రాయ‌ల సీమ‌కాదు.. రైజింగ్ సీమ‌: చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం అన్ని ప్రాంతాల‌ను స‌మానంగా అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యించామ‌ని సీఎం చంద్రబాబు తెలిపారు.

Update: 2026-08-31 10:49 GMT

కూట‌మి ప్ర‌భుత్వం అన్ని ప్రాంతాల‌ను స‌మానంగా అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యించామ‌ని సీఎం చంద్రబాబు తెలిపారు. సీమ‌కు అనేక వేల కోట్ల పెట్టుబ‌డులు తీసుకువ‌చ్చామ‌న్నారు. గ‌తంలో కియా.. తాజాగా రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చాయ‌న్నారు. అందుకే రాయ‌ల‌సీమ‌ కాదు.. రైజింగ్ సీమ‌గా పేర్కొంటున్నామ‌ని చెప్పారు. రాష్ట్రంలో అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న కూట‌మికి ప్ర‌జ‌లు అండ‌గా ఉండాల‌ని పిలుపునిచ్చారు.

స‌ర్ణాంధ్ర 2047 సంకల్పంతో ప్ర‌భుత్వం ముందుకు సాగుతోంద‌ని.. అలానే ప్ర‌జ‌లు కూడా సంక‌ల్పం చేసుకోవాల‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి కూట‌మికి ప‌ట్టంక‌ట్టాల‌నే సంక‌ల్పం చేసుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. త‌న‌కు రాజ‌కీయాలంటే.. కేవ‌లం ఎన్నిక‌లు కాద‌ని.. త‌న అభివృద్ధి అజెండా అని పేర్కొన్నారు. గెలుపు ఓట‌ములు, లాభ‌న‌ష్టాల కోసం తాను ఎప్పుడూ చూసుకోలేద‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల కోసం.. తాను ప‌నిచేయ‌డం లేద‌ని. వ‌చ్చే త‌రాల కోసం ప‌నిచేస్తున్నాన‌న్నారు.

``నా ఊపిరి ఉన్నంత వ‌ర‌కు తెలుగు జాతి కోసం క‌ష్ట‌ప‌డ‌తాను. హెల్తీ, వెల్తీ, హ్యాపీ స‌మాజం కోసమే ల‌క్ష్యం గా ముందుకు సాగుతున్నాం. అంద‌రి మ‌ద్ద‌తులో స్వ‌ర్ణాంధ్ర సాధిస్తాం. ఇప్పుడు మీ స‌మ‌యం స్టార్ట‌యింది. మార్కాపురం అన్ స్టాప‌బుల్‌`` అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ఇక్క‌డి ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చామ‌న్నారు. ఈ సంద‌ర్భంగా ప‌చ్చ కండువాను.. చేతిలోకి తీసుకుని గాలిలోకి తిప్పుతూ.. స‌భికుల‌ను ఉత్సాహ ప‌రిచారు.

అది మోడీతోనే సాధ్యం..

దేశంలో న‌దుల అనుసంధానం కోసం తాను ప‌రిత‌పిస్తున్నాన‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. అయితే... దీనిని సాకారం చేయ‌గ‌ల స‌త్తా ఉన్న ఏకైక వ్య‌క్తి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మాత్ర‌మేన‌నితెలిపారు. దీనిపై ఇటీవ‌ల చెన్నైలో జ‌రిగిన స‌మావేశంలో మాస్ట‌ర్ ప్లాన్‌ను ఇచ్చాన‌న్నారు. న‌దుల అనుసంధానంతో రెండు తెలుగు రాష్ట్రాలు మ‌రింత అభివృద్ధి చెందుతాయ‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ దీనికి స‌హ‌క‌రించాల‌ని సూచిం చారు. స‌ముద్రంలో వృథాగా పోతున్న నీటిని ఒడిసి ప‌ట్టుకుంటే.. అంద‌రికీ మేలు జ‌రుగుతుంద‌న్నారు.

Tags:    

Similar News