రోజుకు 12 గంట‌లు.. వారానికి 6 రోజులు: డ్యూటీలో బాబు ఫ‌స్ట్‌

దేశ‌వ్యాప్తంగా ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ముఖ్య‌మంత్రుల ప‌నితీరుపై ఢిల్లీ ఐఐఎం నిపుణులు అధ్య‌యనం చేశారు.

Update: 2026-08-31 11:30 GMT

దేశ‌వ్యాప్తంగా ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ముఖ్య‌మంత్రుల ప‌నితీరుపై ఢిల్లీ ఐఐఎం నిపుణులు అధ్య‌యనం చేశారు. దీనికి సంబంధించిన రిపోర్టును కొన్ని రోజుల్లోనే బ‌హిర్గ‌తం చేయ‌నున్న ట్టు జాతీయ మీడియా వెల్ల‌డించింది. దీనిలో ప్ర‌ధానంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు ప‌నితీరుకు నిపుణులు ఎక్కువ మార్కులు వేయ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా బీహార్‌, ఏపీ, ఒడిశా స‌హా ప‌లు రాష్ట్రాల్లో ఎన్డీయే కూట‌మి పాల‌న సాగుతోంది.

ఆయా రాష్ట్రాల్లోని ముఖ్య‌మంత్రుల ప‌నితీరు విష‌యంపై అధ్య‌య‌నం చేసిన ఢిల్లీఐఐఎం.. ప్ర‌జా సేవ‌కు, పాల‌న‌కు వారు కేటాయిస్తున్న స‌మ‌యం.. వారంలో ఎన్నిరోజులు ప‌నిచేస్తున్నారు.. అనే విష‌యాల‌పై స‌మ‌గ్రంగా అధ్య‌య‌నం చేస్తోంది. దీనిలో ఏపీ సీఎం చంద్ర‌బాబు రోజుల‌కు 12 గంట‌ల పాటు ప‌నిచేస్తున్న‌ట్టు చెప్ప‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి చంద్ర‌బాబు రోజుకు 18 గంట‌లు ప‌నిచేస్తున్నార‌ని.. ఆయ‌నే స్వ‌యంగా చెబుతున్నారు. అయితే.. ఐఐఎం ఢిల్లీ మాత్రం 12 గంట‌లు నిర్విరామంగా ప‌నిచేస్తున్నార‌ని పేర్కొంది.

ఇక‌, వారంలో ఆరు రోజుల పాటు సీఎం చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నార‌ని.. పేర్కొంది. అలానే.. పాల‌న విష‌యంలో 24 గంట‌లూ స్పందిస్తున్నార‌ని తెలిపింది. ఇక‌, మంత్రి వ‌ర్గంతో అత్యంత స‌ఖ్య‌త‌గా ఉంటున్న సీఎంగా కూడా.. చంద్ర‌బాబుకు తొలిస్థానం ఇచ్చింది. మంత్రుల ప‌నితీరుపై ఎప్ప‌టిక‌ప్పుడు ఆయ‌న నివేదిక‌లు తెప్పించుకుని స‌రిచేసుకుంటున్నార‌ని పేర్కొంది. అవినీతి ర‌హిత పాల‌న అందించేందుకు ఏపీ ప్ర‌భుత్వం చేస్తున్న కృషి బాగుంద‌ని కితాబివ్వ‌డం గ‌మ‌నార్హం.

ఒక‌, బీహార్‌లో కొత్త‌గా ఏర్ప‌డిన ప్ర‌భుత్వం బాగానే ప‌నిచేస్తోంద‌ని.. కానీ, సీఎం సువేందు అధికారి కేవ‌లం 6 గంట‌లు మాత్ర‌మే ప్ర‌జ‌లకు అందుబాటులో ఉంటున్నార‌ని తెలిపింది. బీహార్ ముఖ్య‌మంత్రి కూడా 6 గంట‌ల‌కే ప‌రిమితం అవుతున్నార‌ని.. వారానికి 5 రోజులు మాత్ర‌మే ప‌నిచేస్తున్నార‌ని చెబుతోంది. కాగా.. ఈ రిపోర్టుకు సంబంధించిన పూర్తి స‌మాచారాన్ని త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు. ప్ర‌జాభిప్రాయాలు.. పాల‌న తీరు, తీసుకుంటున్న నిర్ణ‌యాల ఆధారంగా ఈ నివేదిక‌ను రెడీ చేస్తున్నార‌ని స‌మాచారం.

Tags:    

Similar News