయనే. తాజాగా కూడా.. మరోసారి అధికారంలోకి ఎలా వస్తారో చూస్తామన్న సవాల్ విసరడం ద్వారా.. టీడీపీకంటే ఎక్కువగా వైసీపీని నిలువరించేందుకు పవన్ వ్యక్తిగతంగా ఎంత ప్రయత్నం చేయొచ్చే.. అర్ధం అవుతుంది.
రాజకీయాల్లో దీనిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఏ నాయకుడి ఇష్టం వారిది. అయితే.. ఒక యుద్ధానికి దిగినప్పుడు లేదా.. దిగుతున్నట్టు అసలు ప్రత్యర్థి ఎవరు? అనేది తెలుసుకోకుండా అడుగులు వేస్తే.. అది ప్రమాదకరం. సో.. ఇప్పటికైనా.. వైసీపీ అధినేత జగన్.. తన ప్రత్యర్థి ఎవరు? అనేది తెలుసుకుని అడుగు లు వేస్తే.. అందుకు తగిన విధంగా తన వ్యూహాన్ని మలుచుకుంటే తప్ప.. తిరిగి ఆయన భావిస్తున్నట్టు అధికారం దక్కడం అనేది జరగకపోవచ్చు.