• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  విజన్ - 2020 తో రాష్ట్రం...

విజన్ - 2020 తో రాష్ట్రం ధ్వంసం.. ఇక 2047 వస్తే...?

| ప్రజలను ఎన్నిసార్లయినా మోసం చేసి ముంచగలను అని చంద్రబాబు బలంగా నమ్ముతుంటారని అంటుంటారు రాజకీయ ప్రత్యర్ధులు.

By - Tupaki Desk
Update: 2023-08-17 04:34 GMT

ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువ అని.. తాను ఏది చెబితే అది నమ్ముతారని.. ఫలితంగా తాను ప్రజలను ఎన్నిసార్లయినా మోసం చేసి ముంచగలను అని చంద్రబాబు బలంగా నమ్ముతుంటారని అంటుంటారు రాజకీయ ప్రత్యర్ధులు. ఇదే క్రమంలో తనతో పాటు తన మీడియా తలచుకుంటే ప్రజలను ఎన్నిసార్లయినా నమ్మించి వెర్రివాళ్లను చేయగలను అని ప్రగాఢ నమ్మకంతో ఉంటారని చెబుతుంటారు.

నాడు ఇరవయ్యేళ్ళ క్రితం తాను విజన్ - 2020 అంటూ ఒక కాన్సెప్ట్ ని ప్రజల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అందులో పేర్కొన్న మెజారిటీ అంశాలు సామాన్యులకు ఇబ్బందులు కలిగించేవిగానే ఉన్నాయనే విమర్శలు తీవ్రంగా వచ్చాయి. దీంతో చెప్పేవి శ్రీరంగ నీతులు - చేసేవి %$#@& వేషాలు అన్నట్లుగా ఆ విజన్ పై అప్పట్లో కామెంట్లు వినిపించాయి.

అసలు విజన్ - 2020 అంటూ నాడు చంద్రబాబు చేసిందేమిటి? ఫలితంగా.. ప్రజలకు, సమాజానికి ఒరిగిందేమిటి? మొదలైన సందేహాలకు సమాధానంగా ఆయన ట్రాక్ రికార్డ్ ఒకసారి చూద్దాం!


పరిశ్రమల అమ్మకాలు:

చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో దాదాపు 54 పరిశ్రమలను అమ్మేశారు. అయ్యో ఆ సంస్థలు నష్టాల్లో ఉన్నాయి.. వాటిని ప్రభుత్వం ఎందుకు నడపాలి.. అంటూ తన మద్దతుదారులైన మీడియా సంస్థల్లో రోజూ వార్తలు రాయించడం... అయ్యో పాపం అనేలా ప్రజల్లో అభిప్రాయాలు కలిగించడం.. చివరికి అది అమ్మేస్తే మనకు భారం పోతుంది అనేలా జనంలోకి ఒక అభిప్రాయాన్ని బలంగా తీసుకువెళ్లడం వంటి ఆలోచనలు పక్కాగా అమలుచేసేవారని చెబుతారు.

ఇలా ఫలానా ఫ్యాక్టరీ అమ్మేయడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదని.. పైగా ప్రభుత్వానికి ఇబ్బందని జనల్లోకి ఎక్కించి... వాటిని అమ్మేస్తారు. అనంతరం చంద్రబాబు తనదైన ప్రత్యేక జ్ఞానంతో, ముందుచూపుతో వాటిని అమ్మేసి రాష్ట్రానికి భారం తగ్గించారు అని కొంతమందితో చెప్పించి అచ్చేస్తారు!

ఇదే ఫార్ములాతో నాటి ఉమ్మడి రాష్ట్రంలో 54 సంస్ధలను అమ్మేశారు చంద్రబాబు! అది కూడా తన అనుచరులు, తన బినామీలకు పావలాకు అర్ధరూపాయికి ఎన్నో సంస్థలు అమ్మేశారని అప్పట్లో తెగ విమర్శలు వచ్చాయి! అయినప్పటికీ ఈ విజనరీ ఏమాత్రం పట్టించుకోలేదని చెబుతుంటారు!


విద్యుత్ చార్జీల పెంపు - బషీర్ బాగ్ కాల్పులు:

కేవలం ప్రపంచ బ్యాంకు సూచనల మీద పాలన చేసి, ప్రజలను గాలికి వదిలేశారని చంద్రబాబుపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. నాడు ప్రపంచ బ్యాంకు డైరెక్షన్ మేరకు విద్యుత్ చార్జీలు భారీగా పెంచారని అనేవారు. దీంతో ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది.. ఆందోళన చేశారు.. అది కాస్తా కాల్పులకు దారితీయడంతో ముగ్గురు చనిపోయారు. ఈ ఘటన చరిత్రలో ఎర్ర అక్షరాలతో బలంగా నిలిచిపోయింది.

విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరిన సామాన్యులపై చంద్రబాబు సర్కార్ విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. అత్యంత దారుణమైన సంఘటనగా ఇప్పటికీ చరిత్ర పుటల్లో నిలిచింది. బషీర్ భాగ్ అంటే... చంద్రబాబు ప్రభుత్వం జరిపిన కాల్పులే గుర్తుకువస్తాయన్నా అతిశయోక్తి కాదేమో!


అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఈయన చలవే!:

అసలు ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు? అంతేసి జీతాలు దేనికి? అనే భావనలో చంద్రబాబు ఉండేవారని అంటుంటారు. ఫలితంగా... రాష్ట్రంలో తన పాలనలోనే తొలిసారిగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల విధానం తీసుకొచ్చారు. తన హయాంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను నిర్వీర్యం చేసేసి అన్ని శాఖల్లోనూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల విధానం అమలు చేశారు.

అంటే ఒక రెగ్యులర్ ఉద్యోగి చేసే పనులు ఈ అవుట్ సోర్సింగ్ కుర్రాడితో చేయించి కాసిన చిల్లరను జీతంగా ఇచ్చేవారన్నమాట. ఇప్పటికీ అదే అవుట్ సోర్సింగ్ విధానం ఆంధ్రాలో కొనసాగుతోంది. వీరి జీవితాలు చివరివరకూ అదే తక్కువ జీతాలతో కొనసాగక తప్పని పరిస్థితి!


ఆస్పత్రుల్లో యూజర్ చార్జీలు:

అసలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత సేవలు ఎందుకు? ఎంతో కొంత యూజర్ చార్జీలు వసూలు చేద్దాం అనే ఆలోచనలో రోగుల నుంచి ఫీజు వసూలు చేసే యూజర్ చార్జీల విధానం తెచ్చింది కూడా చంద్రబాబు ప్రభుత్వమే. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలోనూ ఈ యూజర్ చార్జీలు వసూలు చేసేవారు. ఓపీ సీటు నుంచి ప్రతీ టెస్ట్ వరకూ అన్నింటిలోనూ ఛార్జీలు వసూల్ చేసేవారు. ఇది కూడా బాబు విజన్ 2020 లో ఒక భాగం కావడం గమనార్హం!

బాబు జమానా అవినీతి ఖజానా!:

చంద్రబాబుతో అప్పట్లో పొత్తులో ఉండే కమ్యూనిష్టు నాయకులు సైతం చంద్రబాబు దాష్టీకాన్ని, కార్పొరేట్ తరహా పనులను భరించలేకో.. అయన అవినీతిని కప్పిపుచ్చలేకో తెలియదు కానీ.. "బాబు జమానా అవినీతి ఖజానా" అంటూ పెద్ద పుస్తకమే రాశారు! ఇందులో బాబు పాలన ఎంత డొల్ల అనేదాన్ని స్పష్టంగా వివరించిన సంగతి తెలిసిందే!


విద్య ప్రైవేటీకరణ:

అసలు విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదు అని గర్వంగా చెప్పుకునే చంద్రబాబు విధానాలవల్ల ప్రభుత్వ విద్యావ్యవస్థ నాశనం అయిందనేది మరో బలమైన విమర్శ. ఆయన హయాంలోనే ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలు తగ్గడంతో కార్పొరేట్ స్కూళ్ళు వీధివీధినా వెలిశాయి.

మధ్యతరగతివాళ్ళు సైతం అప్పు చేసి అయినా సరే కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలకు తమ బిడ్డలను పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అంటూ తన కార్పొరేట్ తరహా భావాలను అయన "మనసులోని మాట" అనే పుస్తకంలో ఘనంగా ప్రస్తావించారు.

ఇలాంటి అరాచక భావాలు, అబద్ధాలు, వ్యవస్థలను ధ్వంసం చేసే ఆలోచనలతో చంద్రబాబు పాలన సాగిందని అంటారు. ఈయన తీరును చూసిన స్విట్జర్లాండ్ ఆర్ధికమంత్రి పాస్కల్ ఓ సదస్సులో మాట్లాడుతూ.. "ఇలాంటి అబద్ధాలకోరులను మా దేశంలో ఐతే జైల్లో కానీ, పిచ్చాసుపత్రిలో కానీ పెట్టేవాళ్ళం" అని అన్నారంటే... తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు!


