లైంగిక వేధింపులకు పాల్పడిన ఎన్నారై వైద్యుడు... దోషిగా తేల్చిన కోర్టు!

ఆ సంగతి అలా ఉంటే... తాజాగా భారత సంతతికి చెందిన ఒక వైద్యుడు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ వార్తల్లో నిలిచాడు.

Update: 2024-02-16 13:44 GMT

భారతదేశ సంతతిగా విదేశాల్లో ఉంటూ ఈ దేశానికి మంచిపేరు తెచ్చేవారు ఒకరైతే.. మచ్చ తెచ్చే వారు మరికొందరు. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా భారత సంతతికి చెందిన ఒక వైద్యుడు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ వార్తల్లో నిలిచాడు. ఈ సమయంలో ఇలాంటి ఆరోపణలు ఇప్పటికే ఇతనిపై చాలానే వచ్చాయని తెలుస్తుంది. అయితే తాజాగా నాలుగు లైంగిక వేధింపుల కేసులో అతడు దోషిగా తేలాడు.

అవును... ఆగ్నేయ ఇంగ్లాండ్‌ లో ప్రాక్టీస్ చేస్తున్న 47 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన మోహన్ బాబు అనే ఫ్యామిలీ డాక్టర్... క్యాన్సర్‌ తో పోరాడుతున్న ఒకరితో సహా అతని ఆధ్వర్యంలో వైద్యం తీసుకునే ముగ్గురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. తన భార్యతో కలిసి పనిచేస్తున్న క్లీనిక్ లో ఇతడు ఇలాంటి పనులకు పాల్పడ్డాడని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన విచారణలో హాంప్‌ షైర్‌ లోని హవంత్‌ లోని స్టాంటన్ సర్జరీలో అతని పదవీకాలంలో నాలుగు లైంగిక వేధింపులకు పోర్ట్స్‌ మౌత్ క్రౌన్ కోర్టు అతను దోషిగా తేల్చింది. అదే క్లినిక్‌ లో జనరల్ ప్రాక్టీషనర్‌ గా ఉన్న తన భార్యతో కలిసి పని చేస్తున్న మోహన్ బాబు ఏప్రిల్ 12న శిక్ష ఖరారు అయ్యే వరకు షరతులతో కూడిన బెయిల్‌ పై విడుదలయ్యాడు.

సెప్టెంబరు 2019, జూలై 2021 మధ్య శస్త్రచికిత్స ప్రిమిసెస్ లో బలహీనమైన మహిళలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు చెబుతున్నారు. చికిత్స కోసం వచ్చిన మహిళలను అనుచితమైన తాకడం, అసభ్యకరంగా మాట్లాడటంతో అతడి ప్రవర్తనపై పలువురు మహిళలు ఫిర్యాదులు చేశారట. ఈ ఫిర్యాదు నేపథ్యంలో చేపట్టిన విచారణలో కీలక విషయాలు తెలిశాయట.

ఇందులో భాగంగా... బాబు తన పదవిని దుర్వినియోగం చేయడం.. అవసరం ఉన్న లేకున్నా అనవసరమైన పరీక్షలు నిర్వహించడం.. మహిళలైన పేషెంట్స్ తో అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటివి విచారణలో వెలుగుచూశాయని తెలుస్తుంది. విషయం తెలుసుకున్న క్లీన్... వరుసగా వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో 2021 జూలైలో అతని ఉద్యోగాన్ని తొలగించింది.

Tags:    

Similar News