• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Finance >  రికార్డు: రూ.50లక్షల...

రికార్డు: రూ.50లక్షల కోట్లకు మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు

| తాజాగా ఈ ఆస్తుల విలువ ఏకంగా రూ.50లక్షల కోట్ల మార్క్ ను దాటేశాయి. గత ఏడాది మొత్తమ్మీదా ఫండ్స్ నిర్వాహణ ఆస్తులు 27 శాతం వ్రద్ధి చెందాయి.

By - Tupaki Desk
Update: 2024-01-09 04:56 GMT

దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతలా దూసుకెళుతుందన్న దానికి నిదర్శనంగా మారింది తాజాగా వెలువడుతున్న గణాంకాలు. గతంలో ఒక మార్కు సాధించటానికి దేశానికి 50 ఏళ్లు పడితే.. తాజాగా అదే మార్కును కేవలం ఏడాది వ్యవధిలో చేరుకోవటం చూసినప్పుడు.. దేశీయ ఆర్థిక రంగం ఎంత దూకుడుగా వెళుతుందన్న విషయం అర్థమవుతుంది. పెరుగుతున్న దేశ ప్రజల సంపాదనలకు తగ్గట్లే.. వివిధ రంగాలు మరింత వేగంగా దూసుకెళుతున్నాయి. తాజాగా దేశీయ మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక రిపోర్టులో పలు ఆసక్తికర అంశాలు కనిపించాయి.

దేశ మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తోంది. దేశంలోని అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వాహణలోని ఆస్తుల విలువ 2023 డిసెంబరు చివరికు అరుదైన రికార్డును నమోదు చేసింది. తాజాగా ఈ ఆస్తుల విలువ ఏకంగా రూ.50లక్షల కోట్ల మార్క్ ను దాటేశాయి. గత ఏడాది మొత్తమ్మీదా ఫండ్స్ నిర్వాహణ ఆస్తులు 27 శాతం వ్రద్ధి చెందాయి.

2021 చివరి నాటికి దేశీయ మ్యూచువల్స్ ఫండ్స్ సంస్థ ఆస్తులు రూ.38.88 లక్షల కోట్లుగా ఉంటే.. 2022 చివరకు రూ.39.88లక్షల కోట్లకు చేరుకుంది. అయితే.. గత ఏడాది చివరకు మాత్రం ఏకంగా రూ.50.77 లక్షల కోట్లకు చేరుకోవటం గమనార్హం. ఈక్విటీ మార్కెట్లలో ఆశావహ ధోరణి.. మ్యూచువల్ ఫండ్స్ పట్ల పెరుగుతున్న అవగాహన.. బలమైన ఆర్థిక మూలాలు.. ఫండ్స్ పెట్టుబడుల విషయంలో క్రమశిక్షణ.. ఇవన్నీ సానుకూలాంశాలుగా చెప్పాలి. గడిచిన 11 ఏళ్లుగా వరుసగా ఫండ్స్ నిర్వాహణ ఆస్తులు పెరుగుతున్నాయి.

ఇక్కడో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ మొదటి రూ.10లక్షల కోట్ల నిర్వహణ ఆస్తుల్ని సమకూర్చుకోవటానికి 50 ఏళ్లు పడితే.. తాజాగా ఏడాది (2023లో) వ్యవధిలోనే రూ.10 లక్షల కోట్ల మార్కును దాటేసింది. 2022 చివరకు రూ.39.88 లక్షల కోట్ల నుంచి 2023 డిసెంబరు చివరకు రూ.50.77 లక్షల కోట్లకు వెళ్లటమే ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. 2023 డిసెంబరులో ఈక్విటీ ఫండ్స్ లోకి రూ.16,997 కోట్లు వచ్చాయి. నవంబరులో రూ.15,536 కోట్లు వచ్చాయి. అంటే.. నెల వ్రద్ధి రేటు 9.4శాతంగా ఉండటం గమనార్హం. ఏమైనా దేశం పురోగతి దిశగా పరుగులు తీస్తుందన్నది నిజమని చెప్పక తప్పదు.

Tags:    
  • Mutualfunds 
  • Assets 
  • 50lakcrores 
  • Latestreport 
  • Rarerecord 
  • Countrymutualfunds 

Similar News

భారత్ దెబ్బకు పాకిస్తాన్ దివాళా తీసింది.. ఇవే సాక్ష్యాలు

2026-11-02 18:24 GMT

సొంతింటి కల.. 50 ఏళ్ల వయసు మీరిన వేళ పెద్ద రిస్కేనా? రిటైర్మెంట్ లెక్కలివే..

2026-10-27 09:31 GMT

జియో ఐపీఓకు రికార్డు స్పందన.. ఇన్వెస్టర్లకు లాభాలు వస్తాయా?

2026-10-24 05:23 GMT

చమురు ధరలే కారణం కాదు.. రూపాయిని దెబ్బతీస్తున్న ప్రపంచ పెట్టుబడుల మార్పు

2026-10-22 18:30 GMT

తొలిరోజే రూ.95,500 కోట్ల బిడ్లు.. జియో ఐపీఓపై ఇంత క్రేజ్ ఎందుకు?

2026-10-22 10:24 GMT

పేటీఎం బ్యాంక్ లైసెన్స్ రద్దు.. UPI పేమెంట్లు రీఛార్జుల సంగ‌తేంటి?

2026-04-25 03:46 GMT

వీసా.. మాస్టర్.. రూపే కార్డుల్లో ఏది ఎక్కువ యూజ్ ఫుల్?

2025-12-19 04:38 GMT

రాకెట్ స్పీడ్ లో మస్క్ సంపద.. సెకనుకు ఎంతో తెలుసా..!

2025-12-17 10:06 GMT

40 ఏళ్ల క్రితం సెన్సెక్స్ లో టాప్.. ఇప్పుడు వాటి పరిస్థితి తెలిస్తే షాక్

2025-12-15 05:30 GMT

ప్రపంచాన్ని అప్పు ట్రాప్ లో పడేస్తున్న చైనా

2025-11-28 07:30 GMT

ప్రపంచ క్రిప్టోకరెన్సీ మార్కెట్లలో పెను తుఫాను

2025-11-23 05:44 GMT

ట్రంప్ సర్కారుపై ‘రిచ్ డాడ్’ రైటర్ కీలక పోస్టు.. అదేమంటే?

2025-09-18 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS