పవన్ జిల్లా టూర్లకు ముహూర్తం ఎపుడంటే ?

ఈ నేపథ్యంలో జిల్లా టూర్లు పెట్టుకున్నా ఇబ్బంది అవుతుందని జనాలకు సైతం అది సమస్యగా మారుతుందని జనసేన వర్గాలు ఆలోచిస్తున్నాయట.;

Update: 2025-05-03 03:30 GMT

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లా టూర్లకు ముహూర్తం ఎపుడు అన్న చర్చ ఆ పార్టీలో సాగుతోంది. నిజానికి ఈ ఏడాది మొదట్లోనే జిల్లా టూర్లు ఉంటాయని జనసేన వర్గాలు పేర్కొన్నాయి. అయితే అది జరగలేదు ఆ తరువాత చూస్తే మార్చి నెల బడ్జెట్ తో గడచింది. ఏప్రిల్ నెలలో పవన్ కొంత హెల్త్ ఇష్యూస్ తో బాధపడటం తో ముగిసింది.

ఇక మే నెల వచ్చేసింది. మరి పవన్ జిల్లా టూర్లు చేస్తారా అన్నదే చర్చగా ఉంది. అయితే పవన్ ఇటీవల కాలంలో తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారని అంటున్నారు. అంతే కాదు ఆయనకు వెన్ను నొప్పి సమస్య కూడా తీవ్రం అవుతోంది అని అంటున్నారు. దాంతో ఆయన కొన్నాళ్ళ పాటు రెస్ట్ తీసుకోవడమే బెటర్ అన్నది కూడా పార్టీ వర్గాల సూచనగా ఉంది.

చూస్తే ఏపీలో ఎండలు మండుతున్నాయి. మే నెలలో గ్రీష్మ తాపం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో జిల్లా టూర్లు పెట్టుకున్నా ఇబ్బంది అవుతుందని జనాలకు సైతం అది సమస్యగా మారుతుందని జనసేన వర్గాలు ఆలోచిస్తున్నాయట. దాంతో వర్షాలు మొదలై వాతావరణం చల్లబడినాకనే జిల్లా టూర్లకు పవన్ శ్రీకారం చుడతారు అని అంటున్నారు.

ఈ జిల్లా టూర్ల సందర్భంగా ప్రతీ జిల్లాలో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం టచ్ చేయాలని అక్కడ ఉన్న స్థానిక సమస్యలను తెలుసుకోవాలని ప్రభుత్వ పరంగా చేయాల్సిన పరిష్కారాలు తక్షణం చేయాలని కూడా పవన్ ఆలోచిస్తున్నారుట. ఆయన అందుకే వీటి మీద పూర్తి ఫోకస్ పెట్టారని చెబుతున్నారు.

అయితే ఆదరా బాదరాగా చేయడం కన్నా ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ గా చేస్తే దాని వల్ల పార్టీకి ప్రభుత్వానికి ప్రజలకు కూడా ఉపయోగం ఉంటుందని భావిస్తున్నారుట. ఈ నేపధ్యంలోనే పవన్ జిల్లా టూర్లు కొంత ఆలస్యం అవుతున్నాయని చెప్తున్నారు. లేట్ అయినా కూడా పకడ్ బంధీగానే వీటిని నిర్వహించాలని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.

అదే విధంగా పవన్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో కూడా నెలలో కొన్ని రోజులు మకాం వేసి స్థానిక సమస్యలను సాకారం చేయడానికి పవన్ చూస్తున్నారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే పవన్ జిల్లా టూర్లు జూలై తరువాత ఉండవచ్చు అన్నది ప్రస్తుతానికి జనసేన శిబిరంలో వినీస్తున్న మాట.

అదే విధంగా పార్టీ పటిష్టత మీద కూడా పవన్ ప్రత్యేక దృష్టిని పెడుతున్నారని చెబుతున్నారు. గోదావరి జిల్లాలలో పార్టీ బాగుంది. అలాగే ఇతర జిల్లాలలో కూడా పార్టీ పటిష్టం అయ్యేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. దాతో ఆ విషయం మీద పవన్ సీరియస్ గానే ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

Tags:    

Similar News