• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ‘ముందు ఫ్యాన్స్ ని ఇక్కడ...

‘ముందు ఫ్యాన్స్ ని ఇక్కడ నుంచి పంపించేయండి’... పవన్ హుకుం!

| సినిమా ఫంక్షన్స్ లో పవన్ కల్యాణ్ మాట్లాడటానికి మైక్ అందుకున్నప్పుడు ఫ్యాన్స్ చేసే హడావిడి గురించి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-01-10 04:40 GMT

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడికి వెళ్లినా, ఏ పరిస్థితుల్లో వెళ్లినా, ఏ కారణం చేత వెళ్లినా.. అక్కడ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ గుమిగూడతారనే సంగతి తెలిసిందే. సినిమా ఫంక్షన్స్ లో అయినా.. రాజకీయ కార్యక్రమాల్లో అయినా అది అత్యంత సహజం అన్నట్లుగా మారింది. అయితే.. ఇటీవల అదే పవన్ కు పెద్ద సమస్యగా మారింది.. ఆగ్రహం తెప్పిస్తోంది.

అవును... సినిమా ఫంక్షన్స్ లో పవన్ కల్యాణ్ మాట్లాడటానికి మైక్ అందుకున్నప్పుడు ఫ్యాన్స్ చేసే హడావిడి గురించి తెలిసిందే. ఆ సమయంలో పవన్ కల్యాణ్ కాస్త సమయం వారు అరవడానికి వదిలేసినట్లుగా ఉండాల్సిన పరిస్థితి నెలకొనేది! దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యేవి. అయితే.. అవి సినిమా ఫంక్షన్స్ కాబట్టి చెల్లిపోయేది.. పవన్ నవ్వి ఊరుకునేవారు.

అయితే.. పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి. ఆయన పలు సందర్భాల్లో, పలు కారణాలతో రకరకాల చోట్ల ప్రయాణిస్తుంటారు. ఆ సమయంలో కొన్ని సందర్భాల్లో ఫ్యాన్స్ వ్యవహారశైలి పవన్ కు చికాకు తెప్పిస్తుందని అంటున్నారు. ఈ సమయంలో ఆయన తన అభిమానుల క్రమశిక్షణపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.

ఈ క్రమంలో... తాజాగా తిరుపతిలోనూ అదే జరిగింది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట పెను విషాధం కలిగించిన సంగతి తెలిసిందే. అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా.. సుమారు 30 మంది గాయపడినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో బాధితులను పరామర్శించేందుకు పవన్ కల్యాణ్ సిమ్స్ కు వచ్చారు.

ఈ సమయంలో అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడారు.. పవన్ ను చూట్టుముట్టారు. ఈ సమయంలో కొంతమంది సెల్ఫీల కోసం ఎగబడగా.. మరికొంతమంది విడియోలు తీసే ప్రయత్నం చేశారు. ఇంకొంతమంది... సీఎం సీఎం అంటూ నినాదాలు చేయగా, ఇంకొందరూ ఓజీ ఓజీ అని నినదించడం గమనార్హం.

ఇలా సమయం సందర్భంగా లేకుండా తన అభిమానులు ప్రవర్తించిన తీరుపై పవన్ అసహనం వ్యక్తం చేశారు. అభిమానులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా.. "మనుషులు చనిపోయారు.. ఇది నినాదాలూ చేసే సమయమా.. మీకు బాధలేదా.. కొంతైనా బాధ్యత లేకపోతే ఎలా అని వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం శృతిమించి ప్రవర్తిస్తున్నట్లు కనిపించడంతోనో ఏమో కానీ... అభిమానులందరినీ ఇక్కడ నుంచి పంపించేయాలని పవన్ పోలీసులను ఆదేశించారు.

పోలీసులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం

ఇంత మంది పోలీసులు ప్రజలను ఆపకుండా ఏం చేస్తున్నారు

సంఘటన జరిగాక కూడా పోలీసులకు బాధ్యత లేకపోతే ఎలా? - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్#PawanKalyan #Tirumala #TirumalaStampede #TirupatiStampede #Tirupati #Tupaki pic.twitter.com/BsGHPkdEOr

— Tupaki (@tupaki_official) January 9, 2025
Tags:    
  • Pawankalyan 
  • Pawankalyanfans 
  • Tirupatistampede 
  • Janasena 
  • Andhrapradesh 
  • Apdeputycm 
  • Chandrababu 
  • Powerstar 
  • OG 
  • Politicalnews 
  • Tirumalaincident 

Similar News

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

Copyright @2026

Powered by Blink CMS