12 మంది భార్యలు, 120 మంది పిల్లలు.. ఎవరీ ముస కసెరా?

తాజాగా ప్రముఖ యూట్యూబర్ అన్వేష్... యుగాండాని సందర్శించిన నేపథ్యంలో.. ఈ భారీ ఫ్యామిలీని పలకరించారు.;

Update: 2025-06-22 20:30 GMT

ఇటీవల కాలంలో వయసు పైబడినా పెళ్లిల్లు కావడం లేదని కొంతమంది గోలగోల చేస్తుంటే.. మాకు పెళ్లే వద్దు మహాప్రభో, బ్రహ్మచార జీవితాన్ని మించిన లైఫ్ లేదని మరికొందరు ఆ వ్యవస్థకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో.. 12 మంది భార్యలు, 120 మంది పిల్లలతో 75 ఏళ్ల వయసులో రప్పా రప్పా అంటూ జీవిస్తున్నారు యుగాండలోని ముస అసహ్య కసెరా.

అవును... పెళ్లే వద్దు, పెళ్లి చేసుకున్న పిల్లలు వద్దు, పిల్లలు కావాలనుకున్న ఒక్కరు ముందు ఇంకొకరు వద్దు అనుకుంటున్న జనాలు ఉన్న ఈ రోజుల్లో... 120 మంది పిల్లలకు తండ్రిగా.. 650 మంది మనవళ్లకు తాతగా.. 50 మంది మునిమనవళ్లకు ముత్తాతగా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యామిలీని కలిగి ఉన్నారు ముస అసహ్య కసెరా.

తాజాగా ప్రముఖ యూట్యూబర్ అన్వేష్... యుగాండాని సందర్శించిన నేపథ్యంలో.. ఈ భారీ ఫ్యామిలీని పలకరించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అంతమంది భార్యలకు, పిల్లలకు మట్టితో స్వయంగా ఇళ్లు నిర్మించిన ముస కసెరా.. తనకున్న భూమి, అందులో పండిస్తున్న పంటలను చూపించారు.

ఇందులో భాగంగా... తనకున్న పొలంలో గంట్లు, అరటి పళ్లు, మొక్క జొన్నా మొదలైనవి సాగు చేస్తున్నారు. ముస కసెరా. తనకున్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూనే ఆ కుటుంబం జీవనం సాగిస్తోంది.

వాస్తవానికి ముస కసెరాకు 17వ ఏట తొలి వివాహం జరిగిందంట. ఆమె ద్వారా 8 మంది సంతానం కలిగారు. ఇదే క్రమంలో 20 సంవత్సరాల వయసులో మరో పెళ్లి చేసుకున్నారు. ఇలా ఒకరి తర్వాత ఒకరిని చేసుకుంటూ మొత్తం 12 మంది మహిళలను ముస కుసారా వివాహం చేసుకున్నారు. వారిలో ఇద్దరు ఆయనను వదిలి వెళ్లిపోగా.. ప్రస్తుతం 10 మంది ఉన్నారు!

వాస్తవానికి ఉగాండా అనే ఈ ఆఫ్రికా దేశంలోని పలు గ్రామాల్లో చాలా మంది బహుభార్యత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఈ పేద దేశంలో అది సహజమని చెబుతున్నారు. అయితే.. ఈ స్థాయిలో 12 మంది భార్యలు, 120 మంది పిల్లలు స్థాయిలో అయితే మరొకరు లేరని అంటున్నారు.

Full View
Tags:    

Similar News