నందిగామ గరం గరం.. తప్పుల కుప్ప.. !
ఎన్టీఆర్ జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం నందిగామ. ఇది ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం అన్న విష యం తెలిసిందే. చంద్రబాబు గత హయాంలోనే దీనిని మునిసిపాలిటీ చేశారు.;
ఎన్టీఆర్ జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం నందిగామ. ఇది ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం అన్న విష యం తెలిసిందే. చంద్రబాబు గత హయాంలోనే దీనిని మునిసిపాలిటీ చేశారు. ఆ తర్వాత.. దీని అభి వృద్ధికి నిధులు కూడా కేటాయించారు. ఇక, 2021లో జరిగిన ఎన్నికల్లో ఈ మునిసిపాలిటీని వైసీపీ చేజి క్కించుకుంది. దీనికి ముందు.. తర్వాత కూడా.. ఈ మునిసిపాలిటీలో అవినీతి ఆరోపణలు వినిపించాయి. రెండు కీలక పార్టీలకు చెందిన నాయకులుకుమ్మక్కయ్యారన్నదిప్రధాన ఆరోపణ.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పటికీ.. కొన్ని కొన్ని చోట్ల నాయకులు కలిసిపోయారు. చేతులు కలుపుకొన్నారు. ఇలానే నందిగామ మునిసిపాలిటీలోనూ గత, ఇటీవల కాలం ముగిసిన పాలక మండలి నాయకులు కూడా అర్ధవంతంగా అవినీతికి పాల్పడ్డారని.. ప్రస్తుతం .. ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్న డిప్యూటీ కలెక్టర్ నివేదిక రెడీ చేశారు. దీనిలో ఇరు పక్షాల పాత్ర ఉందని ఆయన తేల్చారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
రాష్ట్రంలో మునిసిపాలిటీలు అనేకం ఉన్నా.. ఎక్కడా లేని విధంగా నందిగామలో భారీ అవినీతి జరిగిన విషయం తెలియడంతో స్థానికంగా కూడా.. రాజకీయ ఇబ్బందులు ప్రారంభం అయ్యాయి. త్వరలోనే మునిసిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయంపై విచారణకు ఆదేశించి.. చర్యలు తీసుకునేందుకు రెడీ అయింది. వైసీపీతో చేతులు కలిపి.. కాంట్రాక్టులు దక్కించుకున్న వారిపై నిఘా ను ముమ్మరం చేసింది.
అసలు ఏం జరిగింది..?
నందిగామ మునిసిపాలిటీలో.. కాంట్రాక్టు పనులను నామినేషన్ విధానంలో పంచేశారు. దీంతో మునిసిపా లిటీకి రావాల్సిన ఆదాయానికి గండి పడింది. ఇది పెద్ద చిక్కుగా మారింది. గత పాలక మండలిలో కొన్ని తప్పులు జరగగా.. తర్వాత.. వైసీపీ వచ్చిన వెంటనే.. ఆ పార్టీకి చెందిన నాయకులు కూడా ఇలానే నామినేషన్ విధానంలో పనులు పంచుకున్నారు. అంతేకాదు.. ఈ విషయంలో టీడీపీ-వైసీపీ నేతలు కలిసిపోయారన్నది ప్రధాన ఆరోపణ.
దీంతో ఒకరి తప్పులు మరొకరు కప్పిపుచ్చుకున్నారు. ఇటీవల మునిసిపాలిటీలలో పాలక మండలి గడువు తీరడంతో ఇవన్నీ వెలుగు చూశాయి. ప్రస్తుతం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం విచారణ చేసి.. నివేదిక ఇవ్వాలని.. మునిసిపల్‌కమిషనర్‌ను ఆదేశించింది.