• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఏపీలో ఒక పాకిస్థాన్......

ఏపీలో ఒక పాకిస్థాన్... తెరపైకి ఆసక్తికర విషయాలు!

| అవును... భారత్ – పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఏపీలోని విజయవాడలో పాకిస్థాన్ అనే కాలనీ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.

By - Tupaki Desk
Update: 2025-05-08 10:30 GMT

పహల్గాం ఉగ్రదాడి అనంతరం ప్రతీకారంతో రగిలిపోయిన భారత్... ఆపరేషన్ సింధూర్ చేపట్టి, పాక్ ఉగ్రవాదులకు ముచ్చేమటలు పట్టించింది. మంగళవారం అర్ధరాత్రిని కాళరాత్రిగా మార్చిన భారత సైన్యం 9 స్థావరాలపై దాడులు చేసి సుమారు 80 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల్లోనూ యుద్ధ సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు.

ఇప్పటికే సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. జమ్మూకశ్మీర్ లోని నియంత్రణ రేఖ వెంబడి భారత్ సైన్యానికి, పాక్ రేంజర్లకు ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఇక సరిహద్దు రాష్ట్రాల్లోనూ అప్రమత్తమైన అధికారులు హై అలర్ట్ జారీ చేశారు. ఈ సమయంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. ఏపీలో ఓ కాలనీ పాత పేరు తెరపైకి వచ్చింది.

అవును... భారత్ – పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఏపీలోని విజయవాడలో పాకిస్థాన్ అనే కాలనీ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. వాస్తవానికి ఆ దేశానికి ఈ కాలనీకి ప్రస్తుతం ఏమీ సంబంధం లేనప్పటికీ.. నాడు పెట్టుకున్న ఆ పేరు చాలాకాలం ఉండటం ఆ కాలనీవాసులకు నాడు అతిపెద్ద సమస్యగా మారి అనేక ఇబ్బందులు కలిగించిందని అంటున్నారు.

వాస్తవానికి ఈ కాలనీ పేరు ఇప్పుడు పెట్టింది కాదు. సుమారు 45 ఏళ్ల క్రితం 1980 కాలంలో పాకిస్థాన్ నుంచి వచ్చిన శరణార్థులు ఈ ప్రాంతానికి వచ్చి నివాసం ఉంటూ.. ఆ కాలనీకి ఆ పేరు పెట్టుకున్నారు! ఇది విజయవాడ సిటీ కార్పొరేషన్ పరిధిలోని 62వ డివిజన్ పరిధిలో ఉండేది! ఈ కాలనీ పేరు నాడు అక్కడి ప్రజలకు అతిపెద్ద సమస్యగా మారిందట!

ఈ కాలనీ వాసుల ఆధార్, రేషన్, పాన్ కార్డు సహా అన్ని సర్టిఫికెట్లలోనూ చిరునామా... పాకిస్థాన్ కాలనీ, విజయవాడ అనే ఉండేది! అయితే.. నాడు ఈ ప్రాంతానికి వచ్చిన పాక్ శరణార్థులు ఎవరూ తర్వాత కాలంలో లేనప్పటికీ.. కాలనీ పేరు మాత్రం కంటిన్యూ అయ్యింది. అయితే అనంతర కాలంలో కాలనీ వాసులు ఓ నిర్ణయం తీసుకున్నారు.

ఈ కాలనీ పేరు పాకిస్థాన్ అని ఉండటం వల్ల తాము చాలాకాలం ఎదుర్కొన్న ఇబ్బందులకు చరమగీతం పాడాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే కాలనీ వాసులంతా కలిసి తమ కాలనీ పేరు భగీరథ కాలనీగా మార్చుకున్నారు. తాజాగా భారత్ – పాక్ మధ్య ఉద్రిక్త వాతావారణం ఏర్పడిన నేపథ్యంలో మరోసారి ఈ కాలనీ చరిత్ర తెరపైకి వచ్చింది!

కాగా... 1971లో భారత్ – పాక్ మధ్య యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించింది.. ఫలితంగా పాకిస్థాన్ నుంచి తూర్పు పాకిస్థాన్ విడిపోయి ప్రస్తుత బంగ్లాదేశ్ గా అవతరించింది. దీంతో నాడు తూర్పు పాకిస్థాన్ నుంచి లక్షల మంది శరణార్థులు భారత్ కు వచ్చారు. అందులో కొంతమంది బెజవాడకు వచ్చారు!

Tags:    
  • BhagirathaColony 
  • VijayawadaNews 
  • PakistanColony 
  • IndiaPakistanTensions 
  • Operationsindoor 
  • AndhraPradesh 

Similar News

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

Copyright @2026

Powered by Blink CMS