లోకేష్ తో ఢీ కొట్టాల్సిందే !
ఇక తాజాగా మహానాడుని చూస్తే కనుక బాబు వారసుడిగా లోకేష్ దాదాపుగా పార్టీ మొత్తం అంగీకారాన్ని పొందారు అనిపిస్తోంది.;
ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు మార్క్ వ్యూహాలకు చాణక్య రాజకీయాలకు ప్రత్యర్ధులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సైలెంట్ గా బాబు వేసే ఎత్తులు అర్థం అయ్యేటప్పటికే అసలు కధ నడచిపోతోంది ప్రత్యర్ధులు దానిని వేరే విధంగా చెప్పవచ్చు కానీ రాజకీయాల్లో వ్యూహాలే ఉంటాయి. ఆ రాజకీయ ఆట ఆడడంతో బాబుని మించిన వారు తెలుగు నాటనే కాదు దేశంలోనే ఎవరూ లేరు అని చెప్పాల్సి ఉంటుంది.
ఇక తాజాగా మహానాడుని చూస్తే కనుక బాబు వారసుడిగా లోకేష్ దాదాపుగా పార్టీ మొత్తం అంగీకారాన్ని పొందారు అనిపిస్తోంది. అంతే కాదు ఆయన తన నాయకత్వ లక్షణాలను కూడా నిరూపించుకుంటూ ఇటీవల సంవత్సరాలలో దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఆయన చాలా మంది నాయకుల కంటే మీడియాను బాగా ఫేస్ చేస్తున్నారు అంతే కాదు అనేక మంది ఇతర నేతల కంటే ఆయన పబ్లిక్ స్పీచెస్ బాగుంటున్నాయి. ప్రజలతో ఆయన కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగుంటున్నాయి.
ఇక బలమైన తెలుగుదేశం పార్టీ లోకేష్ వెనకాల ఉంది. క్యాడర్ అండగా ఉంది. యువతరం ఆయనను కోరుకుంటోంది. దాంతో తెలుగుదేశం పార్టీ చంద్రబాబుతోనే సరి అని ఎవరు అనుకున్నా లేక ఆ ఆలోచనల్లో ఉన్నా వెంటనే సరిచేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అని అంటున్నారు. లోకేష్ ఇక టీడీపీకి బలమైన నాయకుడిగా అవతరించారు.
ఆయన చేతిలో పార్టీ ఉండబోతోంది అన్నది వాస్తవం. ఇక సీఎం సీటుకు ఆయన ఎపుడు చేరుకుంటారు ఎపుడు ముఖ్యమంత్రిగా పాలిస్తారు అన్నది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. తాజా మహానాడుతో తేలింది ఏమిటి అంటే టీడీపీ మరో నాలుగు దశాబ్దాల పాటు లోకేష్ నాయకత్వంలో కొనసాగబోతోంది అన్నది.
యూపీలో సమాజ్ వాది పార్టీని అఖిలేష్ యాదవ్ బాగానే లీడ్ చేస్తున్నారు. దానికి కారణం తండ్రి స్థాపించిన పార్టీ నుంచే ఆయన ఎదిగి ఆమోద ముద్ర వేయించుకున్నారు పార్టీ అంతా ఆయన వెనకాల నిలిచి ఉంది. దాంతో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా అఖిలేష్ ఎస్పీకి అధినేతగా సక్సెస్ ఫుల్ గా సాగుతున్నారు.
లోకేష్ కూడా అదే తీరున టీడీపీని నడిపించబోతున్నారు. సో ప్రత్యర్ధులు ఎవరైనా చంద్రబాబు తరువాత టీడీపీ ఇబ్బందులో పడుతుందని అతి పెద్ద పొలిటికల్ వ్యాక్యూమ్ ఏపీలో ఏర్పడబోతుంది, అందులోకి తాము వెళ్ళవచ్చు అని ఆశలు పెట్టుకుంటే కనుక వాటి నుంచి కూడా బయటపడాల్సి ఉంటుంది.
ఇక వైసీపీ అయితే లోకేష్ తోనే ఢీ కొట్టడానికి రెడీ అవాల్సిందే అని అంటున్నారు. చంద్రబాబు మార్క్ రాజకీయాలు ఒక లెక్క అయితే లోకేష్ వి దూకుడు రాజకీయాలు ఆయనకు మొహమాటాలు లేవు, టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా ఆయన పాలిటిక్స్ ఉంటుంది తప్పు చేసిన వారిని చట్టప్రకారం శిక్షిస్తామని రెడ్ బుక్ సాక్షిగా యువగళంలో లోకేష్ చెప్పారు. ఆయన అదే ఇపుడు చూపిస్తున్నారు దాంతో లోకేష్ రాజకీయం వేరేగా ఉంటుందని ఇప్పటికే అర్ధం అయింది అని అంటున్నారు.
సో భవిష్యత్తులో ఆ విధంగానే ప్రిపేర్ కావాల్సి ఉంది అని అంటున్నారు. అదే విధంగా కూటమిలోని పార్టీలు కూడా చంద్రబాబు పాలిటిక్స్ కి ట్యూన్ అయి ఉన్నాయి. రేపటి రోజున లోకేష్ పాలిటిక్స్ తోనూ కలసి అడుగులు వేయాలి. ఈ రోజులు మిత్రులుగా ఉన్న వారు ఎల్లకాలం అలాగే కొనసాగుతారు అని ఏమీ లేదు. పైగా ఏపీలో టీడీపీ ఎంత తగ్గితే అంతలా తాను ఎదగాలని బీజేపీ ఆశలు పెంచుకుందని ప్రచారం అయితే ఉంది ఆశలు ఏ రాజకీయ పార్టీకి అయినా ఉండడం సహజం.
కానీ టీడీపీకి లోకేష్ నాయకుడిగా ఉన్నాక ఆ పార్టీ తగ్గిపోవడం అంటూ ఉండదు, దానికి తగినట్లుగా తమ వ్యూహాలను ఆ పార్టీ మార్చుకోవాల్సి ఉంటుంది. జనసేన అధినేత పవన్ ఎప్పటికైనా సీఎం కావాలీ అనుకుంటే ఆ పార్టీ కూడా దానికి తగిన విధంగా తమ వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే తాజా మహానాడుతో ఏపీలో అయితే టీడీపీలో కొత్త తరంతో పోటీ పడాల్సిన అవసరాన్ని అనివార్యతను అయితే కచ్చితంగా ప్రత్యర్ధులకు ఒక సందేశాన్ని పంపించింది అని అంటున్నారు.