పాక్ - ఆఫ్గాన్ యుద్ధంపై బిగ్ అప్ డేట్.. ఖతార్, టర్కీ కీలక భూమిక!

గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ – ఆఫ్గనిస్థాన్ మధ్య సరిహద్దుల వెంబడి తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే.;

Update: 2025-10-19 05:23 GMT

గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ – ఆఫ్గనిస్థాన్ మధ్య సరిహద్దుల వెంబడి తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల సైన్య జరిపిన కాల్పుల్లో పదుల సంఖ్యలో ప్రజలు మరణించగా, వందల సంఖ్యలో గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఓ కీలక పరిణామ జరిగింది. ఇందులో భాగంగా... తాజాగా పాక్ – ఆఫ్గన్ లు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి.


అవును... పాక్ – ఆఫ్గన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి 48 గంటల పాటు సీజ్ ఫైర్ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. అది కాస్తా శుక్రవారం సాయంత్రంతో ముగిసిన వెంటనే.. ఆఫ్గాన్ పై పాకిస్థాన్ వైమానిక దాడులకు పాల్పడింది. ఇందులో భాగంగా.. తూర్పు పాక్టికా ప్రావిన్స్‌ లోని రెండు జిల్లాలపై దాడులు జరిపింది.

ఇలా ఇరు దేశాల మధ్య పరిస్థితి తీవ్రమవుతోన్న వేళ ఖతార్‌ లో శాంతి చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య జరిగిన శాంతి చర్చలు ఫలించాయని.. దోహా వేదికగా తక్షణ కాల్పుల విరమణకు ఇరుదేశాలు అంగీకరించాయని.. ఖతార్‌ విదేశాంగ మంత్రిత్వశాఖ స్వయంగా ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది

వివరాళ్లోకి వెళ్తే... ఖతార్‌, టర్కీ మధ్యవర్తిత్వంతో పాక్‌ - అఫ్గాన్‌ ల మధ్య కాల్పుల విరమణకు సంబంధించిన చర్చలు జరిగాయి. ఈ క్రమంలో జరిగిన చర్చలు ఫలించాయని ఖతార్‌ పేర్కొంది. ఈ చర్చల్లో శాశ్వత శాంతి, స్థిరత్వం కోసం ఇరుదేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని వెల్లడించింది. ఈ చర్చల్లో ఇరుదేశాలకు చెందిన రక్షణ మంత్రులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా... ఆఫ్గనిస్తాన్ నుంచి వస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయడంతో పాటు సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం పునరుద్దరణ చర్యలపై మాత్రమే దృష్టి పెట్టామని పాకిస్థాన్ పేర్కొంది. అయితే... ఈ వ్యాఖ్యలపై ఆఫ్గాన్ సీరియస్ గా స్పందించింది. ఇందులో భాగంగా... సరిహద్దుల్లో దాడులకు పాల్పడే ఉగ్రవాదులకు తాము ఆశ్రయం కల్పిస్తున్నామనే ఆరోపణలను ఖండించింది.

కాగా... శుక్రవారం సాయంత్రం 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన అనంతరం, అర్ధరాత్రి అఫ్గాన్‌ లోని పాక్టికా ప్రావిన్స్‌ పై పాక్‌ వైమానిక దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఆఫ్గాన్ లో సుమారు 10 మంది మరణించాగా.. వారిలో ముగ్గురు యువ క్రికెటర్లతో పాటు మహిళలు, చిన్నారులు ఉన్నారని అఫ్గాన్‌ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News