• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కేటీఆర్ కీలక ట్వీట్.....

కేటీఆర్ కీలక ట్వీట్.. సురేశ్ బీఆర్ఎస్ నాయకుడే అన్న నరేందర్‌రెడ్డి

| దీంతో సురేశ్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తుండగా.. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు.

By - Tupaki Desk
Update: 2024-11-13 05:12 GMT

వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌ జైన్‌పై దాడిలో సురేశ్ కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతడు రెచ్చగొట్టడం వల్లే గ్రామస్తులు ఈ దాడులకు పాల్పడినట్లుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఇదే క్రమంలో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డితోనూ ఆయనకు ఉన్న సంబంధాలను బయటపెట్టారు. దాడి సమయంలోనూ సురేశ్ నరేందర్ రెడ్డికి ఫోన్లు చేయడాన్ని కనిపెట్టారు. దీంతో సురేశ్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తుండగా.. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు.

ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై మాజీఎమ్మెల్యే నరేందర్ రెడ్డి స్పందించారు. సురేశ్ బీఆర్ఎస్ నాయకుడేనని వెల్లడించారు. ఆయనకు చెందిన ఏడెకరాల పొలం ఫార్మా కంపెనీతో పోతోందన్న ఆవేదనతో అందరితో కలిసి పబ్లిక్ హియరింగ్‌ను బహిష్కరించాడని చెప్పారు. పబ్లిక్ హియరింగ్‌ను బాయికాట్ చేసిన వారిలో బీఆర్ఎస్ కార్యకర్తలే కాకుండా కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు సైతం ఉన్నారని తెలిపారు. కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సురేశ్ తమతో రోజూ వివిధ పనుల గురించి మాట్లాడుతనే ఉంటాడని, భూ సేకరణను గ్రామంలో బహిష్కరిస్తున్నామని కూడా తనకు చెప్పిండని, బహిష్కరించాలని తాను కూడా చెప్పానని, అది కూడా శాంతియుతంగా బహిష్కరించాలని సూచించానని తెలిపారు. వారు బహిష్కరించిన తర్వాత కలెక్టర్ గ్రామానికి వెళ్లారని, అందుకే గొడవ జరిగిందని పేర్కొన్నారు.

ఫార్మా సిటీకి భూములు ఇవ్వలేమని గత ఆరు నెలలుగా రైతులు సీఎంకు చెప్తూనే ఉన్నారని నరేందర్ రెడ్డి చెప్పారు. కలెక్టర్‌పై జరిగిన దాడి సీఎం నిర్ణయాలే కారణమని పేర్కొన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు సీఎం సోదరుల కోసమా..? బామ్మర్ది కోసమా..? అని నిలదీశారు. ఫార్మా కంపెనీ భూ బాధితులు అవసరమైతే ప్రాణాలైనా ఇస్తాం కానీ కంపెనీకి భూములు ఇచ్చేది లేదని అంటున్నారని చెప్పారు. కలెక్టర్‌పై దాడిని ఖండిస్తున్నామని, దాడులు చేసిన వారిని తప్పకుండా అరెస్టు చేయాలని, రైతులను కాదని అన్నారు.

మరోవైపు.. నరేందర్ రెడ్డి అరెస్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సీఎం తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్‌కు ఆపాదించే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తలతో మాట్లాడిన కూడా ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేస్తున్న దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇది అని ఫైర్ అయ్యారు. ప్రజలు తిరగబడుతుంటే వారిని అణిచివేసేందుకు లగచర్లలో అప్రజాస్వామిక చర్యలకు దిగినారని పేర్కొన్నారు. అరెస్టులతో తమను భయపెట్టాలని చూస్తే అది మూర్ఖత్వపు చర్యనే అవుతుందని తెలిపారు. ఉద్యమం కాలం నుంచి ఎన్నో నిర్బంధాలు, అక్రమ అరెస్టులు చూశామని తెలిపారు. అరెస్ట్ చేసిన పట్నం నరేందర్ రెడ్డిని, రైతులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

Tags:    
  • Brsleader 
  • Patnamnarenderreddy 
  • Suresh 
  • Telanganapolitics 
  • KTR 
  • BRS 
  • Patnamnarenderarrest 

Similar News

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

Copyright @2026

Powered by Blink CMS