జగన్ అరెస్ట్....పవన్ సంచలన వ్యాఖ్యలు
వైసీపీ అధినేత జగన్ అరెస్టు అయితే తనకేమిటి కాకపోతే ఏమిటి అని పవన్ వ్యాఖ్యానించారు. తాను ఎవరి అరెస్టు ద్వారానో లబ్ది పొందే రాజకీయాలు చేయనని అన్నారు.
రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఒక ఇష్యూ రాజకీయంగా మండిస్తోంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక యూట్యూబ్ చానల్ లో మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాని పవన్ నాదెండ్ల మనోహర్ కలిసినపుడు జగన్ అరెస్టు గురించి ప్రస్తావించారని చెప్పారు. దాని మీద రచ్చ సాగింది. అది ఒక లెవెల్ లోకి వెళ్ళిపోయింది. ఆఖరికి ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలను ఉప సంహరించుకుంటున్నాను అని చెప్పినా వివాదం సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూ మీద తొలిసారి బహిరంగంగా నోరు విప్పారు రాజమండ్రిలో పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో పవన్ మాట్లాడుతూ ఒకింత ఆవేశాన్ని ప్రదర్శించారు.
జగన్ అరెస్టు అయితే నాకేంటి :
వైసీపీ అధినేత జగన్ అరెస్టు అయితే తనకేమిటి కాకపోతే ఏమిటి అని పవన్ వ్యాఖ్యానించారు. తాను ఎవరి అరెస్టు ద్వారానో లబ్ది పొందే రాజకీయాలు చేయనని అన్నారు. ఆ మాటకు వస్తే తాను భయపడుతూ రాజకీయాలు చేసే స్థాయిలో లేనని పవన్ చెప్పారు. జగన్ అరెస్ట్ గురించి కేంద్ర హోం మంత్రి వద్ద ప్రస్తావించాల్సిన అవసరం తనకు ఎందుకు ఉంటుందని పవన్ ప్రశ్నించారు. ఎవరో జైలుకు వెళ్తే మాత్రమే తాను ఎదుగుతానా అని పవన్ అన్నారు. తాను సీఎం అవుతానా అని కూడా ఆయన కామెంట్స్ చేశారు.
అమిత్ షాను కలిస్తే :
తాను కేంద్ర పెద్దలు నరేంద్ర మోడీ, అమిత్ షాలని కలిస్తే రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతాను తప్ప ఇలాంటి విషయాల గురించి కానే కాదని పవన్ అన్నారు. తనకు ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం అగత్యం లేదని పవన్ ఘాటుగా అన్నారు. ఒక రాజకీయ విశ్లేషకుడు అమిత్ షా గురించి మాట్లాడితే రెస్పాండ్ కావాల్సింది బీజేపీ నేతలు కదా అని పవన్ లాజిక్ ప్రశ్న సంధించారు. కానీ వారి నుంచి రియాక్షన్ ఏదీ అని ఆయన ఆయన అన్నారు. ఎందుకు స్పందించరని కూడా ప్రశ్నించారు.
గెలుపు ఓటముల భయం లేదు :
తనకు రాజకీయాల్లో గెలుపు ఓటముల గురించి పెద్దగా భయాలు లేవని అన్నారు. తనకు అన్నీ సమానమే అన్నట్లుగా పవన్ వ్యాఖ్యానించారు. తాను ఎదుటి ఉన్న శతృవుల గురించి యుద్ధం చేద్దామని అనుకుంటే సొంత పార్టీలోనే తనకు శత్రువులు తయారు అయ్యారని పవన్ అనడం విశేషం. పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడుస్తున్నారు అని కూడా పవన్ అన్నారు. మరి సొంత పార్టీలో పక్కన ఉంటూ అలా చేస్తున్నది ఎవరో చూడాల్సిన అవసరం ఉంది అంటున్నారు. ఇక కష్టాలు కన్నీళ్ళు తనకూ ఉన్నాయని తన సహనం ఇంతవరకూ చూశారని ఇక మీదట తానేంటో చూస్తారని పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరి ఇది సొంత పార్టీలోని వారికా లేక ప్రత్యర్ధులకా లేక తన పార్టీ మీద విశ్లేషణ చేస్తున్న వారి మీదనా అన్నది అయితే పవన్ చెప్పలేదు. మొత్తానికి పవన్ తన మనసులో మాటను చెప్పేశారు అని అంటున్నారు.