కెనడాలో ఆర్ఎస్ఎస్ అలజడి !
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కెనడా పర్యటన ఆ దేశంలో కలకలం రేపుతున్నది. ఆయన పర్యటనకు అనుమతి ఇవ్వవద్దని అక్కడి కొన్ని సంస్థలు, అక్కడి స్థానిక ఎంపీలు, సివిల్ సొసైటీ, మ్యూమన్ రైట్స్ గ్రూపులు డిమాండ్ చేస్తున్నాయి.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కెనడా పర్యటన ఆ దేశంలో కలకలం రేపుతున్నది. ఆయన పర్యటనకు అనుమతి ఇవ్వవద్దని అక్కడి కొన్ని సంస్థలు, అక్కడి స్థానిక ఎంపీలు, సివిల్ సొసైటీ, మ్యూమన్ రైట్స్ గ్రూపులు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఆయనకు మద్దతుగా 100కు పైగా కెనడియన్ హిందూ సంస్థలు, సివిల్ లిబర్టీ గ్రూపులు, వివిధ ఆలయాల కమిటీలు, కల్చరల్ అసోసియేషన్లు కెనడా ప్రధాని మార్క్ కార్నీతో పాటు అక్కడి మంత్రులకు లేఖలు రాశారు. ఇందులో 10 లక్షల మంది సభ్యులు ఉన్న కెనడా హిందూ కమ్యూనిటీ ఉండడం గమనార్హం.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ నెల 25 నుండి అమెరికా, కెనడా, యూకేలలో పర్యటించనున్నారు. షెడ్యూలులో భాగంగా మొదట అమెరికాలోని న్యూయార్క్ లో రక్షాబంధన్ వేడుకలలో పాల్గొంటారు. ఆ తర్వాత కెనడాకు వెళ్లి, అక్కడి నుండి యూకే పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్ట్ 31, సెప్టెంబర్ 1న ఆయన కెనడాలోని టోరంటోలో పర్యటించనున్నారు.
అయితే మత స్వేఛ్చ, సమానత్వానికి విరుద్దం అని, మైనారిటీలపై హింస, హేట్ స్పీచ్ ఆరోపణలతో భగవత్ పర్యటన అడ్డుకోవాలని, ఆర్ఎస్ఎస్ ను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ కేవలం ఆరోపణలు కాకుండా ఏవైనా సాక్ష్యాలు ఉంటే దాని ఆధారంగా చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ మద్దతుగా ఉన్న సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే మోహన్ భగవత్ పర్యటన నేపథ్యంలో ఖలిస్తాన్ గ్రూపుల నుంచి నిరసనలు ఉండే అవకాశం ఉందని నిర్వాహకులు భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు
ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో 2026లో శతాబ్ది వేడుకలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్లోబల్ ఔట్ రీచ్ లో భాగంగా విదేశాల్లోని భారతీయ హిందూ కమ్యూనిటీలు, స్థానిక అసోసియేషన్లు, హిందూ స్వయం సేవక్ సంఘ్ వంటి సంస్థల ఆహ్వానం మేరకు విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ మీద ఉన్న ఆపోహాలను తొలగించడం, సామాజిక సేవ, సాంస్కృతిక కార్యకలాపాల గురించి చర్చించడం ఈ పర్యటనల ప్రధాన ఉద్దేశమని సమాచారం.