• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పాక్ మాజీ మంత్రి కొత్త...

పాక్ మాజీ మంత్రి కొత్త రకం మేకపోతు గాంభీర్యం!

| జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

By - Tupaki Desk
Update: 2025-04-24 06:36 GMT

జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ కాల్పుల్లో 26 మంది మృతి చెందారు. ఈ దాడిని అత్యంత తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం.. దౌత్యపరంగా సంచలన నిర్ణయాలే తీసుకుంది. అంతకంటే ముందు పాక్ మాజీ మంత్రి ఎక్స్ వేదికగా రెండు పోస్టులు పెట్టారు.

అవును... పహల్గాంలో ఉగ్రదాడి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఇలా దాడి జరిగిన కొద్దిసేపటికే.. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా ప్రతినిధి సంస్థ టీ.ఆర్.ఎఫ్. బాధ్యత వహించింది. మరోపక్క దాడి వెనుక ఉన్నట్లు భావిస్తున్న ముగ్గురు అనుమానితుల స్కెచ్ లను భారత భద్రతా సంస్థలు విడుదల చేశాయి.. వీరంతా పాకిస్థాన్ జాతీయులే!

ఈ సమయంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఘాటుగా స్పందించారు. ఇందులో భాగంగా.. దాడి చెసిన వారిని నిర్మూలించడంతోనే భారత్ ఆగదని.. సరిహద్దు అవతల నుంచి కుట్రను రూపొందించిన వారిని లక్ష్యంగా చేసుకుంటుందని పరోక్షంగా ఎవరికి వార్నింగ్ ఇవ్వాలో వారికి వార్నింగ్ ఇస్తూ ప్రతిజ్ఞ చేశారు. వారిని వెంటాడి చంపుతామని అన్నారు.

ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ మంత్రి, ఇమ్రాన్ ఖాన్ పార్టీ సీనియర్ నాయకుడు చౌదరి ఫవాద్ హుస్సేన్ అన్నారు. ఈ సమయంలో ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. పాక్ రాజకీయ పార్టీలన్నీ కలిసి ఉంటామని చెబుతూ.. భారత్ యుద్ధ చర్యలు తీసుకోదని భావిస్తున్నట్లు చెబుతూ.. రెండు పోస్టులు పెట్టారు.

ఇందులో భాగంగా... "పాకిస్థాన్ రాజకీయంగా విడిపోయింది కానీ.. మనం ఒక దేశంగా ఐక్యంగా ఉన్నాము. భారత్ మనపై దాడి చేసినా, బెదిరించినా.. అన్ని గ్రూపులు (పీఎమెల్-ఎన్, పీపీపీ, పీటీఐ, జేయూఐ)... మన మాతృభూమిని రక్షించుకోవడానికి పాక్ జెండా కింద కలిసి ర్యాలీ చేస్తారు" అని స్పందించారు.

ఇదే సమయంలో... ఉగ్రదాడి అనంతరం భారత్ లో జరుగుతున్న పరిణామాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారో ఏమో కానీ.. మోడీ సర్కార్ నుంచి సమ్యమనం ఆశిస్తూ మరో పోస్ట్ పెట్టడం గమనార్హం.

ఇందులో భాగంగా... “భారత మంత్రివర్గం తన భద్రతా సమావేశాన్ని ముగించింది.. కూల్ హెడ్స్ గెలుస్తాయని, అధికారులు మీడియా ఆజ్యం పోసిన యుద్ధానికి లొంగి లక్షలాది మంది ప్రాణాలను పణంగా పెట్టరని ఆశిద్దాం" అని రాసుకొచ్చారు. దీంతో.. లోపల భయం పెట్టుకుని పైకి ఇలాంటి కబుర్లు చెప్పడాన్ని మేకపోతు గాంభీర్యం అంటారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... ఈ పాక్ మాజీ మంత్రి ట్వీట్లలో ఎక్కడా పహల్గాం ఉగ్రదాడి గురించి నేరుగా ప్రస్థావించడం కానీ.. ఆ ఉగ్రదాడిని ఖండించడం కానీ.. ఇది పాక్ చర్య కాదు అని కానీ చెప్పకపోవడం గమనార్హం.

The Indian Cabinet has concluded its security meeting—let’s hope cool heads prevail and the authorities don’t risk millions of lives by giving in to media-fueled war jingoism. #Pahalgam

— Ch Fawad Hussain (@fawadchaudhry) April 23, 2025
Tags:    
  • PahalgamTerroristAttack 
  • JammuandKashmir 
  • TRF 
  • Pakistanformerminister 
  • Indiansecurityforces 
  • nationalsecurity 
  • Indianarmy 
  • Latestnews 

Similar News

ఏపీకి వరస తుఫానులు ఎందుకు వస్తున్నాయి ?

2026-11-17 17:42 GMT

ఇతను టఫ్ గాయ్.. ట్రంప్ పొగిడినా పట్టించుకోని మోడీ.. అసలేం జరిగింది?

2026-11-17 17:41 GMT

ట్రావిస్ హెడ్ కు గుడ్ బై చెప్పిన కావ్య పాప.. ఐపీఎల్ 2027 వేలంలో స్టార్లను వదిలేసిన ఫ్రాంచైజీలు

2026-11-17 17:40 GMT

సచిన్‌తో క్రికెట్.. ఆటో డ్రైవింగ్: అదరగొట్టిన విలియం, కేట్!

2026-11-17 17:38 GMT

పాలకులకు 'ఎల్ నినో' దడ.. 2004 నాటి చరిత్ర మళ్లీ రిపీట్ కానుందా?

2026-11-17 17:38 GMT

జమిలితో బీజేపీ : తెలంగాణాను ఎగరేసుకుపోతారా ?

2026-11-17 17:37 GMT

544 పేజీల సోనియా ఆత్మకథతో దేశానికి ఒరిగేదేంటి ?

2026-11-17 17:35 GMT

60 వేల మంది తొలగింపు.. మైక్రోసాఫ్ట్ వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్ వెనుక అసలు వ్యూహమేంటి?

2026-11-17 17:34 GMT

కొబ్బరికాయ కోసం రూ.2.50 లక్షలు ఖర్చు.. దీని కథేంటి తెలుసా?

2026-11-17 17:33 GMT

వర్కౌట్స్ తో తెగ కష్టపడిపోతున్న రాశీ ఖన్నా.. వీడియో వైరల్!

2026-11-17 17:33 GMT

చైర్మ‌న్ గిరి.. అంత ఈజీ కాదు ..!

2026-11-17 13:09 GMT

ఏపీలో జ‌డ్పీ పీఠాల‌పై చిక్కుముడులు.. రీజ‌నేంటి.. ?

2026-11-17 13:07 GMT

Copyright @2026

Powered by Blink CMS