డ్రైవింగ్ లైసెన్స్‌కి 'ఆన్‌లైన్‌ క్లాస్‌'లు తప్పనిసరి..!

ఎక్కువ శాతం వాహనదారులు డ్రైవింగ్‌ లైసెన్స్ కోసం ముందు లెర్నింగ్‌ లైసెన్స్‌ను తీసుకోవడం జరుగుతుంది.

Update: 2026-08-31 06:40 GMT

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు గాను ప్రభుత్వం డ్రైవింగ్‌ లైసెన్స్ జారీని మరింత కఠినతరం చేయనున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ శాతం వాహనదారులు డ్రైవింగ్‌ లైసెన్స్ కోసం ముందు లెర్నింగ్‌ లైసెన్స్‌ను తీసుకోవడం జరుగుతుంది. లెర్నింగ్‌ లైసెన్స్‌ తీసుకున్న తర్వాత చాలా మంది కనీసం నియమాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. లెర్నింగ్‌ లైసెన్స్ తీసుకున్న తర్వాత తప్పరిసరిగా డ్రైవింగ్‌కు సంబంధించిన విషయాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. కానీ లెర్నింగ్‌ లైసెన్స్‌ తీసుకున్న వారు పెద్దగా డ్రైవింగ్‌ పై పట్టు లేకుండానే టెస్ట్‌కు వెళ్తున్నారు. అక్కడ ఉన్న అధికారులు చూసి చూడనట్లుగా వదిలేయడంతో డ్రైవింగ్‌ టెస్ట్‌లో పాస్ అవుతున్నారు, రోడ్డు మీదకు వాహనంతో వచ్చి యాక్సిడెంట్స్ చేస్తున్నారు. అందుకే డ్రైవింగ్‌ లైసెన్స్‌ పక్రియా మరింత క్లిష్టం చేయాలని నిర్ణయించారు.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ...

రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ కొత్త నిబంధన తీసుకు వచ్చింది. లెర్నింగ్‌ లైసెన్స్‌ తీసుకున్న వారు తప్పనిసరిగా ట్రాఫిక్‌ రూల్స్‌తో పాటు, వాహనాలకు సంబంధించిన విషయాలపై అవగాహణ పెంచుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి శిక్షణ లేకుండానే ఎక్కువ శాతం మంది డ్రైవింగ్‌ టెస్ట్‌ కి హాజరు అవుతున్న కారణంగా, ఆన్‌ లైన్‌ క్లాస్‌లను అయినా నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఎక్కువ శాతం మంది డ్రైవింగ్‌ అయితే బాగానే చేస్తారు, కానీ వారికి కనీసం ట్రాఫిక్ రూల్స్ తెలియదు. కొందరు ట్రాఫిక్‌ రూల్స్ తెలిసినా వాహనంను ఎలా ఆపాలి, ఎలా ముందుకు తీసుకు వెళ్ళాలి అనే విషయాలు తెలియవు. కనుక వాటిని ఆన్‌ లైన్‌ క్లాస్‌ల ద్వారా చెప్పాలని అధికారులు నిర్ణయించారు. అందుకు సంబంధించిన కొత్త నిబంధన తీసుకు వచ్చారు. అతి త్వరలోనే ఈ ఆన్‌ లైన్ కోర్స్ ను ప్రారంభించబోతున్నట్లుగా ఉన్నతాధికారులు చెబుతున్నారు.

లెర్నింగ్‌ లైసెన్స్ కోసం...

అధికారులు చెబుతున్న దాని ప్రకారం వాహనదారుడు లెర్నింగ్‌ లైసెన్స్ కోసం అప్లై చేసిన వెంటనే అతడి ఐడీ పై వీడియో కోర్స్‌ ఉంటుంది. తన ఐడీ ని ఉపయోగించి ఆ వీడియో కోర్స్‌ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. దాదాపుగా మూడు గంటల నిడివి ఉండే వీడియోలను స్కిప్‌ చేయకుండా అప్లికేషన్‌ చేసుకున్న వారు చూడాల్సి ఉంటుంది. వీడియోలను స్కిప్‌ చేసే అవకాశం ఉండదు. తప్పకుండా ఆ పూర్తి వీడియోలను చూడాల్సిందే. ఆన్‌ లైన్‌ ద్వారా మూడు గంటల వీడియో కోర్స్ మొత్తం చూస్తేనే లెర్నింగ్‌ లైసెన్స్‌ నుంచి డ్రైవింగ్‌ టెస్ట్‌ కి అనుమతి దక్కుతుంది. ఈ కొత్త విధానం వల్ల వాహనదారుల్లో ఎక్కువ శాతం ట్రాఫిక్‌ గురించి అవగాహణ వస్తుందని, ప్రతి ఒక్కరూ ముందు ముందు ఈ వీడియోలను చూసే విధంగా రోడ్డు రవాణా శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

సీటు బెల్ట్‌, హెల్మెట్‌ ఉపయోగం..

మూడు గంటలు తప్పనిసరిగా వీడియోలు చూడాల్సిందే. ఈ వీడియో మొత్తం ఆరు మాడ్యూల్స్‌గా విభజించారు. వాహనంను ఎలా స్టార్ట్‌ చేయాలి, హ్యాండ్ బ్రేక్‌ వాడకం, మిర్రర్‌లను ఎలా సెట్‌ చేసుకోవాలి, సీటు బెల్ట్‌, హెల్మెట్‌ యొక్క ఉపయోగం, రాత్రి వేళ లైట్లు ఎలా వినియోగించాలి, రాత్రి ప్రయాణించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాహనాలు పాడై పోతే చేయాల్సిన పని.. ఇలా చాలా విషయాలను వాహనదారులకు ఆ వీడియోల్లో చూపించబోతున్నారు. ఇక ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద చేయాల్సిన పని, ట్రాఫిక్‌లో ఎలా వాహనాలు నడపాలి, ఎదురు వాహనాలు ఇచ్చే సిగ్నల్స్‌ ను ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాలను సైతం వీడియోలో అర్థం అయ్యేలా వివరించడం జరిగిందట. మొత్తానికి ట్రాఫిక్ గురించి, వాహనం గురించి పూర్తి అవగాహన వచ్చే విధంగా మూడు గంటల వీడియోలు డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకోవాలి అనుకునే వారు చూసి తీరాల్సిందే. వీటిని చూడటం ద్వారా ప్రమాదాలు కొత్తగా డ్రైవింగ్‌ లైసెన్స్ తీసుకునే వారు ప్రమాదాలకు తక్కువ గురి అయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News