బిగ్ బ్రేకింగ్.. అట్టపెట్టెల్లో నోట్ల కట్టలు.. ఎవరివో తెలుసా?

హైదరాబాద్ శివార్లలోని ఓ గెస్ట్ హౌస్ లో అట్టపెట్టెల్లో దాచిన నోట్ల కట్టలను ఈ రోజు తెల్లవారుజామున ఏపీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.;

Update: 2025-07-30 05:52 GMT

హైదరాబాద్ శివార్లలోని ఓ గెస్ట్ హౌస్ లో అట్టపెట్టెల్లో దాచిన నోట్ల కట్టలను ఈ రోజు తెల్లవారుజామున ఏపీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగర శివార్లలోని కాచారం గ్రామంలో సులోచన ఫార్మ్ హౌస్ లో భారీగా నగదు దాచినట్లు పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో దాడులు చేశారు. ఈ డబ్బు లిక్కర్ స్కాంలో వచ్చిన కమీషన్ డబ్బుగా పోలీసులు చెబుతున్నారు. ఏ40 వరుణ్ ఇచ్చిన సమాచారంతో సిట్ పోలీసులు సులోచన ఫార్మ్ హౌసులో తనిఖీ చేయగా 12 అట్ట పెట్టెల్లో రూ.11 కోట్లు నగదు బయటపడింది.

భారీగా నగదు లభించడంతో లిక్కర్ స్కాంలో సిట్ పెద్ద పురోగతి సాధించినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా సిట్ తొలి నుంచి చెబుతున్నట్లు హైదరాబాద్ కేంద్రంగా పెద్ద ఎత్తున నగదు చేతులు మారిందని ఈ ఘటన రుజువు చేస్తుందని అంటున్నారు. రూ.11 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న సిట్ పోలీసులు, ఫాం హౌసు యజమానులను ప్రశ్నిస్తున్నారు. స్కాంలో వారిని కూడా నిందితులుగా చేర్చుతారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

లిక్కర్ స్కాంలో ఏ1గా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసిరెడ్డి రాజశేఖరరెడ్డికి ఏ40 వరుణ్ ప్రధాన అనుచరుడుగా చెబుతున్నారు. వరుణ్ తోపాటు ఇదే కేసులో మరో ఏ12 చాణక్య లిక్కర్ స్కాంలో కమీషన్ డబ్బు వసూలు చేసేవారని సిట్ పోలీసులు చెబుతున్నారు. ఈ ఇద్దరిని గతంలోనే అరెస్టు చేయగా, కమీషన్ కోసం వసూలు చేసిన డబ్బుపై ప్రశ్నించడంతో ఈ డంప్ బయటపడినట్లు చెబుతున్నారు. కాగా, ఈ విచారణలో పలు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.

Tags:    

Similar News