వైసీపీ సర్కార్ పై మోడీ ఫైర్... జగన్ పై ఇక ఆ విమర్శలు ఉండవా?

తాజాగా రాజమండ్రిలో నిర్వహించిన కూటమి ప్రచార సభలో పాల్గొన్న మోడీ... గతంలో ఎన్నడూ లేని స్థాయిలో అన్నట్లుగా జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు.

Update: 2024-05-06 12:13 GMT

వైసీపీ సర్కార్‌ పై ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోడీ... జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో అన్నట్లుగా.. ఎన్నికల వేళ మోడీ డోసు పెంచారు. ఇందులో భాగంగా... అభివృద్ధి సున్నా.. అవినీతి వందశాతం అంటూ పంచులు విసిరారు. దీంతో... జగన్ పై గత కొంతకాలంగా వినిపిస్తున్న విమర్శలు ఇకపై ఉండవా అనే చర్చ తెరపైకి వచ్చింది!

అవును... తాజాగా రాజమండ్రిలో నిర్వహించిన కూటమి ప్రచార సభలో పాల్గొన్న మోడీ... గతంలో ఎన్నడూ లేని స్థాయిలో అన్నట్లుగా జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. తొలుత... "గోదావరి మాతకు ప్రణామాలు.. ఈ నేల మీదే ఆదికవి నన్నయ్య తొలి కావ్యం రాశారు.. ఇప్పుడు ఇక్కడి నుంచే కొత్త చరిత్ర లిఖించబోతున్నాం" అంటూ తెలుగులో తన ప్రసంగం ప్రారంభించారు. ఈ సందర్భంగా... దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుం ధీమా వ్యక్తం చేశారు.

Read more!

అనంతరం వైసీపీ సర్కార్ పై ఫైరింగ్ స్టార్ట్ చేసిన మోడీ... ఈ ప్రభుత్వం అవినీతిని జెట్‌ స్పీడ్‌ తో పరిగెత్తించిందని.. అభివృద్ధి సున్నా.. అవినీతి వందశాతం అన్నట్లుగా పాలించిందని.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని దుయ్యబట్టారు. ఫలితంగా... ఈ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని పూర్తిగా తిరస్కరిస్తారని మోడీ చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా... కేంద్ర ప్రాజెక్టుల అమలును రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేసిందని చెప్పిన మోడీ... డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఇదే సమయంలో మూడు రాజధానుల ప్రస్థావన తెచ్చిన మోడీ... మూడు రాజధానులు చేస్తామన్నారు.. చేయలేదు. కానీ.. మూడు రాజధానుల పేరిట ఏపీని లూటీ మాత్రం చేశారని ఫైరయ్యారు.

ఇదే క్రమంలో... ఏపీలో మద్యం నిషేధిస్తామని అధికారంలోకి వచ్చిన వైసీపీ.. గద్దె నెక్కిన తర్వాత మాత్రం రాష్ట్రాన్ని మద్యం సిండికేట్‌ గా మార్చేసిందని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వానికి అవినీతి నిర్వహణ తప్ప.. ఆర్థిక నియంత్రణ తెలియదని.. అందువల్లే రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని జగన్ సర్కార్ పై మోడీ తీవ్ర విమర్శలు చేశారు.

ఇదే క్రమంలో... పోలవరం కోసం కేంద్రం రూ.15వేల కోట్లు ఇచ్చింది కానీ, ఆ ప్రాజెక్టును ఈ ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసిందని చెప్పిన మోడీ... రాజధానికి కేంద్రం రూ.15వేల కోట్లు ఇవ్వాలనుకుంది కానీ, కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందుకోలేక పోయింది అని చెప్పడం గమనార్హం!

4

ఆ సంగతి అలా ఉంటే... తాజాగా జగన్ సర్కార్ పై మోడీ ఈ స్థాయిలో విమర్శలు గుప్పించడంతో ఒక కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... నిన్న మొన్నటి వరకూ షర్మిల నుంచి, కమ్యునిస్టుల నుంచీ... మోడీకి జగన్ దత్తపుత్రుడు అని, బీజేపీతో వైసీపీకి అనధికారిక పొత్తు ఉందని చేస్తున్న విమర్శలు ఇకపై వినిపించవేమో అనే కామెంట్లు మొదలయ్యాయి. ఏది ఏమైనా... జగన్ సర్కార్ పై మోడీ ఈ స్థాయిలో విమర్శలు గుప్పించడం కూటమి నేతలు కొత్త ఉత్సాహం నింపిందని అంటున్నారు పరిశీలకులు!

Tags:    

Similar News