లోకేష్ కి పెద్దల దీవెనలు
ఇక అన్నింటికీ మించి లోకేష్ మెచ్యూరిటీ లెవెల్స్ బాగా పెరిగాయి. ఆయన ప్రభుత్వ మంత్రిత్వ శాఖల పట్ల పూర్తి అవగాహనతో ఉన్నారు.;
నారా లోకేష్ ఈ రోజు ఏపీ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారారు. ఒకనాడు ఆయనను అంతా పప్పు అనేవారు. అయితే తన మీద అంతా అలా సెటైర్లు వేసిన నోళ్ళకే రెడ్ బుక్ క్రియేటర్ గా మారి మరీ చెక్ పెట్టేస్తున్నారు. లోకేష్ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదుగురున్నారు. లోకేష్ 2.0 అన్నది ఏంటో 2024 ఎన్నికల ముందు నుంచి చూపిస్తున్నారు.
ఈ రోజున ఆయన పార్టీలో ప్రభుత్వంలో తనదైన ముద్ర వేసుకున్నారు. తండ్రి చంద్రబాబుని అనుసరిస్తూనే పాలిటిక్స్ లో తనకంటూ ఒక కొత్త ఒరవడిని సృష్టించుకున్నారు. తండ్రి ఐటీ అంటే కుమారుడు వాట్సప్ గవర్నెన్స్ ని తెచ్చారు. ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుడుతున్నారు.
ఇక అన్నింటికీ మించి లోకేష్ మెచ్యూరిటీ లెవెల్స్ బాగా పెరిగాయి. ఆయన ప్రభుత్వ మంత్రిత్వ శాఖల పట్ల పూర్తి అవగాహనతో ఉన్నారు. అలాగే లోకేష్ ప్రసంగాలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశంలో భావి వారసుడిగా లోకేష్ కీర్తించబడుతున్నారు.
అయితే ఇంట గెలిస్తే చాలదు రచ్చ గెలవాలి. పైగా ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. బీజేపీకి ఏపీలో బలం ఎంత అన్నది పక్కన పెడితే నైతికంగా ఆ పార్టీ మద్దతు ఏ పని చేసినా కావాల్సి వస్తోంది. దాంతోనే లోకేష్ విషయంలోనూ ముందు కేంద్ర పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నాయన్నది టీడీపీ అధినాయకత్వం జాగ్రత్తగా బేరీజు వేసుకుంటోంది.
గతంలో అయితే వారసత్వ రాజకీయాల మీద బీజేపీ గట్టి పట్టుదల మీద ఉండేది. ఇపుడు అలా కాదు, బీజేపీ రాజకీయ అనివార్యతను గుర్తించి దానికి తగినట్లుగా ముందుకు సాగుతోంది అని చెప్పాలి. ఏపీలో చూస్తే చంద్రబాబుతో దోస్తీ చేస్తూనే భవిష్యత్తు ఆలోచనలు బీజేపీ చేస్తోంది. ఆ నేపథ్యంలో బీజేపీకి లోకేష్ సైతం మంచి నాయకుడిగా కనిపిస్తున్నారు.
అందుకే ప్రధాని మోడీ సైతం లోకేష్ ని తనను వచ్చి కలవాలని కోరడం జరుగుతోంది. బీజేపీకి దాని రాజకీయ అవసరాలు ఉన్నాయి. అలాగే ఏపీలో చూస్తే టీడీపీ తిరుగులేని స్థితిలో ఉంది. దాంతో తెలుగుదేశంతో చెలిమి మరింత కాలం కొనసాగించాలన్నదే బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది.
చంద్రబాబుతో పాటుగా లోకేష్ కూడా టీడీపీలో అతి ముఖ్య పాత్ర పోషిస్తున్న క్రమంలో ఈ విషయాలను జాగ్రత్తగా గమనిస్తున్న బీజేపీ లోకేష్ ని సైతం ప్రోత్సహిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పాటు కేంద్ర బీజేపీ పెద్దలు కూడా టీడీపీ రాజకీయ వారసుడి విషయంలో అనుకూలంగానే ఉన్నట్లుగా ప్రచారం అయితే సాగుతోంది.
ఈ రోజు అంటే కాదు కానీ ఏదో రోజున లోకేష్ ఏపీకి ముఖ్యమంత్రి అవుతారని తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు నమ్ముతున్నారు. ఇక చంద్రబాబు విషయానికి వస్తే ఆయన అమరావతి రాజధాని ప్రాజెక్టు విషయంలో పట్టుదలగా ఉన్నారు. ఈ టెర్మ్ లోగా దానిని కంప్లీట్ చేయాలన్నది ఆయన ఆలోచన. అలాగే పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకుంది.
2029 నాటికి ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఆ ఎన్నికల్లోనూ విజయం తమకు తప్పక దక్కుతుంది అన్న ఆశలు ఉన్నాయి. ఆ మీదట లోకేష్ పట్టాభిషేకం చాలా సులువుగా అసాత్గుతుంది అని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే కేంద్ర బీజేపీ పెద్దల నుంచి తగినంత సానుకూలతను సొంతం చేసుకుంటే ఏ రకమైన చీకూ చికాకులూ లేకుండా లోకేష్ ఏపీకి భావి సారధి అవుతారని అంటున్నారు. దానికి అనుగుణంగా సాగుతున్న పరిణామాల్లో కేంద్ర బీజేపీ పెద్దలు కూడా లోకేష్ కి తమదైన దీవెనలు అందిస్తున్నారు.