• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మీ లెక్కలు తేలుస్తా.....

మీ లెక్కలు తేలుస్తా.. వైసీపీ నేతలకు లోకేశ్ వార్నింగ్

| తల్లికి వందనం పథకంలో రూ.2 వేలు కోత విధించడంపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలుపై ఏపీ విద్యాశాఖ మంత్రి, యువనేత నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు.

By - Tupaki Desk
Update: 2025-06-14 04:00 GMT

తల్లికి వందనం పథకంలో రూ.2 వేలు కోత విధించడంపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలుపై ఏపీ విద్యాశాఖ మంత్రి, యువనేత నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలకు టైము ఇస్తున్నానని, 24 గంటల్లో వారు చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. లోకేశ్ మాస్ వార్నింగుతో మళ్లీ వైసీపీ నేతల అరెస్టులు ఉంటాయా? లేక కోర్టులో వారికి వ్యతిరేకంగా పిటిషన్ వేసి న్యాయబద్ధంగా చర్యలు తీసుకుంటారా? అన్న చర్చ జరుగుతోంది.

తల్లికి వందనం పథకంలో మినహాయించిన రూ.2 వేలు పాఠశాలల అభివృద్ధి కోసం పాఠశాల నిధికి ప్రభుత్వం జమ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఆ రూ.2 వేలు మంత్రి లోకేశ్ సొంత ఖాతాకు వెళుతున్నట్లు వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని లోకేశ్ దృష్టికి వచ్చిందని చెబుతున్నారు. దీనిపై స్పందించిన మంత్రి లోకేశ్ తనపై ఆరోపణలను 24 గంటల్లో నిరూపించాలని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. ఆ నగదు తన ఖాతాలోకి వచ్చినట్లు చూపించకపోతే సిరయస్ యాక్షన్ ఉంటుందని హెచ్చిరించారు. నింద వేసి పారిపోతే ఊరుకోబోమని చెప్పిన లోకేశ్... ఆరోపణలను నిరూపించలేని పక్షంలో తీవ్ర పరిణామాలకు సిద్ధంగా ఉండాలని వైసీపీ నేతలకు సూచించారు.

వైసీపీ నేతలకు వ్యతిరేకంగా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైన తల్లికి వందనం పథకంలో 67,27,164 మంది విద్యార్థులకు రూ.8,745 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. దీనిపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ముందుగా ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున ఇస్తామని చెప్పిన ప్రభుత్వం అందులో రూ.2 వేలు తగ్గించడాన్ని ప్రతిపక్ష వైసీపీ తప్పుపడుతోంది. అయితే తగ్గించిన రూ.2 వేలు మంత్రి నారా లోకేశ్ సొంత ఖాతాకు జమ అయ్యాయని వైసీపీ చేసిన విమర్శలు వివాదాస్పదమయ్యాయి.

తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని మంత్రి సవాల్ చేయడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. మంత్రి సవాల్ ను వైసీపీ స్వీకరిస్తుందా? లేదా? అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే మంత్రి నారా లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని, తమ నేతలను అరెస్టు చేయిస్తున్నారని వైసీపీ చెబుతోంది. ఈ పరిణామాల్లో మళ్లీ లోకేశ్ పై విమర్శలు చేయడంతో మిస్ ఫైర్ అయ్యారా? అనే ప్రశ్న తలెత్తుతోందని అంటున్నారు. రాజకీయంగా ఏ విమర్శ అయినా చేయొచ్చని, కానీ ఆధారాలు లేని విమర్శలు వల్ల రాజకీయంగా నష్టమే ఎక్కువ జరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మంత్రి లోకేశ్ తన ప్రత్యర్థులపై కోర్టుల్లో కేసులు వేశారు. ఇప్పుడు అధికారంలో ఉండగా, ప్రత్యర్థులను అంత తేలిగ్గా విడిచిపెడతారా? అన్నది కూడా ఉత్కంఠకు గురిచేస్తోంది. ఈ ఎపిసోడ్ ను వైసీపీ ఎలా టర్న్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    
  • NaraLokesh 
  • YSRCPvsTDP 
  • ThallikiVandanam 
  • PoliticalWar 
  • AndhraPolitics 
  • FalseAllegations 
  • LokeshWarning 
  • APEducationScheme 
  • RedBookGovernance 
  • PoliticalNews 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS