ప్రత్యేకించి ఆ రాష్ట్రంలో మహిళలకు నైట్ షిఫ్ట్.. కానీ కండీషన్స్ అప్లై !
ఒకప్పుడు భారతదేశం టెక్నాలజీలో చాలావరకు వెనుకబడిపోయి ఉండేది. అంతేకాదు ముఖ్యంగా భారతదేశంలో మూఢాచారాలు ఎక్కువగా ఉండేవి;
ఒకప్పుడు భారతదేశం టెక్నాలజీలో చాలావరకు వెనుకబడిపోయి ఉండేది. అంతేకాదు ముఖ్యంగా భారతదేశంలో మూఢాచారాలు ఎక్కువగా ఉండేవి. మహిళలు అంటే వంటింటికే పరిమితమై ఉండేలా భావించేవారు. అంతేకాదు అప్పట్లో భర్త చనిపోతే భార్యని కూడా భర్తతో చితిపై కాల్చే ఆచారం సతీ సహగమనం పేరుతో ఉండేది. కానీ రానూ రానూ ఈ పద్ధతి మారుతూ వస్తోంది. మహిళలు కూడా పురుషులతో సమానంగా పోటీపడుతూ అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. స్త్రీలు ఎక్కడా కూడా తక్కువ కాదని నిరూపిస్తున్నారు. ఒకప్పుడు ఆడది అర్ధరాత్రి 12 గంటలకు నడి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లినప్పుడే మనకు పూర్తి స్వాతంత్ర్యం వచ్చినట్టు అని మహాత్మా గాంధీజీ అన్నారు. ఆయన అన్న మాటలు ప్రస్తుతం నిజమవబోతున్నాయి.
ప్రస్తుతం మహిళలు కేవలం ఉద్యోగాలే కాకుండా ఫ్లైట్స్, ట్రైన్స్ కూడా నడుపుతున్నారు. అంతేకాదు అంతరిక్షంలో కూడా విహరిస్తున్నారు. ఈ విధంగా ఆడవాళ్లు అన్ని రంగాల్లో రాణిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఆడవాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు కల్పించేలా నిర్ణయం తీసుకుంది. ఉద్యోగం చేసే మహిళలు రాత్రి వేళల్లో కూడా విధులు నిర్వర్తించేలా ఒడిశా ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ముఖ్యంగా వ్యాపార సముదాయాలు, పరిశ్రమలు, దుకాణాలు వంటి వాటిల్లో రాత్రి షిఫ్టుల్లో కూడా పనిచేయవచ్చన్నది. లేబర్ ఆండ్ ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే ఈ నిర్ణయానికి కొన్ని షరతులను కూడా విధించింది.
ఏ షిఫ్ట్ లో పనిచేసే వారైనా సరే.. కనీసం ముగ్గురు మహిళా ఉద్యోగులు రాత్రి వేళల్లో పనిచేసేలా ఉండాలి. అంతేకాదు వారిని తీసుకెళ్లడానికి, తీసుకురావడానికి జీపీఎస్ ట్రాకింగ్ తో కూడిన రవాణా సౌకర్యాన్ని అందించాలి. యుక్త వయసులో ఉన్నటువంటి వారికి అనుమతి లేదు. ముఖ్యంగా పని ప్రదేశాల్లో వాష్ రూమ్, తాగునీటి సౌకర్యాలు, సీసీటీవీ నిఘా తగినంత ఉండాలి. అయితే నైట్ షిఫ్ట్ లో పనిచేసే మహిళలకు రాతపూర్వక సమ్మతి తప్పనిసరిగా ఉండాలని నిర్ణయం తీసుకుంది.. ఈ నిర్ణయాన్ని మహిళలు మగవాళ్ళతో ఏ విధంగా తక్కువ కాదని అలాగే మహిళల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా పెంచేందుకే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని తెలియజేసింది.
అయితే కేంద్రం నుంచి వచ్చిన సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని కార్మిక శాఖ మంత్రి వర్గం వెల్లడించింది. అయితే దీనిపై విపక్షనేతలు మండిపడుతున్నారు. మహిళలకు అన్ని హక్కులు కల్పించినప్పుడు రాతపూర్వక అనుమతి ఎందుకు, వారిని ప్రభుత్వం రక్షించలేదనే ఏదైనా అపోహ ఉందా అంటూ విమర్శిస్తోంది. మరి చూడాలి ఈ నిర్ణయం ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది ముందు ముందు తెలుస్తుంది.