• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆపరేషన్ సిందూర్.. వైరల్...

ఆపరేషన్ సిందూర్.. వైరల్ గా ఇండియన్ ఆర్మీ వీడియో

| నిమిషం కంటే కాస్త ఎక్కువగా ఉన్న ఈ వీడియోను ఎక్స లో మంగళవారం అర్థరాత్రి 1.24 గంటలకు (బుధవారం తెల్లవారుజామున) ఎక్స్ లో పోస్టు చేసింది.

By - Tupaki Desk
Update: 2025-05-07 04:03 GMT

దొంగచాటు దెబ్బల్లేవ్. ఏమైనా ఉన్నది ఉన్నట్లుగా.. చెప్పేదే చేస్తాం.. చేసేదే చెబుతామన్న సందేశాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పేలా చేయటమే భారత్ నైజమన్న విషయాన్ని మరోసారి నిరూపించింది. పహల్గాం ఉగ్రదాడికి భారత సైన్యం బదులు తీర్చుకుంది, పాకిస్థాన్ తో సహా.. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఈ మెరుపు దాడులకు ముందు.. భారత ఆర్మీ ఒక వీడియోను ఎక్స్ లో పోస్టు చేసింది.

నిమిషం కంటే కాస్త ఎక్కువగా ఉన్న ఈ వీడియోను ఎక్స లో మంగళవారం అర్థరాత్రి 1.24 గంటలకు (బుధవారం తెల్లవారుజామున) ఎక్స్ లో పోస్టు చేసింది. 'రెడీ టు స్ట్రైక్ ' అన్న క్యాప్షన్ తో వీడియోను విడుదల చేశారు. మెరుపు దాడులకు కాస్త ముందుగా పోస్టు పెట్టిన వైనం చూస్తే.. ఆపరేషన్ సిందూర్ ను ప్రపంచానికి ఓపెన్ గా చెప్పి మరీ దాడులకు పాల్పడినట్లుగా చెప్పాలి.

'దాడి చేయటానికి సిద్ధం. శిక్షణ తీసుకుంది గెలవటానికే' అంటూ పేర్కొన్న ఈ వీడియో అసాంతం భారత శక్తిని చాటేలా ఉందని చెప్పాలి. అంతేకాదు.. భారత ప్రజలు పడే వేదనను తానెంత సీరియస్ గా తీసుకుంటానన్న విషయాన్ని భారత ఆర్మీ తన వీడియోలో స్పష్టంగా చెప్పేసింది. ఈ వీడియోలో భారత ఆయుధ బలం.. యుద్ధ ట్యాంకర్లు.. వాటి శక్తి సామర్థ్యాలు ఎంతగా ఉంటాయన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పటం కనిపిస్తుంది.

'నమ్మకంగా చెబుతున్నా నిన్ను తుపాను వేగంతో కనుగొంటా. ఈ మెషిన్లు.. క్యారియర్లతో నిన్ను కనుగొంటాను. నా సోదరులు సోదరీమణుల వేదనను.. బాధను తీర్చేందుకు కచ్ఛితంగా నిన్ను కనుగొంటాను'' అంటూ 64 సెకన్లు సాగే ఈ వీడియో ఆద్యంతం భావోద్వేగంతో సాగుతుంది. తాము చేపట్టిన ఆపరేషన్ సిందూర్ వివరాల్ని ప్రపంచానికి తెలియజేయటంతో పాటు.. కొన్ని కీలక దేశాలకు సైతం ఆ సమాచారాన్ని షేర్ చేసిన వైనం చూసినప్పుడు.. భారత్ ఎంత బాధ్యతగా వ్యవహరిస్తుందన్న విషయాన్ని చేతలతో చెప్పేసిందని చెప్పాలి.

"प्रहाराय सन्निहिताः, जयाय प्रशिक्षिताः"Ready to Strike, Trained to Win.#IndianArmy pic.twitter.com/M9CA9dv1Xx

— ADG PI - INDIAN ARMY (@adgpi) May 6, 2025
Tags:    
  • OperationSindoor 
  • Indiamissileattack 
  • IndiaPakistanWar 
  • IndianNavy 
  • IndianAirforce 
  • IndianArmy 
  • MissileStrike 
  • POKTerroristCamps 

Similar News

ట్రంప్ పట్టుకొచ్చాడు.. అతడు వచ్చాడంటే ‘హెచ్1బీ’లకు మూడినట్టే?

2026-11-12 08:16 GMT

ట్రంప్ కు షాకిచ్చిన పాకిస్తాన్.. అమెరికా వ్యూహం ఎందుకు ఫెయిలయ్యింది?

2026-11-12 08:16 GMT

టేస్ట్ ఆఫ్ ఆంధ్రా' నుంచి డిజిటల్ పర్యాటకం వరకు.. సీఐఐ సదస్సు విశేషాలు!

2026-11-12 06:17 GMT

చీపురుపల్లి టీడీపీలో టెన్షన్.. టెన్షన్.. స్థానికంలో బొత్స దూకుడు

2026-11-12 06:05 GMT

బీబీసీకి ఎదురుదెబ్బ.. ట్రంప్ పరువు నష్టం కేసుకు గ్రీన్ సిగ్నల్!

2026-11-12 06:05 GMT

చాక్లెట్ బాక్సును వదలని ‘బాబు’ గారు.. ఆయన ఆలోచన అలా ఉంటుంది మరీ

2026-11-12 05:54 GMT

రాప్తాడు నిందితుడికి తీవ్ర అనారోగ్యం.. బతికినంతకాలం దుర్భర జీవితమే..!?

2026-11-12 05:49 GMT

జెన్సన్‌కు మస్క్ ఉద్యోగం ఇస్తారా? వివాదం మధ్య ఆసక్తికర ఆఫర్!

2026-11-12 05:49 GMT

ప్రభుత్వం మారినా పెట్టుబడుల ఒప్పందాలు మారకూడదు.. చంద్రబాబు కొత్త ఆలోచన!

2026-11-12 05:48 GMT

క్లీన్ సిటీల జాబితాలో ఏపీ సత్తా.. విజయవాడ, విశాఖ, గుంటూరుకు ప్రత్యేక గుర్తింపు!

2026-11-12 05:48 GMT

పవన్ పై సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న వారికి గట్టి షాక్.. అరెస్ట్

2026-11-12 04:24 GMT

11 లక్షల కోట్ల టార్గెట్ ..దావోస్ కి ధీటుగా వైజాగ్ సమ్మిట్

2026-11-12 03:23 GMT

Copyright @2026

Powered by Blink CMS