• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఎంత ఓటమి అయితే మాత్రం ఇంత...

ఎంత ఓటమి అయితే మాత్రం ఇంత ఔట్ డేటెడ్ చేసుడేంది కేసీఆర్!

| తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించుకున్న ఆయన.. ఇప్పుడు ఔట్ డేటెడ్ గా మారిపోతున్నారు.

By - Tupaki Desk
Update: 2024-06-10 11:30 GMT

రాజకీయాల్లో గెలుపు టానిక్ లాంటిదైతే.. ఓటమి నిరాశను నిండుగా కమ్మేస్తుంది. ఒకలాంటి ఓటమి ఫర్లేదు. కానీ.. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలాంటి ఓటమి ఎదురైతే.. దాన్ని తట్టుకొని నిలబడటం అంత సామాన్యమైన విషయం కాదు. నిజానికి ఒక రాజకీయ అధినేతకు అసలుసిసలు సవాలు ఇదే. అధికారం చేతిలో ఉన్నప్పడు చెలరేగిపోవటం.. తనకు తిరుగులేదన్నట్లుగా వ్యవహరించటం ఎవరైనా చేస్తారు. కానీ.. దారుణ ఓటమి పరాభవాన్ని గుండెల్లో దాచుకొని కసిగా పోరాటం.. పార్టీని విజయతీరాలకు తీసుకురావటం సామాన్యమైన విషయం కాదు.

నిజానికి ఆ షాక్ నుంచి తేరుకోవటమే పెద్ద సవాలు. వాతావరణం తనకు అనుకూలంగా ఉన్నప్పడు తనకు ఎదురే లేదన్నట్లుగా వ్యవహరించే గులాబీ బాస్.. వరుస ఓటముల తర్వాత ఆయన తీరును చూస్తే.. ఎలాంటి పెద్ద మనిషి ఎలా అయ్యారన్న భావన కలుగక మానదు. తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించుకున్న ఆయన.. ఇప్పుడు ఔట్ డేటెడ్ గా మారిపోతున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచార వేళలోనూ.. ఆ తర్వాత ఎన్నికల్లో గెలుపు ఖాయమని.. తమకు తక్కువలో తక్కువ పదికి పైగా స్థానాల్ని సొంతం చేసుకుంటామని చెప్పటం తెలిసిందే.

అయితే.. ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చాయో తెలిసిందే. మొత్తం 17 స్థానాలకు ఒక్కటంటే ఒక్క ఎంపీస్థానాన్ని సైతం గెలుచుకోలేని దీన స్థితిలో నిలిచిపోయారు. ఎన్నికల్లో గెలుపు సాధించిన తర్వాత కెమేరాల ముందుకు వచ్చే కేసీఆర్.. ఓటమి వేళ మాత్రం ముఖం చాటేయటం కనిపిస్తుంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. గెలుపునకు చెలరేగిపోవటం.. ఓటమికి కుంగిపోవటం లాంటివి చేయకూడదు.

కానీ.. కేసీఆర్ మాత్రం అలాంటి తీరునే ప్రదర్శిస్తున్నారు. ఘన విజయం సాధించిన వేళ తమనకు మించినోడు లేడన్నట్లుగా మాటలు చెప్పిన పెద్దమనిషి.. ఓడిన వేళ కనీసం ప్రజల ముందుకు రావాలన్న ఆలోచన కూడా చేయకపోవటం గమనార్హం. ఎన్నికల్లో తాము ఓడినప్పటికీ.. తమకు ఓట్లు వేసిన వారికి థ్యాంక్స్ చెప్పాలన్న ఆలోచన కూడా గులాబీ బాస్ కు రాకపోవటం ఏమిటన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ ఊసే తెలంగాణ రాష్ట్రంలో వినిపించని పరిస్థితి. తన గురించి మాట్లాడుకోవటం తర్వాత.. తాను ఒకడ్ని ఉన్నాడన్న భావన ఎవరికి లేకపోవటం.. తన ప్రస్తావనే లేకపోవటం చూసినప్పుడు ఇంత త్వరగా కేసీఆరర్ ఔట్ డేటెడ్ అయినట్లుగా పరిస్థితి మారింది. ఇలాంటి వాదనకు చెక్ పెట్టేలా కేసీఆర్ ఉత్సాహంగా బయటకు రావాల్సిన అవసరం ఉంది. అంతేతప్పించి.. ఫాంహౌస్ కు పరిమితమైతే.. గులాబీ కారు సైతం షెడ్డుకు పరిమితం అవుతుందన్న విషయాన్ని కేసీఆర్ మర్చిపోకూడదు.

Tags:    
  • Telangana 
  • Kcr 
  • Politics 
  • Generalelections 
  • Brsparty 
  • Telanganastate 
  • Telanganapolitics 
  • Politicalnews 

Similar News

కూట‌మి గెలుపు బాగుంది.. అస‌లు స్టోరీ ఏంటంటే.. !

2026-11-08 14:30 GMT

అమెరికాలో 22 ఏళ్ల తెలంగాణ యువకుడు అనుమానాస్పద మృతి

2026-11-08 13:35 GMT

కొడాలికి లోకల్ షాక్.. గుడివాడలో తొలిసారి టీడీపీ ఇలా..

2026-11-08 13:34 GMT

నాడు సస్పెండ్ చేశారు.. నేడు దండలేసి ఆహ్వానిస్తున్నారు! స్థానిక రాజకీయంలో తిరగబడ్డ సీన్

2026-11-08 13:30 GMT

ఈ-20 వ‌ర్సెస్ 420 : రాహుల్ కొత్త వివాదం!

2026-11-08 12:30 GMT

కాంగ్రెస్ బ‌ల‌మా... ప‌ర్స‌న‌ల్ ఎటాచ్‌మెంటా.. ?

2026-11-08 11:15 GMT

జ‌గ‌న్ - అదానీ భేటీ.. పొలిటిక‌ల్ చ‌ర్చ నిజ‌మేనా ..?

2026-11-08 11:14 GMT

దుర్మార్గుడు... కేటీఆర్‌: రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు

2026-11-08 11:14 GMT

రిమాండ్ ఖైదీ సంచలన విజయం.. జడ్పీటీసీగా వైసీపీ నేతకు పట్టం కట్టిన ఓటర్లు

2026-11-08 11:14 GMT

స్థానికం అంటే ఇంతేమరి.. ఓటర్ల లెక్క వేరే, ఈ ఫలితాలే నిదర్శనం

2026-11-08 11:12 GMT

పరిటాల శ్రీరామ్‌ ఫస్ట్ విక్టరీ.. శ్రీసత్యసాయి జడ్పీ తొలి చైర్మనుగా అవకాశం

2026-11-08 11:11 GMT

వైసీపీ గెలుపు లెక్క...కిందా పడినా పైచేయి అంటూ !

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS