• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సింధూరం తీసేనోళ్లను...

సింధూరం తీసేనోళ్లను ప్రకృతిని వదలట్లేదుగా?

| బోడిగుండుకు మోకాలికి ముడి పెట్టటం ఇదే అనుకోవచ్చు కొందరు. కానీ.. సున్నితంగా చూసినప్పుడు అందులో నిజం లేకపోలేదుగా? అనిపించక మానదు.

By - Tupaki Desk
Update: 2025-05-16 05:11 GMT

బోడిగుండుకు మోకాలికి ముడి పెట్టటం ఇదే అనుకోవచ్చు కొందరు. కానీ.. సున్నితంగా చూసినప్పుడు అందులో నిజం లేకపోలేదుగా? అనిపించక మానదు. ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నప్పుడు.. వాటిని వదిలేసి.. పాకిస్తాన్.. దానికి గుడ్డిగా మద్దతు ఇచ్చే టర్కీ అలియాస్ తుర్కియాలకు వరుస పెట్టి ప్రకృతి పెడుతున్న పరీక్షలు ఇప్పుడు చర్చగా మారాయి. ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్న భారీ భూకంపాలతో పాక్. టర్కీలు కిందా మీదా పడుతున్నాయి.

మూడు రోజుల క్రితం దాయాది పాకిస్తాన్ లో భూకంపం చోటు చేసుకుంది. వారం వ్యవధిలో మూడుసార్లు భూప్రకంపనల కారణంగా ఆ దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అకారణంగా భారత్ లోని ఉగ్రదాడికి తన వంతు సహాయ సహకారాల్ని పాక్ అందించిందనటంలో సందేహం లేదు. వారు చేసే అరాచకాలకు.. అమాయకుల ప్రాణాల్ని ఎలాంటి దయ.. మానవత్వం అన్నది లేకుండా అమాయక ప్రజల్నివారి కుటుంబ సభ్యుల ఎదుట పిట్టల్నికాల్చినట్లుగా కాల్చేసిన వైనం వారి గుండెల్ని పగిలేలా చేశాయి. వారి వేదన.. శాపనార్థాల్ని ఎవరు విన్నా.. వినకుండా ప్రకృతి విని ఉన్నట్లుగా కనిపిస్తోంది.

మొదటి భూకంపం మే 5న రాగా.. రెండోది మే 10న చోటు చేసుకుంది. పాక్ లో భూకంపం చోటు చేసుకోవగా.. మే 12న కూడా పాక్ లో భూకంపం వచ్చింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 4.06గా వెల్లడించారు. ఈ భూకంపం కారణంగా ప్రజలు భయాందోళనలతో పరుగులు తీసినట్లుగా వార్తా సంస్థలు వెల్లడించాయి. పాక్ పాలకుల అరాచకాలకు ప్రకృతి సైతం స్పందించిందనన వాదన సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. అనూహ్య రీతిలో పాకిస్తాన్ కు గుడ్డిగా సపోర్టు చేస్తూ.. భారత్ కు దూరంగా ఉండటం.. తప్పుడు ప్రచారాలు చేసుకోవటం లాంటివి టర్కీ పాలకుల్లో కనిపిస్తాయి. పహల్గాం ఉగ్రవాడిని ప్రపంచ దేశాలు ఖండిస్తే.. తుర్కియా (టర్కీ) అందుకు భిన్నంగా వ్యవహరించింది. అన్నింటికి మించిన ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్ దుర్మార్గాలకు.. దుర్నీతికి.. అధర్మాలకు తోడుగా.. భారత్ మీద విచక్షణ కోల్పోయి దాడులకు తెగబడిన పాక్ కు సపోర్టు ఇవ్వటం ద్వారా తుర్కియో దాయాది చేసిన పాపాల్లో తాను వాటా తీసుకుందని చెప్పాలి.

అందుకే కాబోలు ఇప్పటికే మూడుసార్లు భూకంప తీవ్రత పాకిస్తాన్ కు చూపించిన ప్రకృతి.. ఇప్పుడు టర్కీ మీద ఫోకస్ చేసిందా? అన్న ప్రశ్నతలెత్తేలా చేస్తోంది. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి వేళలో భూకంపం సడన్ గా చోటు చేసుకోవటం.. ఈ తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 5.2గా చెబుతున్నారు. భూకంపం ధాటికి ఆ దేశంలో పలు భవనాలు నేలకూలినట్లుగా వార్తలు వస్తున్నాయి.

టర్కీ సెంట్రల్ అనటోలియా ప్రాంతంలోని కోన్యా ప్రావిన్సులో ఈ భూకంపం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ భూకంపం ధాటికి ఇస్తాంబుల్.. అంకారాలతో పాటు ఇతర ప్రాంతాల్ని కుదిపేసింది. 1.6 కోట్ల జనాభా ఉన్న ఇస్తాంబుల్. అంకారాలతో పాటు పలు ప్రాంతాల్లో వ్యాప్తి చెందుతున్నాయి.భూకంపం ధాటికి ఆ దేశం తీవ్రంగా నస్టపోయినట్లుగా చెబుతున్నారు. పలు చోట్ల ఆ దేశ ప్రజలు భయాందోళనలతో పరుగులు తీసినట్లుగా చెబుతున్నారు.

ఇప్పటివరకు జరిగిన ప్రాణ నష్టం.. ఆస్తి నష్టాన్ని పక్కన పెడితే.. భారతీయుల్లో చాలామంది టర్కీలో తాజాగా ఎదుర్కొంటున్న పరిణామాలు కచ్ఛితంగా భూమాతను ఇబ్బందికి గురి చేసి ఉండొచ్చని చెబుతున్నారు. మొత్తంగా పాక్ చేసి పాపాలకు అండగా నిలిచిన టర్కీ అలియాస్ తర్కియాకు ప్రకృతి సరైన రీతిలో సమాదానం ఇచ్చినట్లుగా చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి.

Tags:    
  • PakistanEarthquake 
  • TurkeyEarthquake 
  • PrakritiDandana 
  • GeopoliticsAndNature 
  • IndiaPakistanTensions 
  • TurkeySupportToPakistan 
  • NaturalJustice 
  • EarthquakeNews 
  • OpinionPiece 
  • TeluguCurrentAffairs 
  • OperationSindoor 

Similar News

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS