కూట‌మి సంక‌ల్ప బ‌లం ఇదే: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

``కూట‌మి ప్ర‌భుత్వం ఏదైనా సంక‌ల్పిస్తే.. ఎలా చేస్తుంది.. అనేందుకు ఇదే నిద‌ర్శ‌నం. ఇది కూట‌మి సంక‌ల్ప బ‌లం`` అని ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు.

Update: 2026-08-31 11:46 GMT

``కూట‌మి ప్ర‌భుత్వం ఏదైనా సంక‌ల్పిస్తే.. ఎలా చేస్తుంది.. అనేందుకు ఇదే నిద‌ర్శ‌నం. ఇది కూట‌మి సంక‌ల్ప బ‌లం`` అని ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు. ప్ర‌స్తుతం కేర‌ళ‌లో ఉన్న ఆయ‌న‌.. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. తాజాగా సీఎం చంద్ర‌బాబు వెలిగొండ ప్రాజెక్టు తొలి ద‌శను ప్రారంభించి జాతికి అంకితం చేసిన నేప‌థ్యంలో ప‌వ‌న్ కల్యాణ్ సోషల్ మీడియాలో స్పందించారు. ఈ ప్రాజెక్టు 30 ఏళ్ల ప్ర‌జ‌ల క‌ల‌ల‌ను సాకారం చేసింద‌ని వ్యాఖ్యానించారు.

కూట‌మి ప్ర‌భుత్వంపై ఎన్నో ఆశ‌ల‌తో, మ‌రెన్నో ఆకాంక్ష‌ల‌తో ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టార‌ని, వారి ఆశ‌లు, ఆకాం క్ష‌ల‌ను నెర‌వేర్చేందుకు ప్ర‌య‌త్నంతోపాటు.. కృషి కూడా జ‌రుగుతోంద‌న్నారు. తాజాగా వెలిగొండ ప్రాజె క్టు తొలి ద‌శ‌పూర్తిచేసుకుని కృష్ణ‌మ్మ జ‌లాలు.. క‌రువు పీడిత ప్రాంతాల‌కు ప‌ర‌వ‌ళ్లు తొక్క‌నున్నాయ‌ని తెలి పారు. త‌ద్వారా ఓ చారిత్ర‌క ఘ‌ట్టం ఆవిష్కృతం కానుంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ వివ‌రించారు.

ఈ ప్రాజెక్టు ద్వారా ప్ర‌కాశం, మార్కాపురం, నెల్లూరు, క‌డ‌ప జిల్లాల‌కు ఎన‌లేని మేలు జ‌రుగుతంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు. ఆయా జిల్లాల్లో సాగు భూముల‌కు జ‌వ‌సత్వాలు అందుతాయ‌ని పేర్కొన్నారు. త‌ద్వారా ఇక్క‌డి క‌రువు నేల‌లో ఆశ‌లు చిగురిస్తాయ‌ని, వ‌ల‌స వెళ్లే ప్ర‌జ‌లు ఇక్క‌డే ఉపాధి మార్గాలు, వ్య‌వ‌సాయం చేసుకునే అవ‌కాశం కూడా లభిస్తుంద‌ని ప‌వ‌న్ స్పష్టం చేశారు. తొలి దశ ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందనున్నాయని పేర్కొన్నారు.

మ‌రో పోస్టులో..

రాష్ట్రంలోని పారిశ్రామిక వేత్త‌ల‌ను ఉద్దేశించి ప‌వ‌న్ క‌ల్యాణ్ సామాజిక మాధ్యమంలో మ‌రో పోస్టు పెట్టారు. పారిశ్రామిక వేత్త‌లు విజ్ఞుల‌ని.. వారికి అన్నీ తెలుసున‌ని త‌న‌తో చెప్పించుకోవ‌ద్ద‌ని ఆయ‌న వ్యాఖ్యానించా రు. ప‌ర్యావ‌ర‌ణానికి హాని చేసేలా వ్య‌వ‌హ‌రించరాద‌ని తేల్చి చెప్పారు. అనుమ‌తులు తీసుకోకుండా.. కాలం చెల్లిన అనుమ‌తులు రెన్యువ‌ల్ చేసుకోకుండా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌న్నారు. పరిశ్రమలన్నీ 33 శాతం పచ్చదనాన్ని పాటించాలని, రేపటి తరాలకు `పచ్చని` భవిష్యత్తును అందించేందుకు సహకరించాలని సూచించారు. మ‌రోవైపు.. అన్ని భారీ, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల్లో 33 శాతం ప‌చ్చ‌ద‌నాన్ని పెంచేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కాలుష్య నియంత్ర‌ణ మండ‌లిని ప‌వ‌న్ క‌ల్యాణ్ కోరారు.

Tags:    

Similar News