కోట్లకు రెక్కలు.. కోటీశ్వరులు.. అపర కోటీశ్వరులు!
ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీలు ఇరువురూ.. రూ.40,000 కోట్లకుపైగా డివిడెండ్ పొందారు.;
దేశంలోని ప్రముఖ కుబేరులు అందరూ.. మరిన్ని కోట్లు వెనుకేసుకున్నారు. స్టాక్ ర్యాలీలు, ఐపీవో(ప్రాథ మిక బహిరంగ రాబడి)లో కుబేరులు మరోసారి కోట్లు పోగేసేశారు. ఒకరకంగా కోట్లకు రెక్కలే వచ్చాయి. ఈ క్రమంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ సహా ఇన్ ఫోసిస్ అధినేత నారాయణమూర్తి, హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్(హెచ్‌సీఎల్) అధినేత శివనాడార్ సహా.. వేదాంత ఫార్మసీ అధినేత అనిల్ అగర్వాల్ అపర కోటీశ్వరులుగా అవతరించారు. వీరంతా దేశంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో నిలిచారు.
ఎవరెవరు ఎంతెంత?
+ ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీలు ఇరువురూ.. రూ.40,000 కోట్లకుపైగా డివిడెండ్ పొందారు. ఒక్కొక్కరు సుమారు 20 వేల కోట్ల రూపాయల లాభాలను ఆర్జించారు. ఇది గత ఏడాదికంటే ఎక్కువగానే ఉందని మార్కెట్ నివేదికలు తెలిపాయి.
+ వేదాంత కంపెనీ అధినేత అనిల్ అగర్వాల్ రూ. 9,591 కోట్ల డివిడెండ్ పొందారు. వేదాంత సంస్థలో ఆయనకు 56.38 శాతం వాటా ఉంది. ఇది గత ఏడాది కంటే 22 శాతం ఎక్కువని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
+ తమిళనాడుకు చెందిన శివనాడార్ సంస్థ.. హెచ్‌సీఎల్ సంస్థ.. ఏకంగా 9900 కోట్ల రూపాయల లాభాలను గడించింది. ఈ కంపెనీ ఒక్కొక్క షేరుకు 60 రూపాయల చొప్పున డివిడెండ్ అందుకున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే 34 శాతం ఎక్కువగా ఉందని నివేదికలు పేర్కొన్నాయి.
+ ప్రముఖ సబ్బులు, గృహోపకరణాల సంస్థ విప్రో సంస్థ.. 4,570 కోట్లను పొందింది. ఈ కంపెనీ షేరు 6 చొప్పున పలికిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
+ ఇన్‌ఫోసిస్ నారాయణ మూర్తి సహా.. వ్యవస్థాపకులు 2,331 కోట్ల రూపాయలను వెనుకేసుకున్నారు. ఇలా.. దేశంలో ఇప్పటికే కోటీశ్వరులుగా ఉన్నవారు.. అపర కోటీశ్వరులుగా మారారు. అయితే.. ఈ డివిడెండ్లను ఉద్యోగులకు జీతాల రూపంలో పంచుతారో లేదో చూడాలి.