పంచెకట్టుతో పవన్ అదరహో
ఇదిలా ఉంటే తమిళనాడులో జరిగిన ఈ భక్తి సమ్మేళనానికి పవన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.;
పవన్ కళ్యాణ్ జనసేన అధినేత హోదాలోనే కాకుండా మురుగన్ భక్తుడిగా తమిళనాడులో ఆదివారం జరిగిన ఒక భక్తిపూర్వకమైన కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. దాని కోసం ఆయన హైదరాబాద్ నుంచి మధురై చేరుకున్నారు. తెల్ల పంచెతో చొక్కాతో పవన్ విమానం దిగి నడుచుకుంటూ వస్తూంటే ఫ్యాన్స్ లో హుషార్ ఒక్క లెవెల్ లో సాగింది.
ఇక అక్కడ జరిగిన మురుగన్ మహా భక్తి సమ్మేళన్ లో పవన్ ఆకుపచ్చ పంచె తెల్ల చొక్కాతో వేదిక మీదకు వచ్చారు. దాంతో అక్కడ వేలాదిగా ఉన్న భక్త జన సందోహం పవన్ ని చూసి ఉప్పొంగారు. పవన్ సితం చేతులెత్తి మురుగన్ భక్తులు అందరికీ అభివందనాలు అందిస్తూ ముందుకు సాగారు.
ఇదిలా ఉంటే తమిళనాడులో జరిగిన ఈ భక్తి సమ్మేళనానికి పవన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆయనను బీజేపీ నేతలు ఆహ్వానించడంతో సహజంగానే మురుగన్ భక్తుడు అయిన పవన్ ఈ సమావేశానికి విచ్చేశారు. ఇక ఈ పర్యటనలో పవన్ తిరుప్పరంకుండ్రం లో ఉన్న శ్రీ సుబ్రమణ్యేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
మరో వైపు చూస్తే పవన్ ఉపవాస దీక్షలు కూడా చేపట్టారు. బీజేపీ జనసేన నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే భక్తి సమావేశాలకు ఇతర రాష్ట్రాల నుంచి రాజకీయ్ నాయకులను బీజేపీ ఆహ్వానించడమేంటని అధికార డీఎంకే ప్రశ్నిస్తోంది. బీజేపీ నేతల తీరుని తప్పు పడుతోంది.
ఇవన్నీ పక్కన పెడితే పవన్ ఇటీవల కాలంలో తమిళనాడులో ఎక్కువగా పర్యటిస్తున్నారు. ఆయన గతంలో ఆలయాల సందర్శన చేపట్టారు. ఆ తరువాత తమిళనాడులో జరిగిన బీజేపీ సభకు హాజరయ్యారు. ఇపుడు చూస్తే ఒక అతి పెద్ద ఆధ్యాత్మిక సభలో ముఖ్య అతిధిగా పాల్గొంటున్నారు. మొత్తం మీద చూస్తే కనుక పవన్ కళ్యాణ్ తమిళనాడు రాజకీయాల్లో సెంటర్ అట్రాక్షన్ అవుతున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఏది ఏమైనా పవన్ ఇలా పొలిటికల్ తెర మీద పంచె కట్టుతో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.