40 ఏళ్ల క్రితం సెన్సెక్స్ లో టాప్.. ఇప్పుడు వాటి పరిస్థితి తెలిస్తే షాక్
కాలం చేసే సిత్రాలు మహా ఆసక్తిగా ఉంటాయి. కొన్ని అంశాల్ని పెద్దగా పట్టించుకోం. కానీ.. అలాంటి అంశాలకు సంబంధించిన సమాచారం తెలిసినప్పుడు అవాక్కు అయ్యే పరిస్థితి.;
కాలం చేసే సిత్రాలు మహా ఆసక్తిగా ఉంటాయి. కొన్ని అంశాల్ని పెద్దగా పట్టించుకోం. కానీ.. అలాంటి అంశాలకు సంబంధించిన సమాచారం తెలిసినప్పుడు అవాక్కు అయ్యే పరిస్థితి. కాలపరీక్షను ఎదుర్కోవటం వ్యక్తులకే కాదు.. సంస్థలకు అంత తేలికైన పని కాదు. కొన్ని సంస్థలు కాలంతో పాటు తాము ఎదుగుతూ తిరుగులేని స్థాయికి చేరితే.. మరికొన్ని కాలగర్భంలో కలిసిపోతాయి. దాదాపు 40 ఏళ్ల క్రితం అప్పటి సెన్సెక్స్ సూచీలో టాప్ 30లో ఉన్న కంపెనీలు.. ఇప్పుడు ఎలా ఉన్నాయి? వాటి పరిస్థితి ఏమిటి? అన్న అంశాన్ని పరిశీలించినప్పుడు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.
1987లో సెన్సెక్స్ సూచీలో ఉన్న 30 కంపెనీల్లో ప్రస్తుతం 24 అందుబాటులో లేవని తేల్చారు. అంటే.. సూచీ ప్రారంభం నాటి సంస్థల్లో 80 శాతం కంపెనీలు ఇప్పుడు ప్రాధాన్యం కోల్పోయినట్లుగా గుర్తించారు. కొన్ని దివాలాకు చేరటం.. మరికొన్ని ఇతర కంపెనీలు కొనుగోలు చేయటం.. విలీనం లాంటి కారణాలతో 8 కంపెనీలు మనుగడలో లేవని గుర్తించారు.
అప్పట్లో సెన్సెక్స్ సూచీలో బ్యాంకులు, ఎన బీఎఫ్ సీలు, క్యాపిటల్ మార్కెట్ల కంపెనీలు లేవని.. ప్రస్తుత సూచీలో ఈ రంగ కంపెనీల వెయిటేజీ 31 శాతమని పేర్కొన్నారు. అప్పట్లో టెలికాం.. ఐటీ కంపెనీలు కూడా సెన్సెక్స్ లో లేవని.. ఇప్పుడు వాటి ప్రాధాన్యం 22 శాతంగా గుర్తించారు. సెన్సెక్స్ ప్రారంభ సూచీలో లేని రంగాలకు సంబంధించి ప్రస్తుతం 50 శాతం వాటా సూచీల్లో ఉండటం గమనార్హం.
కొత్త తరం కంపెనీల్లో పెట్టుబడుల పెట్టటంపై ఆందోళన అవసరం లేదని చెబుతున్నారు. కొత్త తరం టెక్నాలజీలు.. వ్యాపారాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయని.. అవి కొత్త అవకాశాల్ని క్రియేట్ చేస్తుంటాయని చెబుతున్నారు. ఇందుకు కొన్ని ఉదాహరణల్ని ప్రస్తావిస్తున్నారు. 1990, 2000లలో ఐటీ సేవల కంపెనీలు కొత్త తరంగా మార్కెట్లోకి రావటం తెలిసిందే. అంతేకాదు.. వేగంగా డెవలప్ అయ్యే కంపెనీలుగా మారాయి. ప్రస్తుతం అందులోని చాలావరకు వస్తు సేవలు అందించే సంస్థలుగా ఉన్నాయి.
ఈ సందర్భంగా ఒక ఉదాహరణను మార్కెట్ నిపుణులు ప్రస్తావిస్తున్నారు. దాదాపు బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో భారతీ ఎయిర్ టెల్ ఐపీవోకు వచ్చినప్పుడు.. ఆ సంస్థ నెట్ వర్క్ కంపెనీ నష్టాల్లో ఉండటం.. ఇప్పుడు ఆ షేరు ఎంతగా పెరిగి.. మదుపర్లకు భారీ లాబాలు తెచ్చి పెట్టినట్లుగా గుర్తు చేస్తున్నారు. కాలంతో పాటు కొన్ని సంస్థలు మార్పు చెందటం.. కొన్ని మార్కెట్ నుంచి నిష్క్రమించటం.. మరికొన్ని అంతకంతకూ రాణించటం మామూలే. అందుకే.. మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే వారు అన్ని అంశాల్ని గుర్తించటం.. అధ్యయనం చేయటం చాలా అవసరం. సూచనల్ని వినాలే తప్పించి.. ఆచరించే ముందు రిస్కు ఉంటుందన్న విషయాన్ని మరచిపోకూడదు .