ఏది విజన్?:

చంద్రబాబు నిజంగా విజనరీ అయితే.. రాష్ట్రం విడిపోయి అప్పటికే అప్పులు, అవస్థల్లో ఉన్న ఆంధ్రకు ప్రత్యేకంగా భారీ రాజధాని ఎందుకు? లక్షల కోట్ల ఖర్చు ఎందుకు? ఇప్పటీకే అభివృద్ధి చెందిన విశాఖ ఉందిగా! రోడ్లు, రైలు మార్గాలు.. విమానమార్గాలు ఉన్న నగరంలోనే కొన్ని భవనాలు కడితే అదే అదే రాజధాని అయ్యేది కదా! అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అలాంటి ఆలోచన లేకుండా... లక్షలకోట్ల ఖర్చయ్యే అమరావతి రాజధాని అంటూ మూడు పంటలు పండే పచ్చని భూములులను రాజధానికి సేకరించి దాన్ని సొంత రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చారనే విమర్శ ప్రజల్లో బలంగా ఉందని చెబుతారు. అందుకు సాక్ష్యంగా 2019లో అమరావతి ప్రాంతంలోని అసెంబ్లీ సీటు కూడా టీడీపీకి రాకపోవడాన్ని గుర్తు చేస్తారు!


ఏపీకి అత్యంత పొడవైన తీర రేఖ ఉంది.. అక్కడ పరిశ్రమలు, సముద్ర ఆధార వ్యవస్థలు ఏర్పాటు చేస్తే ఎన్నో ఉద్యోగాలు వస్తాయి.. రాష్ట్రానికి రెవెన్యూ వస్తుంది.. మరి అంత గొప్ప విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు ఒక్క పోర్ట్ అయినా కట్టారా..? ఇది చంద్రబాబు కచ్చితంగా సమాధానం చెప్పాల్సిన ప్రశ్న!

ఇదే సమయంలో... అనుభవం లేదు అని చంద్రబాబు తరచూ విమర్శించే జగన్ ఎన్ని పోర్టులు కడుతున్నారనేది కూడా కీలకమైన విషయం అనే చెప్పాలి. దీంతో దీన్ని విజన్ అంటారు కానీ.. వ్యక్తిగత స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం చేసే ఆలోచనలను, ప్రజలను ఇబ్బందులకు గురిచేసే పనులనూ విజన్ అనరనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

దీంతో నాడు విజన్ 2020 అంటూ చంద్రబాబు చేసిన దారుణాలను తలచుకుంటున్న ప్రజానికం... ఇక విజన్ 2047 అంటే పరిస్థితి ఎలా ఉంటుందో అనే భయాందోళనలకు గురవుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

Tags:    
  • Narachandrababunaidu 
  • TDP 
  • Vision2047 
  • AndhraPradesh 
  • APPolitics 
  • NCBN 

Similar News

పాపం ఏబీవీ : సోషల్ మీడియా హైప్....డిపాజిట్ గల్లంతు

2026-11-04 08:06 GMT

సుప్రీంషాక్‌: దిగొచ్చిన ఎన్నిక‌ల సంఘం.. బిగ్ రిలీఫ్‌!

2026-11-04 08:02 GMT

ఈమె ఏ పార్టీలోచేరినా విజయమే.. లక్ అంటే రమాకుమారిదే..

2026-11-04 08:01 GMT

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

2026-11-04 06:09 GMT

2029 ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర.. రాజకీయ పార్టీలకు Gen Z కొత్త సవాల్!

2026-11-04 05:40 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఆదోనిలో జనసేన రెబల్ సంచలనం.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు షాక్!

2026-11-04 04:56 GMT

అమెరికాలో 3 లక్షలకు పైగా వీసాలు రద్దు.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

2026-11-04 04:55 GMT

ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. ప్రతినిధుల సభపై డెమోక్రాట్ల పట్టు

2026-11-04 04:29 GMT

పట్టణ రిజల్ట్...పరిషత్తులలో రిపీట్ ?

2026-11-04 03:38 GMT

మోడీ ఓపెన్ డిబేట్ విత్ రాహుల్...జనం కోరిక కూడానా ?

2026-11-04 01:30 GMT

కూటమి డెడ్లీ కాంబో...అందుకే వైసీపీ ఫల్టీ !

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS