'సున్నా సహనం'... ఆపరేషన్ సిందూర్ పై ఫస్ట్ రియాక్షన్!
పహల్గాం ఉగ్రదాడి అనంతరం ప్రతీకారంతో రగిలిపోతున్న భారత్.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింది.;
పహల్గాం ఉగ్రదాడి అనంతరం ప్రతీకారంతో రగిలిపోతున్న భారత్.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింది. మంగళవారం అర్ధరాత్రి 1:44కి మొదలైన దాడితో పాక్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది! ఈ దాడులో సుమారు 80 - 90 మంది ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. ఈ దాడిపై స్పందించిన ఆర్మీ "న్యాయ జరిగింది" అని పోస్ట్ పెట్టింది.
పహల్గాం దాడికి బాధ్యులను జవాబుదారీగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నట్లు భారత్ వెల్లడించింది. ఈ సందర్భంగా స్పందించిన రక్షణశాఖ.. దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. ఈ సమయంలో.. దాడుల అనంతరం కేంద్రం నుంచి ఫస్ట్ రియాక్షన్ వచ్చింది. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
అవును... ఏప్రిల్ 22 పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా.. ఉగ్రమూకలను ఏరివేయడానికి భారత సైన్యం "ఆపరేషన్ సిందూర్"ను ప్రారంభించింది. ఈ క్రమంలో మొత్తం ఆపరేషన్ పై జైశంకర్ నుంచి మొదటి స్పందన వచ్చింది. ఇందులో భాగంగా.. "ఉగ్రవాదం పట్ల ప్రపంచం మొత్తం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంభించాలని" ఆయన అన్నారు.
మరోపక్క పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసినట్లు అమెరికా, యూకే, రష్యా, సౌదీ అరేబియా, దుబాయ్ కి భారత ఉన్నతాధికారులు సమాచారం అందించారు. ఇదే సమయంలో ఈ దాడులపై వాషింగ్టన్ డీసీలోని భారత ఎంబసీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ దాడులు పాక్ పౌరులు, సైనిక స్థావరాలపై చేయలేదని స్పష్టం చేసింది.
కాగా... ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణికంచగా సుమారు 17 మంది గాయపడిన సంగతి తెలిసిందే. బైసరన్ లోయలో జరిగిన ఈ దాడిలో ఉగ్రవాదులు ప్రత్యేకంగా ప్రజలను లక్ష్యంగా చేసుకున్నారు. పురుషులను మతం అడిగి మరీ హత్యలు చేశారు!