ట్రంప్ సర్కారుపై ‘రిచ్ డాడ్’ రైటర్ కీలక పోస్టు.. అదేమంటే?

ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసినట్లుగా చెప్పే ఈ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి.;

Update: 2025-09-18 11:30 GMT

పుస్తకాలు చదివే అలవాటు ఉన్నా.. మేనేజ్ మెంట్ అంశాల మీద అవగాహన ఉన్నా.. ఫైనాన్స్ వార్తల మీద ఆసక్తి ఉన్నా.. అకడమిక్ నాలెడ్జ్ లో భాగంగా పలు రంగాల మీద ఒక కన్నేసే వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’. ప్రపంచంలో అత్యుత్తమ పుస్తకాల్లో ఒకటిగా అభివర్ణించే ఈ పుస్తకాన్ని చదివిన తర్వాత.. డబ్బును చూసే కోణంతో పాటు..సంపదను క్రియేట్ చేసే ఆలోచనలు సైతం ఈ పుస్తకం పూర్తిగా మార్చేస్తుందని చెబుతారు.

ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసినట్లుగా చెప్పే ఈ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి. తాజాగా ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక ఆసక్తికర పోస్టు పెట్టారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల సంతకం చేసిన ఒక ఉత్తర్వును ప్రస్తావించిన ఆయన.. పెట్టుబడులు పెట్టే వారికి ఒక గుడ్ న్యూస్ అని పేర్కొంటూ.. వేటి మీద పెట్టుబడి పెడితే మరింత విలువ పెరుగుతుందన్న అంశంపై ఆయన కీలక సూచన చేవారు.

ట్రంప్ సంతకం చేసిన 401(కె) ఉత్తర్వు పెట్టుబడులు పెట్టే వారికి ప్రత్యామ్నాయ పెట్టుబడులపై మరింత స్వేచ్ఛను ఇస్తుందని.. తనకు అనుకూలమైన బంగారం.. వెండి..బిట్ కాయిన్ విలువను ఈ నిర్ణయం మరింత పెంచుతుందన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఉత్తర్వు రిటైర్ మెంట్ సేవింగ్స్ ప్లాన్ అధ్బుతంగా ఆయన పేర్కొన్నారు. తన స్నేహితుడు ఒకరు అందించిన సమాచారం ప్రకారం ట్రంప్ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ర మీద ఆగస్టు ఏడున సంతకం చేసినట్లుగా పేర్కొన్నారు.

రాబర్ట్ కియోసాకి విషయానికి వస్తే.. ఆయన మ్యూచువల్ ఫండ్స్ లేదంటే ఈటీఎఫ్ లలో పెట్టుబడి పెట్టానికి ఇష్టపడరు. ట్రంప్ సంతకం చేసిన ఉత్తర్వుల ప్రకారం రియల్ ఎస్టేట్.. ప్రైవేటు ఈక్విటీ.. రుణాలు.. క్రిప్టో.. విలువైన లోహాలు లాంటి ప్రత్యామ్నాయ పెట్టుబడులను ఒకే పన్ను గొడుగు కిందకు ఈ ఉత్తర్వు తెస్తుందన్నారు. తెలివైన ఆధునిక పెట్టుబడి పెట్టే వారికి కొత్త తలుపుల్ని ఈ ఉత్తర్వు తెరుస్తుందని పేర్కొన్నారు. ట్రంప్ సంతకం చేసిన కొత్త ఉత్తర్వు విషయంలో తాను చాలా సంతోషంగా ఉన్నట్లుగా పేర్కొంటూ.. ‘‘ఈ నిర్ణయం బంగారం.. వెండి.. బిట్ కాయిన్ లాంటి వాటి విలువను మరింత పెంచేలా చేస్తుంది’’ అని వెల్లడించారు.

Tags:    

Similar News