థాంక్ యూ షర్మిలమ్మా...ఇంట్రెస్టింగ్ రిప్లై
రక్త బంధం ఎపుడూ గొప్పదే. నీటి కంటే చిక్కనైనది రక్తం అని అంటారు. ఏవో కారణాల వల్ల ఎవరైనా కాస్తా దూరంగా జరిగినా విభేదాలు పాటించినా చివరికి రక్త బంధమే గెలుస్తుంది అని అంటారు.;
రక్త బంధం ఎపుడూ గొప్పదే. నీటి కంటే చిక్కనైనది రక్తం అని అంటారు. ఏవో కారణాల వల్ల ఎవరైనా కాస్తా దూరంగా జరిగినా విభేదాలు పాటించినా చివరికి రక్త బంధమే గెలుస్తుంది అని అంటారు. ఏపీలో చూస్తే అన్న జగన్ చెల్లెమ్మ షర్మిలమ్మ ఇద్దరూ కూడా ఎంతో అన్యోన్యంగా ఆప్యాయంగా ఉండేవారు. వైఎస్సార్ బిడ్డలుగా వారిని చూసి పెద్దాయన అభిమానులు కూడా ఎంతో పొంగిపోయేవారు. కానీ అనూహ్యంగా రాజకీయమో మరే కారణమో వారిని విడదీసింది. అయితే అనతికాలంలోనే అది సమసిపోయి ఇద్దరూ ఒక్కటి కావాలి అని అంతా ఆశించారు. ఈ మధ్యనే కడపకు చెందిన కీలక వైసీపీ నేత సతీష్ కుమార్ రెడ్డి కూడా జగన్ షర్మిల కలిసే రోజు దగ్గరలో ఉందని చెప్పుకొచ్చారు. అలా జరగాలనే అంతా కోరుకుంటున్న నేపధ్యం ఉంది.
జగన్ రిప్లైతో :
అన్నయ్య పుట్టిన రోజున చెల్లెమ్మ షర్మిల ఆయనకు శుభాకాంక్షలు తెలియచేయడం అయితే విశేషంగానే అంతా చూశారు. నిజానికి ఇది సహజమైన విషయమే. కానీ ఇద్దరి మధ్య పెరిగిన దూరంతో అది విశేషం అయింది. తన అన్న బర్త్ డేకి చెల్లెలు విషేష్ చెబితే జగన్ కూడా దానికి అంతే అభిమానంతో రియాక్ట్ అయ్యారు. థాంక్ యూ షర్మిలమ్మా అంటూ ఆయన రీ ట్వీట్ చేశారు. దీంతో జగన్ బర్త్ డే వేళ ఇదే పెద్ద చర్చగా మారింది. ఎంతైనా అన్నా చెల్లెళ్ళు ఇద్దరి బంధం గొప్పది కదా అని అంతా అనుకునే విధంగా ఇది ఉంది అంటున్నారు.
బాబుతో సహా అందరికీ :
ఇక జగన్ తన పుట్టిన రోజున శుభాకాంక్షలు చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు తెలంగాణా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణా రాజకీయ నాయకుడు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇంకా అనేక మందికి కూడా రీ ట్వీట్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
కేసీఆర్ గ్రీట్ :
మరో వైపు చూస్తే తెలంగాణా మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా జగన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు ఇక వీరిద్దరి మధ్య బంధం కూడా ఆసక్తికరమైనదిగా చెబుతారు. కేసీఆర్ జగన్ ఇద్దరూ మంచి స్నేహితులుగా రాజకీయంగా కనిపిస్తారు. ఉమ్మడి ఏపీ రెండుగా మారిన తరువాత వీరి స్నేహం మరింత బలపడింది. జగన్ ఏపీ సీఎం గా గెలవాలని కేసీఆర్ ఎపుడూ కోరుకుంటారు, జగన్ సైతం కేసీఆర్ మంచిని ఆకాక్షిస్తారు. ఇలా తెలుగు నాట ఈ ఇద్దరి బంధం ఎపుడూ చర్చగానే ఉంటుంది. వయసుల మధ్య తేడా ఉన్నా ఈ ఇద్దరి మధ్య అనేక పోలికలు ఉన్నాయి. అలాగే రాజకీయంగా ఇద్దరూ ఇపుడూ గివ్ అప్ ఇచ్చిన సందర్భాలు లేవు, ఇపుడు మాజీ సీఎం లుగా ఉంటూ మరోసారి అధికారం కోసం ఈ ఇద్దరు నేతలు తమ ప్రాంతాలలో పోరాడుతున్నారు.