లోకేష్ కి నిండు దీవెనలు
ఏపీలో రైజింగ్ పొలిటికల్ స్టార్ గా నారా లోకేష్ ఉన్నారు. ఆయన సరైన సమయానికి అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి అందుకు వచ్చిన నాయకుడుగా ఉన్నారు. నారా లోకేష్ ఈసారి మాత్రం తన పనితీరుని బాగా మెరుగు పరచుకున్నారు. ఆయన విషయంలో పార్టీ నేతలకు గతంలో ఉన్న సందేహాలు అయితే ఇపుడు ఏమీ లేవు అని చెప్పాలి. అలాగే ప్రజలకు కూడా లోకేష్ నాయకత్వం మీద నమ్మకం కలిగేలా ఆయన వ్యవహరిస్తున్నారు.
బీజేపీ పెద్దలతో :
ఈ మధ్య కాలంలో బీజేపీ పెద్దలతో నారా లోకేష్ తన సన్నిహిత సంబంధాలను మెరుగు పరచుకున్నారు. విశాఖ సభలో లోకేష్ ని రమ్మని పొలిచిన నరేంద్ర మోడీ అమరావతి సభలో తానే మరోసారి గుర్తు చేసి మరీ ఆయనను ఢిల్లీకి పిలిపించుకున్నారు. అంతే కాదు అప్పటి నుంచి మరో సారి మోడీని కలిసేందుకు వెళ్ళిన లోకేష్ అలా తన బంధాన్ని గట్టి పరచుకున్నారు. కేంద్రలో మోడీ అమిత్ షాలకు ఏపీలో ఫ్యూచర్ లీడర్ గా లోకేష్ కనిపిస్తున్నారు అని అంటున్నారు.
అదే అభిమానంతో :
తాజాగా కర్నూల్ లో జరిగిన మోడీ పర్యటనలో మరోసారి నారా లోకేష్ ప్రత్యేక ఆకర్షణ అయ్యారు. మోడీ అయితే లోకేష్ ని చూసి ఆసక్తికరమైన వ్యాఖ్యలే చేశారు. మీ నాన్నలా తయారవుతున్నావంటూ కితాబు ఇచ్చారు. ఇది లోకేష్ ఫిజిక్ విషయంలో అనుకుంటే పొరపాటే అని అంటున్నారు. బాబు మాదిరిగా నాయకత్వ లక్షణాలను లోకేష్ నిండుగా మెండుగా అభివృద్ధి చేసుకున్నారు అన్నది కూడా అంతర్గత భావన అని విశ్లేషిస్తున్నారు.
లోకేష్ జోరు చూసి :
ఈ మధ్యనే గూగుల్ డేటా సెంటర్ ఒప్పందం కుదిరింది. దాని వెనక నారా లోకేష్ కృషి ఎంతో ఉంది. జాతీయ స్థాయిలో ఇది విపరీతమైన చర్చకు ఆస్కారం ఇచ్చింది. ఐటీ మంత్రిగా నారా లోకేష్ తన సామర్ధ్యాన్ని ఈ వరల్డ్ క్లాస్ ప్రాజెక్ట్ ని ఏపీకి తేవడంలో అంతా చూశారు. మోడీ కూడా ఈ ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టడంతో పాటు అన్ని విషయాలను గమనిస్తూ వచ్చారు. దాంతోనే ఆయన లోకేష్ సామర్థ్యం మీద నమ్మకం కుదిరి ఈ తరహా వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.
కాబోయే సీఎం గా :
ఇదిలా ఉంటే మోడీ నిండు దీవెనలు లోకేష్ కి ఉన్నాయని పలు సందర్భాలలో రుజువు కావడమే కాదు తాజా పర్యటనలో మీ నాన్న మాదిరిగానే అంటూ మోడీ చెప్పడంతో టీడీపీ క్యాడర్ అంతా మురిసిపోతున్నారు. ఇక కాబోయే సీఎం గా లోకేష్ అన్నట్లుగా మోడీ వ్యాఖ్యలను చూడాలని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఏపీలో బలంగా ఉంది. అంతే కాదు చంద్రబాబు నాలుగు సార్లు సీఎం అయ్యారు, ఇక భవిష్యత్తు నాయకులుగా టీడీపీలో చూడాలంటే కచ్చితంగా లోకేష్ కనిపిస్తున్నారు అని అంటున్నారు.
స్పెషల్ అట్రాక్షన్ :
నిజానికి చూస్తే ఏపీలో బీజేపీ విస్తరించాలని అనుకుంది కానీ దానికి చాలా సమయం పడుతుంది. అందుకే టీడీపీతోనే పొత్తులు పెట్టుకోవాల్సి ఉంది. టీడీపీలో ఇపుడు నారా లోకేష్ అతి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అందుకే కేంద్ర బీజేపీ పెద్దలు కూడా ఈ విషయాన్ని గమనిస్తున్నారు అని అంటున్నారు. ఇలా ఏపీకి వచ్చిన సందర్భాలలో మోడీ లోకేష్ ని ప్రత్యేకంగా ప్రశంసించడం వంటివి చూసిన వారు అంతా నారా లోకేష్ కి మహా రాజయోగం పట్టే కాలం ముందు ఉంది అని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీ రాజకీయాలలో ఇపుడు స్పెషల్ అట్రాక్షన్ ఎవరు అంటే తప్పనిసరిగా నారా లోకేష్ అనే చెప్పాల్సి ఉంటుంది.