• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కార్గిల్ వార్ తర్వాత...

కార్గిల్ వార్ తర్వాత తొలిసారి... పాకిస్థాన్ కీలక స్టెప్!

| భారత పౌరులు, సైనిక స్థావరాలు లక్ష్యంగా డ్రోనులు, క్షిపణులు, ఫైటర్ జెట్లతో దూసుకు వస్తోంది. ఈ సమయంలో పాక్ సైన్యం మరో బిగ్ స్టెప్ వేసిందని అంటున్నారు.

By - Tupaki Desk
Update: 2025-05-10 07:50 GMT

గత రెండు రోజులుగా భారత్ - పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనివిధంగా అన్నట్లుగా పాక్ దూకుడు ప్రదర్శిస్తోందని అంటున్నారు. భారత పౌరులు, సైనిక స్థావరాలు లక్ష్యంగా డ్రోనులు, క్షిపణులు, ఫైటర్ జెట్లతో దూసుకు వస్తోంది. ఈ సమయంలో పాక్ సైన్యం మరో బిగ్ స్టెప్ వేసిందని అంటున్నారు.

అవును... 1999 కార్గిల్ యుద్ధం తర్వాత తొలిసారిగా పాక్ సైన్యం ముందుకు కదులుతోంది. ఇందులో భాగంగా... సరిహద్దు వెంబడి ఉన్న ప్రాంతాలకు పాకిస్థాన్ తన సైన్యాన్ని తరలిస్తోందని ప్రభుత్వం తెలిపింది. అయితే... భారత దళాలు సిద్ధంగా, అప్రమత్తంగా ఉన్నాయని రక్షణశాఖ వెల్లడించింది. ఇప్పటికే వరుసగా దాడులు చేస్తోన్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా.. గురువారం రాత్రి 36 ప్రాంతాల్లోనూ, శుక్రవారం రాత్రి 26 ప్రాంతాల్లోనూ పాక్ సైన్యం దాడులకు తెగబడిందని ప్రభుత్వం తెలిపింది. అయితే శుక్రవారం సైనిక స్థావరాలతో పాటు పౌర మైలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్రయత్నించిందని వెల్లడించింది. మరోపక్క ఆరు పాక్ వైమానిక స్థావరాలపై భారత్ దాడులు చేసిందని తెలిపింది.

ఈ సందర్భంగా... పాకిస్థాన్ సైన్యం సరిహద్దు ప్రాంతాలకు తమ దళాలను వేగంగా పెద్ద ఎత్తున తరలిస్తున్నట్లు తెలుస్తోందని.. ఇది ప్రస్తుతం పరిస్థితిని మరింత తీవ్రతరం చేయాలనే ఉద్దేశ్యాన్ని సూచిస్తుందని.. అయితే భారత సాయుధ దళాలు ఈ విషయంలో పక్కగా సిద్ధంగా ఉన్నాయని.. శత్రు చర్యలను, శత్రు సైన్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని తగిన విధంగా స్పందిస్తాయని తెలిపారు.

ఇదే సమయంలో... శనివారం తెల్లవారుజామున "ఆపరేషన్ బన్యన్ ఉల్ మర్సూన్" ను పాకిస్థాన్ ప్రారంభించిందని చెప్పిన కేంద్రం.. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ లలోని సైనిక స్థావరాలతో పాటు స్కూళ్లు, హాస్పటల్స్ ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసిందని తెలిపారు.

ఇక.. ఈ ఆపరేషన్ పేరు విషయానికొస్తే... ఇది ఖురాన్ నుంచి తీసుకోబడింది. దీనర్ధం "విచ్ఛిన్నం కాని గోడ"! అల్ జజీరా ప్రకారం... "బున్యన్ మార్సూస్ అనేది అరబిక్ పదం కాగా.. దీనర్ధం "సీసంతో చేసిన నిర్మాణం"! అంటే... తనను తాను ఒక లక్ష్యం కోసం పోరాడుతున్న ఓ దుర్భేద్యమైన గోడ లేదా నిర్మాణంగా చిత్రీకరించుకోవాలని పాక్ కోరుకుంటుందన్నమాట!

Tags:    
  • IndiaPakistanTensions 
  • BunyanAlMarsous 
  • BorderUpdates 
  • IndianArmy 
  • PakistanArmy 
  • KargilAftermath 
  • DefenseAlert 
  • JammuKashmir 
  • AirStrikes 
  • MilitaryConflict 
  • OperationSindoor 
  • IndiaStrikePOK 
  • Indiamissileattack 
  • IndiaPakistanWar 
  • IndianNavy 
  • IndianAirforce 

Similar News

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

Copyright @2026

Powered by Blink CMS