యువ ధనవంతులు మన వాళ్ళండోయ్ !
మనకు లేనిదేమిటి అన్నీ ఉన్నాయి. మన వాళ్ళు చదువుల్లో గ్రేట్. టాలెంట్ లో సూపర్, సంపదలో సైతం సూపర్ టాప్.;
మనకు లేనిదేమిటి అన్నీ ఉన్నాయి. మన వాళ్ళు చదువుల్లో గ్రేట్. టాలెంట్ లో సూపర్, సంపదలో సైతం సూపర్ టాప్. ఇది మనకు మనం జబ్బలు చరచుకుంటోంది కాదు నివేదికలే గట్టిగా చెబుతున్నాయి. మేరా భారత్ మహాన్ అంటే ఇది గర్వంతో కాదు ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకునే వినయంతోనే అని ఇక మీదట అంతా అర్ధం చేసుకోవాలి. ఎందుకంటే యువ సెంటీ మిలియనీర్ జాబితాలో ఈ రోజు భారత్ టాప్ గేర్ లో ఉంది. ఇంకా విశేషం ఏంటి అంటే చైనా, యూకేను సైతం దాటేసి భారత్ టాప్ చెయిర్ ని ఆక్రమించింది. ఈ జాబితాలో చూసుకుంటే అక్షరాలా భారత్ నుంచి 201 మంది యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారు అంటే జయహో భారత్ అని తీరాల్సిందే.
భారతీయులు ఉండడం గ్రేటెస్ట్ :
వంద మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపద ఉన్న వారిని సెంటీ మిలియనీలుగా పేర్కొంటూ అవెండస్ వెల్త్ మేనేజ్‌మెంట్ హురున్ ఇండియా ఒక జాబితాను తాజాగా రిలీజ్ చేశారు. ఈ జాబితాలో సెంటీ మిలియనీలుగా మొత్తం 505 మంది యువ పారిశ్రామిక వేత్తలు ఉన్నారు అందులో 201 మంది భారతీయులు ఉండడం గ్రేటెస్ట్ అని అంటున్నారు.
ఇదీ పక్కా లెక్క :
మొత్తం 505 మందిలో తీసి చూస్తే భారత్ నుంచి 201 మంది, చైనా నుంచి 194 మంది, యూకే నుంచి 110 మంది చోటు దక్కించుకున్నారు. ఇక అందులో చూస్తే ఇండియాస్ యూ40 క్యాపిటల్ గా ఉన్నది బెంగళూరు సిటీ అంటే ఇంకా సర్ప్రైజ్ గా ఉంది. భారత్ కి చెందిన 201 మంది లిస్ట్ లో ఏకంగా 48 మంది యువ పారిశ్రామికవేత్తలు ఒక్క బెంగళూరు నుంచే ఉన్నారు. నలభై ఏళ్ళ లోపు వయసు కలిగిన ఈ యంగ్ బిజినెస్ టర్క్స్ అంతా భారత్ కి గర్వకారణంగా ఉన్నారు.
మొదటి తరం బిజినెస్ మెన్ :
ఇక 40 లోపు వారంతా తొలి తరం పారిశ్రామికవేత్తలుగా ఉన్నారు. వీంతరా 100 మిలియన్ డాలర్ల సంపదతో ఉన్న వారిగా ఎంచి ఎంపిక చేశారు. వారసత్వ వ్యాపారవేత్తలకు 200 మిలియన్ డాలర్ల వ్యాపార విలువగా లెక్క కట్టి తరువాత జాబితాలో ఉంచారు.
ఈ రంగాలే కీలకం :
మరి దేశంలో ఉన్న ఈ యంగ్ బిజినెస్ టర్క్స్ ఏ రంగంలో తమ వ్యాపారాభివృద్ధిని సాధించారు అన్నది కనుక చూస్తే సాఫ్ట్ వేర్ ప్రొడక్షన్ ఫీల్డ్ లో సేవా రంగం నుంచి 40 మంది ఉన్నారు. హెల్త్ కేర్ లో 18 మంది, రవాణా రంగంలో 16 మంది, ఆర్ధిక సేవల నుంచి 15 మంది ఉన్నారు. ఇక ఈ 201 మంది యువ పారిశ్రామికవేత్తలకు చెందిన సంస్థల మొతం విలువ చూస్తే 357 బిలియన్ డాలర్లుగా ఉంది. పైగా వీరంతా ఏకంగా 4.43 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ చిన్న వయసులోనే అతి పెద్ద వృక్షంగా మారుతున్నారు.వీరి వల్ల దేశం జీడీపీ కూడా అత్యధికంగా పెరిగుతోంది అని అవెండస్ వెల్త్ మేనేజ్‌మెంట్ ఎండీ అండ్ సీఈవో అపూర్వ సాహిజ్వానీ చెప్పడం విశేషం. ఈ యువ పారిశ్రామికవేత్తలు చదువు చూస్తే ఎక్కువ మంది ఖరగ్ పూర్ ఐఐటీ నుంచి వచ్చిన వారుగా చెబుతున్నారు. ఇక ఈ యువ పారిశ్రామికవేత్తలలో భారతీయ మహిళల లిస్ట్ చూస్తే 15 మంది మాత్రమే ఉన్నారు. ఈ విషయంలో చైనా 29 మందితో మంచి ప్లేస్ లో ఉంది.