పవనా మజాకానా... ఏపీకి కుంకీ ఏనుగులు !

ఏపీలో చాలా జిల్లాలలో అతి పెద్ద సమస్యగా ఏనుగుల బెడద ఉంది ఏనుగులు పచ్చని పొలాలలో దూరి విచ్చలవిడిగా వీరంగం చేస్తూ పంటను అంతా సర్వనాశమం చేస్తున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి.;

Update: 2025-05-20 04:22 GMT

ఏపీలో చాలా జిల్లాలలో అతి పెద్ద సమస్యగా ఏనుగుల బెడద ఉంది ఏనుగులు పచ్చని పొలాలలో దూరి విచ్చలవిడిగా వీరంగం చేస్తూ పంటను అంతా సర్వనాశమం చేస్తున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అంతే కాదు అడ్డు వచ్చిన జనాలను తొక్కి పారేస్తున్నాయి. ఇలా అమాయకులు ఎందరో ఏనుగుల దాడిలో మరణించిన సంఘటనలూ ఉన్నాయి.

ఏపీలో ఏజెన్సీ జిల్లాలలో చూస్తే ఈ బెడద మరీ ఎక్కువగా ఉంది. పార్వతీపురం మన్యం జిల్లాలో పెద్ద ఎత్తున ఏనుగుల గుంపు సంచరిస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి. వీటి బెడద నుంచి కాపాడమని ఎన్ని సార్లు ఎందరికి విన్నవించినా వారు ఏ రకమైన చర్యలు తీసుకున్నా ఉపశమనం అయ్హితే కలగడంలేదు.

అయితే గత ఏడాది ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ వద్దనే అటవీ శాఖ ఉంది. దాంతో ఈ సమస్య ఆయన దృష్టికి వెళ్ళడంతో ఆయన వెంటనే యాక్షన్ లోకి దిగారు తమకు పెద్ద ఎత్తున కుంకీ ఏనుగులను పంపించాలని ఆయన కర్ణాటక వెళ్ళి మరీ అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని సంబంధిత మంత్రిని కలసి వినతి చేశారు. ఈ మేరకు ఒక అవగాహన ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నారు.

దాంతో ఎట్టకేలకు పవన్ ప్రయత్నం ఫలించింది అని అంటున్నారు ఈ నెల 21న ఏపీకి ఏకంగా ఆరు కుంకీ ఏంగులులను పంపించడానికి కర్ణాటక ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ఇవి తొలి విడతలో భాగంగా వస్తాయి. ఆ తరువాత కూడా మరిన్ని కుంకీ ఏనుగులను ఏపీకి పంపేందుకు కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అంటున్నారు.

ఇంతకీ ఈ కుంకీ ఏనుగులకు ఇంత డిమాండ్ ఎందుకు ఇవి ఏమి చేస్తాయి అంటే ఈ కుంకీ ఏనుగులు పూర్తి స్థాయి శిక్షణ పొంది ఉంటాయి. వీటిని ఎక్కువగా సహాయ కార్యక్రమాలు అలాగే కాపలా కాసేందుకు ఉపయోగిస్తారు. అడవుల నుంచి ఏనుగులు జనవాసాలలో అడుగు పెట్టకుండా నిరోధించడంలో వీటి పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పాలి.

అడవుల నుంచి వచ్చే ఏనుగులు చేసే వీరంగాన్ని ఇవి విజయవంతంగా ఎదుర్కొంటాయి. అంతే కాదు ఏ రకమైన మానవ ప్రాణ హాని కానీ పంట నష్టం కానీ రాకుండా ఇవి తగిన విధంగా సాయం చేస్తాయి ఒకసారి అడవుల నుంచి వచ్చే ఏనుగుల గుంపు ఈ కుంకీ ఏనుగులను చూసిందంటే తిరిగి అడవులలోకే పరుగులు తీస్తాయని చెప్పాలి.

అందుకే వీటికి చాలా డిమాండ్ ఉంది. కర్ణాటకలోనే కుంకీ ఏనుగులు ఎక్కువగా ఉంటాయి. దాంతో దేశంలోని అనేక రాష్ట్రాలు కుంకీ ఏంగుల కోసం ఆ రాష్ట్రాన్ని ఆశ్రయించి సాయం అందుకుంటారు. ఇపుడు పవన్ నాయకత్వంలో ఏపీ సర్కార్ కూడా ఆ దిశగా అటవీ ఏనుగుల పని పట్టేందుకు కుంకీ ఏనుగులను రప్పిస్తోంది.

ఈ కుంకీ ఏంగులతో ఏపీలోని ఉత్తరాంధ్రా జిల్లాలతో పాటు చిత్తూరు సహా ఇతర జిల్లాలలో అటవీ ఏనుగుల నుంచి మనుషులను పంటలను నియంత్రించేందుకు ఏపీ సర్కార్ చర్యలు తీసుకుంటోంది కూటమి పాలనకు ఏడాది పూర్తి అవుతున్న నేపధ్యంలో కుంకీ ఏనుగులు ఏపీకి రావడం మంచి పరిణామమని అంటున్నారు. దాంతో చాలా మంది పవనా మజాకానా అంటున్నారు.

Tags:    

Similar News