• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఉగ్రవాదం ఉప్పుపై రాజేసిన...

ఉగ్రవాదం ఉప్పుపై రాజేసిన నిప్పు కార్చిచ్చు కానుందా?

| ప్రాణ నష్టం పెరుగుతుండడంతో మొత్తానికి ఈ నిప్పు కార్చిచ్చుగా మారుతుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

By - Tupaki Desk
Update: 2024-01-18 09:52 GMT

సంప్రదాయకంగా రెండూ ముస్లిం దేశాలే.. రెండూ అణ్వస్త్ర దేశాలే.. అయితే సంబంధాలు మాత్రం అంతంతే..? అలాంటి వాటి మధ్య ఇప్పుడు పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఉగ్రవాదం పేరిట జరుగుతున్న పరస్పర దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. హెచ్చరికలు శ్రుతిమించుతున్నాయి. మా భూభాగం మీద మీ పెత్తనమేంటనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ప్రాణ నష్టం పెరుగుతుండడంతో మొత్తానికి ఈ నిప్పు కార్చిచ్చుగా మారుతుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఊహించని పరిణామమే..?

పశ్చిమాసియాలో బలమైన దేశం ఇరాన్. ఎంత బలమైనది అంటే.. అమెరికాను ఎదిరించేంతగా. అత్యంత ఖరీదైన పంట.. కుంకుమపువ్వు 90 శాతం ఇరాన్ లోనే పండుతుంది. ఒకప్పుడు స్వేచ్ఛాయుత దేశమే అయినా.. 40 ఏళ్ల కిందట వచ్చిన విప్లవంతో మత రాజ్యంగా మారింది. ఇరాన్ ను లొంగదీసుకోవాలని అమెరికా ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇక ఇరాన్ తోటి ముస్లిం దేశమైన పాకిస్థాన్ పై రెండు రోజుల కిందట అనూహ్యంగా బలూచిస్థాన్ లోని 'జైష్‌ అల్‌ అదిల్‌' మిలిటెం గ్రూపు రెండు స్థావరాలపై దాడి చేసింది.. దీంతో పాములాంటి పాకిస్థాన్ తోక తొక్కింది. ఈ దాడులకు తీవ్ర పరిణామాలుంటాయంటూ పాక్ అప్పుడే మండిపడింది. 24 గంటల్లోనే ప్రతి దాడులకు దిగింది. ఇరాన్ లోని సియెస్థాన్‌-ఒ-బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌ లోని కొన్ని ప్రదేశాలు లక్ష్యంగా వైమానిక దాడులకు దిగింది. ప్రభుత్వం తరఫున ఎటువంటి ప్రకటనా చేయకున్నా.. 'బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌', 'బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ' కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. ఇరాన్‌ సియెస్థాన్‌-ఒ-బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని ఉగ్ర స్థావరాలపై జరిగిన ఈ దాడులకు 'మార్గ్‌ బర్‌ సర్మచార్‌' అనే పేరు పెట్టింది.

9 ప్రాణాలు బలి

పాకిస్థాన్ దాడుల్లోల ఇరాన్ లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిని ఉగ్రవాదులుగా పాక్ చెబుతోంది. తమ దేశానికి చెందిన ఉగ్రవాదులు ఇరాన్ లో ఉంటూ కార్యకలాపాలు సాగిస్తున్నారని కొన్నేళ్లుగా హెచ్చరిస్తున్నట్లు తెలిపింది. ఇరాన్‌ వాటిని పట్టించుకోలేదని ఆరోపించింది. అక్కడివారే తమ దేశంలో రక్తపాతానికి కారణమవుతున్నారని ఆరోపించింది. కాగా, పాక్‌ దాడిలో నలుగురు పిల్లలు, ముగ్గురు మహిళలు మరణించినట్లు సియెస్థాన్‌-ఒ-బలూచిస్థాన్ ప్రావిన్స్‌ డిప్యూటీ గవర్నర్‌ తెలిపారు. వీరు ఇరాన్‌ పౌరులు కాదని చెప్పారు. వెల్లడించారు. పాక్‌ దాడికి సంబంధించినవిగా పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో పలు ఫొటోలు, వీడియోలు వైరలవుతున్నాయి. వాటిని ధ్రువీకరించడానికి ఎలాంటి ఆధారాలు లేవు.

ఈ ఘర్షణ ఎటుపోతుందో?

అమెరికా మద్దతున్న పాకిస్థాన్ అసలే ఉగ్ర కేంద్రం.. ఇరాన్ మాత్రం కరుడుగట్టిన అమెరికా వ్యతిరేకి. అలాంటి రెండు దేశాల మధ్య ఉగ్రవాదం ఆరోపణలతో దాడులు పరస్పర జరగడం అనూహ్యమే. ఇది చివరకు ఎక్కడకు దారితీస్తుందోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పశ్చిమాసియాలో ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య యుద్ధం తీవ్రంగా ఉంది. ఉక్రెయిన్-రష్యా రెండేళ్ల నుంచి యుద్ధంలోనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇరాన్-పాక్ మధ్య సమస్య తలెత్తడం గమనార్హం.

Tags:    
  • Pakistan 
  • Iran 
  • Terrorism 
  • Jaishaladl 
  • Attacks 
  • America 
  • Civillian 
  • Deaths 
  • Deputygovernor 

Similar News

బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం : రేపు తుపాను, ఎల్లుండి తీవ్రతుపాను

2026-11-15 06:18 GMT

నో పైలెట్.. నో ఫ్యూయ‌ల్.. విద్యుత్‌తో న‌డిచే విమానాన్ని క‌నిపెట్టిన చైనా!

2026-11-15 06:18 GMT

మృత్యువు ఎంత దూరం !

2026-11-15 05:30 GMT

IPL బాస్‌కి మాఫియా బెదిరింపులు లేక‌పోయినా బ్రిటీష్ పౌర‌స‌త్వం దేనికి?

2026-11-15 05:29 GMT

ICE నియామకాల ప్రచారంపై విమర్శలు.. అమెరికాలో కొత్త వివాదం!

2026-11-15 05:28 GMT

చంద్రబాబు కాన్వాయ్ కోసం ఆరు కొత్త వాహనాలు.. ఖర్చు రూ.1.78 కోట్లు!

2026-11-15 04:29 GMT

జెన్సన్ హువాంగ్‌ను తిరిగి తీసుకోవాలంటూ పిటిషన్.. లక్ష దాటిన సంతకాలు!

2026-11-15 04:29 GMT

భారత్ - అమెరికా ట్రేడ్ డీల్‌పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు.. ఇంకా అమెరికా దగ్గరే కొన్ని చిక్కులు!

2026-11-15 04:28 GMT

మంత్రులకు డేంజర్ బెల్స్ ?

2026-11-15 03:43 GMT

గుండ ఫ్యామిలీతో ఢీ ... అనుకున్నంత ఈజీ కాదా ?

2026-11-15 03:43 GMT

మోడీనే తలచుకుంటూ...రాహుల్ ఎదిగిపోయారా ?

2026-11-15 03:42 GMT

మోడీతో డీకే ...కోపరేషన్ కోసమేనా ?

2026-11-15 03:42 GMT

Copyright @2026

Powered by Blink CMS