కోటి రూపాయలతో భారత్ లో జీవించవచ్చా.. ఎన్ఆర్ఐ వింత ప్రశ్న.. స్పందించిన నెటిజన్లు..
పంజాబ్ కు చెందిన ఒక వ్యక్తి రెడ్డిట్స్ లో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా వైరల్ గా మారింది.;
గత పదేళ్ల నుంచి చూసుకుంటే దేశం చాలా రంగాలలో అభివృద్ధి చెందింది. ఎంతలా అంటే పదేళ్ల క్రితం దేశం విడిచి వెళ్లిన వ్యక్తి నేడు దేశానికి వస్తే తన ఇంటి పరిసరాలను సైతం గుర్తించలేనంతగా.. 70 సంవత్సరాల భారత్ చాలా దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొనేది. నేడు అది లేదు పారిశుధ్యంలో దేశం అగ్రభాగానికి వెళ్లింది. ఆర్థిక పరంగా కూడా దేశం టాప్ 10లో ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. 11 సంవత్సరాల క్రితం న్యూజిలాండ్ కు వెళ్లిన వ్యక్తి పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ఆశ్చర్య పరిచిని రెడ్డిట్స్ పోస్ట్..
పంజాబ్ కు చెందిన ఒక వ్యక్తి రెడ్డిట్స్ లో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా వైరల్ గా మారింది. పంజాబ్ పుట్టి పెరిగిన తాను 19వ సంవత్సరంలో భారత్ ను వీడి న్యూజిల్యాండ్ కు వచ్చాను. నాకు ఇప్పడు 30 సంవత్సరాలు ఇన్నేళ్లలో న్యూజిల్యాండ్ లో 2 లక్షల కరెన్సీ (ఇండియన్ రూపీలో 1.03 కోట్లు) కూడబెట్ట గలిగాను. ఇప్పడు ఈ డబ్బులతో ఇండియాలో జీవించవచ్చా.. అనే ప్రశ్నను పోస్ట్ చేశాడు. దీంతో పాటు ఆయన ఫైనాన్సియల్ స్టేసన్ ను కూడా ఇందులో పెట్టాడు. నేను న్యూజిలాండ్ కు వస్తున్న సమయంలో ఇండియాలో కోటి రూపాయలు చాలా పెద్ద మొత్తం నేడు అది ఎంతలా ఉంది. అని ప్రశ్నిస్తూనే తనకు ఒక షాపు ఉంది ఇది ఏడాదికి ఐదు లక్షల వరకు సంపాదిస్తుంది (100 NZD), దీనితో పాటు సొంత ఇల్లు కూడా ఉందని, 70 లక్షల న్యూజిల్యాండ్ యూఎస్ స్టాక్స్ కూడా ఉన్నాయని చెప్పుకచ్చాడు.
వింతగా స్పందించిన నెటిజన్లు..
పంజాబియన్ చేసిన పోస్ట్ కు నెటిజన్లు స్పందించారు. కోటి రూపాయలు అనేవి పెద్ద మొత్తమే అని కొందరు చెప్తే.. అందులో టాక్స్ కూడా కట్ అవుతుంది ఇది కూడా చూసుకోవాలని కొందరు చెప్పారు. కోటి రూపాయలు పెద్ద డబ్బు కాదని, పెట్టుబడి పట్టి మరింత ఆర్జించవచ్చని కొందరు చెప్తున్నారు. నేనైతే ఇండియాకు తిరిగిరాను అక్కడే శాశ్వతంగా ఉండిపోతానని మరొకరు చెప్తున్నారు. ఏది ఏమైనా న్యూజిల్యాండ్ కు ఇండియాకు మధ్య కోటి రూపాయల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నేడు భారత్ ఆర్థికంగా వేగంగా వృద్ధి సాధించడంతో పాటు భద్రత కలిగిన నేషన్ గా గుర్తింపు సంపాదించుకుంది. దీంతో చాలా మంది ఎన్ఆర్ఐ దేశానికి తిరిగి వచ్చేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు. అమెరికాలోని భారతీయులు కూడా ఇండియాకు తిరిగి రావడం కనిపిస్తుంది.