• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రేప‌టి నుంచి లోకేష్...

రేప‌టి నుంచి లోకేష్ ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌.. ఎందుకంటే!

| ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు.

By - Garuda Media
Update: 2025-10-18 14:07 GMT

ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనాల్సిందిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం తరపున ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ గ‌త నెల‌లో మంత్రి లోకేష్ కు ఆహ్వానం పంపారు. దీనిని గ‌తంలో గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న మోడీ అందుకున్నారు. త‌ర్వాత‌.. రాజ‌కీయ నాయ‌కుల్లో అందుకున్న నేత నారా లోకేష్ మాత్ర‌మే కావ‌డం గ‌మ‌నార్హం.

రాష్ట్రంలోని త‌న శాఖ ద్వారా.. మానవ వనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో తీసుకువ‌చ్చిన సంస్క‌ర‌ణ‌ల‌ను ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం.. ఈ మేరకు స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం కావాలని మంత్రి నారా లోకేష్ ను కోరింది. దీనిలో భాగంగా మంత్రి లోకేష్ ఈ నెల 19 నుంచి 24 వ‌ర‌కు ఆస్ట్రేలియాలో ప‌ర్య‌టిస్తారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వివిధ యూనివర్సిటీలను సందర్శించి అక్కడి అధునాతన విద్యావిధానాలపై అధ్యయనం చేస్తారు.

దీంతోపాటు నవంబర్ 14,15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ విజయవంతం చేయాలని కోరుతూ రోడ్ షోల్లో పాల్గొంటారు. ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం 19వ తేదీ ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సిడ్నీ చేరుకుంటారు. సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఆవరణలో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొంటారు. 20వ తేదీ ఉదయం 9 గంటలకు రాండ్విక్ లోని యూనివర్సిటీ ఆఫ్ న్యూసౌత్ వేల్స్ ను సందర్శిస్తారు.

పార్లమెంట్ హౌస్ ఆవరణలో ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో నిర్వహించే సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొంటారు. 21న పర్రమట్టలో సీఫుడ్స్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా నిర్వహించే సెంటర్ ఫర్ ఆస్ట్రేలియా ఇండియా రిలేషన్స్ ఆక్వా ప్రతినిధుల సమావేశంలో పాల్గొంటారు. వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ ని సందర్శించి సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, వ్యవసాయ సాంకేతిక నిపుణులతో సమావేశమవుతారు. బ్రిస్బేన్ లో క్వీన్స్ లాండ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్టిమెంట్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. అలాగే, ఏపీలో అధునాతన స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణంపై ఆర్కిటెక్ట్ లీడర్ షిప్ టీమ్ తో భేటీ అవుతారు.

Tags:    
  • NaraLokesh 
  • AustraliaVisit 
  • SpecialVisitsProgram 
  • APMinister 

Similar News

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

Copyright @2026

Powered by Blink CMS