ప‌వ‌న్ పేరుతో 'మారేడు'.. కాన్సెప్టు హిట్‌!

ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌తీమ‌ణి అన్నా కొణిదెల స్పందిస్తూ.. ఈ రోజును అపురూప‌మైన రోజుగా అభివ‌ర్ణించారు.

Update: 2026-09-02 15:02 GMT

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజును పురస్క‌రించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆయ‌న అభిమానులు, జ‌న సేన పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరుతో మొక్క‌లు నాట‌డం ఆస‌క్తిగా మారింది. భ‌క్తులు ప‌విత్రంగా భావించే మారేడు మొక్క‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరు పెడుతు న్న‌ట్టు. . ఏపీ గ్రీన్ బోర్డు చైర్మ‌న్ నాగ‌బాబు ప్ర‌క‌టించారు. అభిమానులు సైతం ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరుతో మొక్క‌లు నాటాల‌ని సూచించారు.

అన్నా ఏమ‌న్నారంటే..

ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌తీమ‌ణి అన్నా కొణిదెల స్పందిస్తూ.. ఈ రోజును అపురూప‌మైన రోజుగా అభివ‌ర్ణించారు. ఈ క్ర‌మం లో ఆమె ఓ ఫొటోను పంచుకున్నారు. అన్నాప‌క్క‌న ప‌వ‌న్ కూర్చున్న ఫొటో ఎంతో క్యూట్‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం. ``ఈరోజు మీ పుట్టినరోజు సెలబ్రేట్‌ చేసుకుంటున్నాం. మీరు ఎంతోమంది హృదయాల్లో, వారి ఆలోచనల్లో, వారి ప్రార్థనల్లో ఉన్నారు. ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపారు. వాళ్లకు ఎంతో సాయం చేశారనడానికి వారి గుండెల్లో మీ స్థానమే నిదర్శనం. హ్యాపీ బర్త్‌డే’’ అని ముగించారు.

రాష్ట్ర వ్యాప్తంగా..

రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప‌వ‌న్ పేరుతో అభిమానులు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. ర‌క్త‌దాన శిబిరాలు ఏర్పాటు చేశారు. అలాగే.. ఆల‌యాల్లో ప్ర‌త్యేక పూజ‌లు చేయించారు. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ సొంత నియోజ‌క వ‌ర్గం పిఠాపురంలోని పుర‌హూతికా అమ్మవారి ఆల‌యంతో పాటు స్థానిక పీఠంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించా రు.ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తుతం కేర‌ళ‌లో ఆయుర్వేద వైద్యం పొందుతున్న విష‌యం తెలిసిందే.

Tags:    

Similar News