• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కొలికపూడిపై నాన్‌ ...

కొలికపూడిపై నాన్‌ బెయిలబుల్ కేసు... సీఐడీ ఎంట్రీతో జంప్?

| ఈ నేపథ్యంలో కొలికపూడి శ్రీనివాసరావు తనపై చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు రాం గోపాల్ వర్మ స్పందించారు.

By - Tupaki Desk
Update: 2023-12-30 13:15 GMT

కొద్ది రోజుల క్రితం ఓ ఛానల్‌ లోని ఒక చర్చా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కొలికపూడి శ్రీనివాసరావు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... యాంకర్ అడిగిన ప్రశ్నలకు కొలికపూడి సమాధానాలు చెప్తూ... "రాంగోపాల్ వర్మ తల నరికి తెస్తే కోటీ రూపాయలు ఇస్తా" అంటూ ఛాలెంజ్ చేశారు. అనంతరం.. "ఐ రిపీట్, ఐ రిపీట్ నాకు సమాజం కంటే ఏదీ ఎక్కువ కాదు" అంటూ రెచ్చిపోయారు.

అనంతరం ఆ షోను యాంకర్ కంటిన్యూ చేశారు.. అనంతరం ఆ ఛానల్ కు సంబంధించిన వెబ్ సైట్, యూట్యూబ్ ఛానల్స్ లోనూ ఆ వీడియోను అందుబాటులో ఉంచారని అంటున్నారు! దీంతో ఈ ఇష్యూ వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో కొలికపూడి శ్రీనివాసరావు తనపై చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు రాం గోపాల్ వర్మ స్పందించారు. ఇందులో భాగంగా... ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు.

ఈ సమయంలో కొలికపూడి శ్రీనివాస రావుతోసహా ఆరుగురిపై ఏపీ సీఐడీ నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసిందని తెలుస్తుంది. వారిలో సదరు ఛానల్ యజమాని, యాంకర్, మేనేజింగ్ డైరెక్టర్లు కూడా ఉన్నారని అంటున్నారు. ఈ సందర్భంగా కొలికపూడి శ్రీనివాసరావు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వెళ్లారని తెలుస్తుంది. రాంగోపాల్ వర్మ ఫిర్యాదు నేపథ్యంలో శ్రీనివాసరావును అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

కొలికపూడిని అరెస్టు చేసేందుకే ఏపీ సీఐడీ బృందం హైదరాబాద్‌ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ కి చేరుకున్న ఏపీ సీఐడీ అధికారులు.. నల్లగండ్లలోని అపర్ణ సైబర్ లైఫ్ గేటెడ్ కమ్యూనిటీలోని శ్రీనివాసరావు ఇంటికి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే సీఐడీ అధికారులు వచ్చే సమయానికి ఆయన పరారయ్యారని అంటున్నారు. దీంతో... ఆయన భార్యతో మాట్లాడిన అనంతరం సీఐడీ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలుస్తుంది.

కాగా... తన తల తెస్తే కోటి రూపాయలు నజరానా అని చేసిన ప్రకటనను ఆర్జీవీ సీరియస్ గా తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదులో "కొలికపూడి శ్రీనివాస్ లైవ్ టీవీ షోలో నన్ను చంపి నా తలను తీసుకువచ్చిన వాడికి కోటి రూపాయలు ఇస్తానని బహిరంగంగా ఆఫర్ ఇచ్చాడు. ఇదే కాకుండా నన్ను నా ఇంటి కొచ్చి తగలబెడతానని పబ్లిక్ గా అదే టీవీలో చెప్పాడు" అని పేర్కొన్నారు.

ఇదే సమయంలో... "ఆపుతున్నట్లు నటిస్తూ యాంకర్‌ నన్ను చంపే కాంట్రాక్ట్‌ గురించి మూడు సార్లు రిపీట్ చేయించాడు. ఆ తర్వాత కూడా అతడితో చర్చ కొనసాగించారు. దీన్ని బట్టి వాళ్లిద్దరూ నన్ను చంపటానికి కాంట్రాక్ట్ ఇవ్వటానికి ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టు క్లియర్ గా అర్ధమవుతోంది. శ్రీనివాసరావు నన్ను తానే మర్డర్ చెయ్యటంకన్నా దారుణం, లైవ్ టీవీలో కూర్చుని నన్ను చంపితే కోటి రూపాయలు ఇస్తానని వేరే ఎవరెవరికో డబ్బాశ చూపించి ఇన్స్పైర్ చెయ్యటం" " అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

"ఇలాంటి హత్య కుట్రలు తన ఛానల్‌ లో ప్రసారమవుతున్నాయని తెలిసి కూడా సదరు యాంకర్ ని వెంటనే జాబ్ నుంచి తీసెయ్యలేదంటే యజమాని కూడా ఈ కుట్రలో భాగంగా ఉన్నట్టు క్లియర్ గా తెలిసిపోతోంది" అని వెల్లడించారు. ఒక డెమోక్రసీలో హత్యా కాంట్రాక్టులు ఇంత పబ్లిక్ గా ఇవ్వటం చూస్తే టెర్ర్రరిస్ట్ లు కూడా షాక్ అవుతారు. కాబట్టి, పై ముగ్గురి మీద వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి" అని ఆర్జీవీ.. ఏపీ డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Tags:    
  • Kolikapudisrinivasarao 
  • Ramgopalvarma 
  • Apdgp 
  • Apcid 

Similar News

పాపం ఏబీవీ : సోషల్ మీడియా హైప్....డిపాజిట్ గల్లంతు

2026-11-04 08:06 GMT

సుప్రీంషాక్‌: దిగొచ్చిన ఎన్నిక‌ల సంఘం.. బిగ్ రిలీఫ్‌!

2026-11-04 08:02 GMT

ఈమె ఏ పార్టీలోచేరినా విజయమే.. లక్ అంటే రమాకుమారిదే..

2026-11-04 08:01 GMT

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

2026-11-04 06:09 GMT

2029 ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర.. రాజకీయ పార్టీలకు Gen Z కొత్త సవాల్!

2026-11-04 05:40 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఆదోనిలో జనసేన రెబల్ సంచలనం.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు షాక్!

2026-11-04 04:56 GMT

అమెరికాలో 3 లక్షలకు పైగా వీసాలు రద్దు.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

2026-11-04 04:55 GMT

ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. ప్రతినిధుల సభపై డెమోక్రాట్ల పట్టు

2026-11-04 04:29 GMT

పట్టణ రిజల్ట్...పరిషత్తులలో రిపీట్ ?

2026-11-04 03:38 GMT

మోడీ ఓపెన్ డిబేట్ విత్ రాహుల్...జనం కోరిక కూడానా ?

2026-11-04 01:30 GMT

కూటమి డెడ్లీ కాంబో...అందుకే వైసీపీ ఫల్టీ !

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS