ఆలయాలు.. ఇళ్ల పై కంటిన్యూగా దాడులు చేస్తున్న పాక్

ఈ క్రమంలో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తాజాగా ఒక వీడియోను షేర్ చేశారు. భారత గగనతలంలోని ప్రజల నివాసాల్ని.. దేవాలయాల్ని టార్గెట్ చేస్తున్న వైనం కళ్లకు కట్టే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.;

Update: 2025-05-10 09:21 GMT

కడుపులోనే కాదు.. ఒళ్లంతా విషాన్ని ఉంచుకున్న పాకిస్తాన్.. విడి వేళల్లోనే కాదు.. యుద్ధ సమయాల్లోనూ తప్పుడు మాటలు మాట్లాడుతోంది. ఫేక్ ప్రచారానికి తెర తీస్తోంది. అబద్ధాల్ని వండి వారుస్తోంది. చేసే పనికి.. చెప్పే మాటలకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తోంది. ఓవైపు తన మాదిరి అమాయకులు ఎవరూ ఉండరన్నట్లుగా చెబుతూ.. భారత్ మీద విషం కక్కే దాయాది.. తాజా ఉద్రిక్తతల వేళ.. తప్పుడు ప్రచారాన్ని భారీ ఎత్తున చేపట్టింది.

ఈ క్రమంలో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తాజాగా ఒక వీడియోను షేర్ చేశారు. భారత గగనతలంలోని ప్రజల నివాసాల్ని.. దేవాలయాల్ని టార్గెట్ చేస్తున్న వైనం కళ్లకు కట్టే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. గడిచిన కొద్ది రోజులుగా చేస్తున్న దాడులకు నిదర్శనంగా.. దెబ్బ తిన్న ఇళ్లు ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

జమ్ముకశ్మీర్ లోని శంభూ దేవాలయం ధ్వంసమైన విషయానికి సంబంధించి రక్షణ శాఖ ఫోటోలతో పాటు వీడియోను షేర్ చేసింది. శుక్రవారం రాత్రి మొత్తం డ్రోన్లతో దాడులు చేస్తూనే ఉన్న పాకిస్తాన్.. భారత ఆర్మీ వాటిని సమర్థంగా ఎదుర్కొంటూ నిర్వీర్యం చేస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రజల జీవితాల్ని ప్రభావితం చేసేలా.. వారి నివాసాలపై దాడులు చేయటం ప్రపంచం మొత్తానికి తెలియాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News