చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఏది మంత్రి జీ?

తాజాగా స్పందించిన పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.;

Update: 2025-05-10 13:30 GMT

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా కేవలం ఉగ్రవాదులనే లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. అది అక్కడితో అయిపోయింది! ఈ దాడుల్లో పాక్ పౌరులకు కానీ, సైనిక స్థావరాలకు కానీ భారత సైన్యం ఎక్కడా హాని తలపెట్టలేదు.. పెట్టాలనుకుంటే ఆ సమయంలో అది పెద్ద విషయమూ కాదు!

కానీ... భారత్ లక్ష్యం పాక్ పౌరులు, పాక్ సైన్యం కాదు.. పాక్ పక్కలో దాక్కున్న ఉగ్రవాదులు! అయితే... తమ అమాయకులైన అమరవీరుల మరణాలకు ప్రతీకార చర్యలు తప్పవంటూ తగుదునమ్మా అంటూ భారత్ పై దాడులు మొదలుపెట్టింది పాక్. మరోపక్క నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఉల్లంఘనలు చేసింది.

ఈ క్రమంలో గురువారం ఉదయం నుంచి సుమారు 36 ప్రాంతాలపై దాదాపు 400 డ్రోనులతో దాడులకు యత్నించింది. శుక్రవారం మరో 26 ప్రాంతాల్లో దాడులు చేసింది. ఈ విషయంలో స్కూల్స్, హాస్పటల్స్ పై కూడా దాడులు చేసే స్థాయికి దిగజారిపోయింది! మరి భారత సైన్యం ఊరుకుంటుందా? పాక్ గుండెలపై గురిపెట్టి బాదేసింది!

భారత్ దాడుల దెబ్బకు పాకిస్థాన్ ప్రధాని సేఫ్ హౌస్ కి పోగా, పాక్ ఆర్మీ చీఫ్ కలుగుల్లో దాకొన్న పరిస్థితి! మరోపక్క 7 బిలియన్ డాలర్ల అప్పు అడిగితే... 1 బిలియన్ డాలర్లు ఇచ్చి సర్ధుకోమని చెప్పింది ఐఎంఎఫ్! ఇది పాక్ ఉన్న ఆర్థిక పరిస్థితికి ఏపాటి? దీంతో.. తత్వం బోధపడిందో లేక డబుల్ యాక్షనో తెలియదు కానీ సన్నాయి నొక్కులు నొక్కుతోంది పాక్!

అవును... భారత్ తో యుద్ధం వస్తే మామూలుగా ఉండదని.. ఈ యుద్ధంలో పాక్ మనుగడకు ప్రమాదం వస్తే ప్రపంచమే ఉండదని బీరాలు పలికిన పాక్.. రెండు రోజులకే చల్లబడినట్లు కనిపిస్తుంది. ఇందులో భాగంగా... మాట మరుస్తుంది. తాజాగా స్పందించిన పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... భారత్ తమపై చేస్తున్న సైనిక దాడిని ఇక్కడితో ఆపితే తాము కూడా ఉద్రిక్తతలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇరుదేశాల మధ్య దాడుల వల్ల పాక్ ఆర్థిక పరిస్థితి మరింత కుదేలవ్వడంతో పాటు ప్రజల పరిస్థితులు అధ్వాన్నంగా మారే ప్రమాదం ఉందని.. న్యూఢిల్లీతో చర్చలు జరపడానికి ఇస్లామాబాద్ సిద్ధంగా ఉందని పాక్ అధికారిక వర్గాలు తెలిపాయి!

దీంతో... భారత్ దాడులు ఆపేస్తుందని చెబితే.. మా వాళ్లతో మాట్లాడి ఆపిస్తాను అని చెప్పాల్సిన స్థితిలో ఉన్న పాక్... భారత్ ఇక్కడితో ఆపేస్తే, మా వాళ్లతో మాట్లాడతాను అని చెప్పడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఓ పక్క మానవత్వం మరిచి స్కూళ్లు, ఆసుపత్రులపై కూడా దాడులు చేస్తున్న పాక్.. భారత్ 10 నిమిషాలు గ్యాప్ ఇస్తే బ్రతకనిస్తుందా?

దీంతో... పాక్ చెప్పే కబుర్లకు, చేసే పనులకు ఏమైనా పొంతన ఉందా మినిస్టర్ జీ అని అని ఇషాక్ దార్ ని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఇదే సమయంలో ‘చూశారా సర్ పాక్ డబుల్ యాక్షన్’ అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. ఈ ఆలోచన మొదటి బుల్లెట్ పేల్చక ముందు ఉండాలని.. ఒకసారి రంగంలోకి దిగాక పిరికోడే బేరాలాడతారని అంటున్నారు.

Tags:    

Similar News