ఊహ‌కంద‌ని విప్ల‌వం.. ప‌వ‌న్‌... !

''ఇలా వ‌చ్చి.. అలా పోయిన పార్టీలు అనేకం ఉన్నాయి. ఇది కూడా అంతే!'' అని తొలినాళ్ల‌లో ఎదురైన పెద‌వి విరుపులు.. స‌హాయ నిరాక‌ర‌ణ‌ల‌ను కూడా ఛేదించి.. త‌న పార్టీని.. త‌న‌తో పాటు.. ముందుకు న‌డిపించారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.;

Update: 2025-09-02 13:38 GMT

సాధార‌ణంగా.. ఒక విప్ల‌వం పుడుతోందంటే.. దీనికి ముందు కొన్ని సంకేతాలు వ‌స్తాయి. కానీ.. ఎలాంటి సంకేతాలు లేకుండా.. ఒక సాధార‌ణ రాజ‌కీయ నేత‌గా.. త‌న పంథాను కొన‌సాగించి.. ఒక సాధార‌ణ రాజ‌కీ య పార్టీని స్థాపించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఊహ‌కంద‌ని విప్ల‌వాన్ని సృష్టించారు. ''ఇక‌, జెండే ఎత్తేస్తారు..'' అని ఓవ‌ర్గం నాయ‌కులు చేసిన ప్ర‌చారం నుంచి బ‌ల‌మైన పీఠాన్ని ఏర్పాటు చేసుకున్న ద‌శ వ‌ర‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ అడుగులు సుదీర్ఘ ల‌క్ష్యాన్ని ప‌ట్టి చూపుతాయి.

''ఇలా వ‌చ్చి.. అలా పోయిన పార్టీలు అనేకం ఉన్నాయి. ఇది కూడా అంతే!'' అని తొలినాళ్ల‌లో ఎదురైన పెద‌వి విరుపులు.. స‌హాయ నిరాక‌ర‌ణ‌ల‌ను కూడా ఛేదించి.. త‌న పార్టీని.. త‌న‌తో పాటు.. ముందుకు న‌డిపించారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. సినిమా ఇమేజ్‌.. ఏమేర‌కు ప‌నిచేస్తుంది... అనేది చిరంజీవి పార్టీ పెట్టిన కొత్త‌లో త‌ర్వాత‌.. అంద‌రికీ అనుభ‌వంలోకి వ‌చ్చింది. అందుకే.. ప‌వ‌న్ త‌న ఇమేజ్‌ను మాత్ర‌మే న‌మ్ముకోలేదు. ప్ర‌జ‌ల‌ను.. పేద‌ల‌ను.. రైతాంగాన్ని న‌మ్ముకున్నారు. వారి స‌మ‌స్య‌ల్లో నేనున్నానంటూ అడుగులు వేశారు.

ఇది ప‌వ‌న్‌కు రాజ‌కీయ నేత‌గా సుస్థిర‌త్వాన్ని ఆపాదించింది. అంతేకాదు.. వేసిన అడుగులు తొలినాళ్ల‌లో విమ‌ర్శ‌ల‌కు దారితీసేలా చేసినా.. త‌ర్వాత త‌ర్వాత‌.. స‌మాజం మొత్తం ఆయ‌న వెంట న‌డిచేలా చేసింది. ఎక్క‌డ ఎలా స్పందించాలో.. ఎక్క‌డ ఎలా త‌గ్గాలో రాజ‌కీయాల్లో నాయ‌కుల‌కు అత్యంత కీలకం. ఇది తెలిసిన వారే నేత‌లుగా నిల‌బ‌డ్డారు. ఈ త‌ర‌హాలోనే ప‌వ‌న్ కూడా.. 2023లో చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు మ‌రోసారి మ‌ద్ద‌తు ఇచ్చే విష‌యంలో త‌న‌ను తాను త‌గ్గించుకుని వేసిన అడుగులు త‌ర్వాత‌.. కాలంలో ఊహించ‌ని విజ‌యాన్ని.. విప్ల‌వాన్ని సైతం చేరువ చేశాయి.

మంగ‌ళ‌వారం ఆయ‌న పుట్టిన రోజు. శుభాకాంక్ష‌లు.. వెల్లువెత్తుతున్నాయి. కానీ, ఇదేస‌మ‌యంలో ఆయ‌న రాజ‌కీయ జీవిత‌మే కాదు.. సినీ ప్ర‌స్థానంలోనూ.. తొలినాళ్ల‌లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ఆయ‌న ఎదిగిన తీరు.. అంద‌రికీ ఆద‌ర్శ‌మే. ఎలా ఎద‌గాల‌న్న విష‌యాన్ని ఆయ‌న నుంచి నేర్చుకునే స్థాయికి ప‌వ‌న్ ఎదిగారు. ప‌ద‌వులు ఉంటాయి.. పోతాయి.. కానీ, ప్ర‌జ‌ల హృద‌యాల‌ను గెలుచుకోవ‌డంలోనే అస‌లు రాజ‌కీయం ఉంది.

ఇదే.. ఆయ‌న‌ను గిరిజ‌నుల‌కు చేరువ చేసింది... ఎస్సీ, ఎస్టీల‌కు మ‌చ్చిక చేసింది. పార్టీని స్థాపించి ఆయ‌న విప్ల‌వం సృష్టించ‌లేదు. .. ఆ పార్టీని ప్ర‌జ‌లు త‌మ‌ది అనుకునే స్థాయికి చేరుకునేలా చేసి విప్ల‌వం సృష్టించారు. రెండు స్థానాల్లో ఓడినా.. త‌దుప‌రి ఎన్నిక‌ల్లో తాను గెలిచి.. త‌న వారిని గెలిపించుకునే స్థాయికి ఎదిగిన తీరు విప్ల‌వం. ప‌ద‌వుల‌ను అలంకార ప్రాయంగా కాకుండా.. ప‌నిచేసేలా చేసి.. చూపుతున్న వైనం.. ఓ విప్ల‌వం. అందుకే.. ప‌వ‌న్‌.. ఏపీ రాజ‌కీయాల్లో.. ఊహ‌కంద‌ని విప్ల‌వం.

Tags:    

Similar News