ఆపరేషన్ సిందూర్ పై వ్యాసరచన పోటీ... పూర్తి వివరాలివే!
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో గల బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని అతి కిరాతకంగా కాల్చి చంపిన సంగతి తెలిసిందే.;
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో గల బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని అతి కిరాతకంగా కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రతీ భారతీయుడూ ప్రతీకారంతో రగిలిపొయాడు! ఈ నేపథ్యంలో పాక్, పీవోకే లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది.
ఈ సమయంలో పాకిస్థాన్ లోని 9 ఉగ్రశిబిరాలను ధ్వంసం చేసిన భారత సైన్యం.. సుమారు 100 మంది వరకూ ఉగ్రమూకలను మట్టుబెట్టింది. ఈ సమయంలో... అలాంటి ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి యువత తన మనసులోని భావాలను వినిపించేందుకు ఓ అవకాశం కల్పించింది. ఈ మేరకు రక్షణశాఖ కీలక ప్రకటన చేసింది.
అవును... భారతదేశ చిరిత్రలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన అతిపెద్ద చర్య అయిన ఆపరేషన్ సిందూర్ గురించి యువత తన మనసులోని భావాలను వినిపించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ అవకాశం కల్పించింది. ఈ మేరకు రక్షణ శాఖ ఓ కీలక ప్రకటన చేసింది. దీనికోసం ఆన్ లైన్ లో వ్యాసరచన పోటీని నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.
పూర్తి వివరాలు!:
జూన్ 1 నుంచి జూన్ 30వ తేదీ వరకూ ఈ వ్యాసరచన పోటీ అందుబాటులో ఉంటుంది.
ఇంగ్లిష్, హిందీ భాషల్లో రాసేందుకు మాత్రమే వీలుంది.
వ్యాసం 500 నుంచి 600 పదాల్లోనే ఉండాలి.. ఒకరు ఒకేసారి పాల్గొనాలి!
ఇందులో ముగ్గురు విజేతలను ఎంపిక చేసి ఒక్కొక్కరికీ రూ.10వేల చొప్పున ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు.
టాప్ 200లో నిలిచినవారికి (వీరికి తోడుగా మరొకరికి) ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తారు.
ఈ పోటీల్లో పాల్గొనదలిచే వారు mygov.in వెబ్ సైట్ లో లాగిన్ అవ్వాలి.