మినిమం బాదుడు వద్దా.. ఆ 4 బ్యాంకుల్లో ఖాతా తెరవండి!
తాజాగా స్టేట్ బ్యాంక్ బాటలో మరో ఐదు బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ నిబంధనను ఎత్తేసింది.;
ఒకటికి మించిన బ్యాంకు అకౌంట్లు ఉండటం ఇప్పుడు కామన్. సమస్యల్లా చాలా వరకు బ్యాంకులు తమ ఖాతాదారులు మినిమం బ్యాలెన్సు పేరుతో ఒక మొత్తాన్ని డిసైడ్ చేయటం.. ఆ మొత్తం లేని పక్షంలో వారికి ఛార్జీలు బాదేయటం జరుగుతోంది. పలు ప్రైవేటు బ్యాంకులు తమ ఖాతాదారులు తమ ఖాతాలో రూ.25వేల మొత్తాన్ని మినిమం పేరుతో ఉంచేయాలని చెబుతున్నారు. వేతన జీవులు ఒక్కోసారి అవసరాలకు బ్యాంకు ఖాతాలోని డబ్బుల్ని వాడేస్తే.. దాన్నో తప్పుగా చూపిస్తూ ఛార్జీల పేరుతో బాదేస్తున్న పరిస్థితి. బ్యాంకు ఖాతాను సున్నా చేసి.. ఎప్పుడైనా అందులో డబ్బులు పడితే.. వెంటనే డెబిట్ చేసుకోవటం కనిపిస్తుంది.
ఇలా మినిమం ఛార్జీల పేరుతో ప్రభుత్వ బ్యాంకులు మూడేళ్ల వ్యవధిలో ఏకంగా రూ.5614 కోట్లు. 2024 ఆర్థిక సంవత్సరంలో పీఎన్ బీలు రూ.2331 కోట్ల భారీ మొత్తాన్ని మినిమం బ్యాలెన్స్ పెనాల్టీల కింద వసూలు చేయటం గమనార్హం. 2023లో రూ.1855 కోట్లు వసూలు చేశాయి. అంటే 2023తో పోలిస్తే 2024లో పెనాల్టీల రూపంలో ఖాతాదారుల నుంచి లాగేసిన మొత్తంలో పెరుగుదల ఏకంగా 25.6 శాతం చూస్తే.. ఈ బాదుడు రేంజ్ ఎంతలా ఉందన్నది అర్థమవుతుంది.
ఇప్పుడు చెప్పిన గణాంకాలు ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన బ్యాంకులే. ఇక.. ప్రైవేటు బ్యాంకుల పెనాల్టీల్ని కలిపితే మరింత ఎక్కువగా ఉంటుంది. 2000 వరకు ఈ పెనాల్టీ రూల్ ను పెద్దగా పట్టించుకోలేదు. తర్వాతి కాలంలో పెద్ద ప్రైవేటు బ్యాంకులు రంగంలోకి వచ్చిన తర్వాత బాదుడు భారీగా పెరిగింది. దీంతో.. పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. స్టేట్ బ్యాంక్ తొలుత ఈ ఛార్జీలను తొలగించింది.మల్లీ 2017లో ప్రవేశ పెట్టింది. 2020 కొవిడ్ వేళలోనూ పెనాల్టీ మొత్తాన్ని తొలగించింది.
తాజాగా స్టేట్ బ్యాంక్ బాటలో మరో ఐదు బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ నిబంధనను ఎత్తేసింది. దీంతో.. ఖాతాదారుడు తన ఖాతాలో మినిమం బ్యాలెన్సును మొయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ జాబితాలోకి వచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏవంటే..
1. పంజాబ్ నేషనల్ బ్యాంకు
2. బ్యాంక్ ఆఫ్ బరోడా
3. ఇండియన్ బ్యాంకు
4. బ్యాంక్ ఆఫ్ ఇండియా
5. కెనరా బ్యాంకు
మినిమం బ్యాలెన్స్ మొయింటైన్ చేయాల్సిన అవసరం లేని ఈ బ్యాంకుల్లో ఖాతాలు తెరవటం ద్వారా.. వేతన జీవులు.. మధ్యతరగతి వారికి ఉపశమనం కలిగిస్తాయి. మినిమం బ్యాలెన్సు లేకుంటే పెనాల్టీలతో బాదేసే బ్యాంకులకు బుద్ధి చెప్పేందుకే అయినా.. ఈ నిబంధన లేని బ్యాంకుల్లో ఖాతాలు తెరవటం ద్వారా.. మిగిలిన బ్యాంకులకు బుద్ధి వచ్చేలా చేయాల్సిన అవసరం ఉంది.