• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నగరాల్లో ఇల్లు కొనే ప్రతి...

నగరాల్లో ఇల్లు కొనే ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో!

| ఇటీవల నోయిడాలో భారీ వర్షాలు కురిశాయి. ఆ మాత్రం దానికే ఖరీదైన అపార్టు మెంట్లు షేక్ అయ్యాయి.

By - Tupaki Desk
Update: 2025-05-24 05:38 GMT

నగరాలు.. మహానగరాల్లో ఇళ్లు కొనాలని భావించే ప్రతి ఒక్కరు ఈ వీడియోను చూడాల్సిందే. కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి కొనే ఇంటి విషయంలో నిర్మాణదారులు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారన్న దానికి నిదర్శనంగా ఈ అపార్టుమెంట్లు నిలుస్తాయి. ఒక్క వర్షం దెబ్బకు తలుపులు ఊడిపోవటం.. గోడలకు రంధ్రాలు పడిపోవటం లాంటివి చూస్తే.. పూరి గుడిసె సైతం వర్షానికి బలంగా నిలుస్తుంది కదా? అన్న భావన కలుగక మానదు.

ఇటీవల నోయిడాలో భారీ వర్షాలు కురిశాయి. ఆ మాత్రం దానికే ఖరీదైన అపార్టు మెంట్లు షేక్ అయ్యాయి. అందులోని కొన్ని ప్లాట్ల గోడలు బీటలు వారితే.. మరికొన్ని ప్లాట్లు ఏకంగా కిటికీలు.. తలుపులు.. గోడలు ఆగమాగం కావటం చూసినోళ్లకు నోటి మాట రాని పరిస్థితి. భారీ భవంతుల జీవితకాలం తక్కువలో తక్కువ యాభై ఏళ్లు ఉంటాయి. అందుకు భిన్నంగా ఇంత భారీగా డ్యామేజ్ జరగటం చూస్తే.. నాణ్యత విషయంలో ఆ నిర్మాణ సంస్థలు ఎంత ఘోరంగా వ్యవహరించాయన్నది ఇట్టే అర్థమవుతుంది.

డబ్బులు దండుకోవటం తప్పించి నాణ్యమైన నిర్మాణాల్ని చేపట్టని వైనం.. అది కూడా పేరున్న నిర్మాణ సంస్థల తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నోయిడా విషయానికి వస్తే తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు కేరాఫ్ అడ్రస్ గా చెబుతారు. ఇందుకు తగ్గట్లే ఇళ్ల నిర్మాణంలో పలు జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకు భిన్నంగా నోయిడాలోని సూపర్ టెక్ ఎకోవిలేజ్ లోని ఇంటి బాల్కనీకి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

వర్షం ధాటికి తమ ఇల్లు ఎంతలా దెబ్బ తిందన్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘మా కుటుంబం పెను ప్రమాదాన్ని త్రుటిలో తప్పించుకుంది. ఇంటి నిర్మాణం ఇంత నాసిరకంగానా?’ అంటూ ఆవేదన చెందుతూ పెట్టిన పోస్టు షాకింగ్ గా మారింది. జేపీ అమర్ సొసైటీలోని ఒక అపార్టు మెంట్ లో అయితే గాలుల ధాటికి కిటికీ ఊడిపడిపోవటం గమనార్హం. ఖరీదైన ఇళ్ల నిర్మాణం ఇలానా చేసేది? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి..దీనిపై అధికారులు.. ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

Watch the devastation caused by the storm in Noida. This video is from JP Aman Society, where even the windows and doors of the flats were torn off. Homebuyers are furious, alleging extremely poor construction quality in the building of these flats. pic.twitter.com/Lov7F9IabA

— Kunal Verma (@thekunalverma) May 17, 2025
Tags:    
  • NoidaApartments 
  • RainDamage 
  • ConstructionScam 
  • EcoVillageCollapse 
  • RealEstateCrisis 
  • LuxuryHomesOrTraps 
  • BuilderNegligence 
  • NoidaNews 
  • HousingQuality 
  • UrbanLivingDisaster 

Similar News

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS