కొండా : నేను రాజీనామా చేయను !

ఎమ్మెల్యేలతో మా మీద బలవంతంగా మాట్లాడించారని, అంతే తప్ప ఎవరూ స్వచ్ఛందంగా వచ్చి మీడియా ముందు మాట్లాడలేదని, బలవంతంగానే తాము వెళ్లామని చెబుతున్నారు.

Update: 2026-09-02 15:06 GMT

‘కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నన్ను ఇప్పటి వరకు రాజీనామా చేయమని అడగలేదు. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వత్తిడికి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం బర్తరఫ్ చేస్తే చేయనివ్వండి. నేను మాత్రం నా పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు’ మంత్రి కొండా సురేఖ ఢిల్లీలో ప్రకటించింది. ఈ వాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నుండి మంత్రి పదవికి రాజీనామా చేయాలని అందిన ఆదేశాల నేపథ్యంలోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఎమ్మెల్యేలతో మా మీద బలవంతంగా మాట్లాడించారని, అంతే తప్ప ఎవరూ స్వచ్ఛందంగా వచ్చి మీడియా ముందు మాట్లాడలేదని, బలవంతంగానే తాము వెళ్లామని చెబుతున్నారు. వారి వెనక ఎవరున్నారో కాంగ్రెస్ అధిష్ఠానం తేల్చాలని మంత్రి కొండా సురేఖ డిమాండ్ చేశారు. వారి వెనుక ఎవరున్నారో తనకు తెలుసని, వారి వివరాలను తాను చెప్పనని అన్నారు.

నా మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వాలని, అధిష్ఠానం వారికి కూడా నోటీసులు ఇవ్వాలని, దాని నేపథ్యం ఆలోచించాలని సురేఖ డిమాండ్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కు తాను చెప్పాల్సింది చెప్పానని అధిష్ఠానానికి నిర్ణయం వదిలేశానని అన్నారు . నాకు అసలు క్రమశిక్షణ సంఘం నోటీసులు ఇవ్వడమే తప్పని, తాను ఏఐసీసీ సభ్యురాలినని, తన మీద ఏ చర్యలు తీసుకున్నా ఏఐసీసీ తీసుకోవాలని అన్నారు.

నా కూతురికి పెళ్లైంది. తాను మాట్లాడిన మాటలకు నాకు సంబంధం లేదు.తాను స్వతంత్రంగా మాట్లాడింది. ఆమెను అలా మాట్లాడొద్దు. అన్న అధికారం నాకు లేదు. ఆమె జీవితం ఆమె ఇష్టం అని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.

అదే సమయంలో తాను బీసీ మహిళా మంత్రిని, నా భర్త మున్నూరు కాపు, నేను పద్మశాలిని, తెలంగాణలో మా కులం ఓట్లు 16 శాతం ఉన్నాయి అని మంత్రి కొండా సురేఖ చెప్పడం గమనార్హం.

నా మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. అవినీతి ఆరోపణలు లేకుండా నా శాఖను నిర్వహిస్తున్నాను అని కొండా సురేఖ చెప్పడం చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఏం చర్యలు తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని వచ్చిన ఆదేశాల నేపథ్యంలోనే కొండా సురేఖ ప్లేటు ఫిరాయించింది అన్న చర్చ నడుస్తోంది.

Tags:    

Similar News