మోడీ మౌనం వెనక ?

ఇక ఈ నెల 12న జరిగే చర్చలలో భారత్ పాక్ ముందు చాలా ప్రతిపాదనలు డిమాండ్లూ పెట్టబోతోంది అని అంటున్నారు.;

Update: 2025-05-11 06:55 GMT

ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడా మాట్లాడలేదు. అలాగే కాల్పుల నిలుపుదల తరువాత కూడా ప్రధాని కార్యాలయం నుంచి ఏమీ ట్వీట్ రాలేదు. మొత్తానికి చూస్తే అత్యంత బలమైన ప్రధాని గా భారత్ కి దొరికిన వరంగా మారిన మోడీ మౌనంగా ఉండడం మీద సర్వత్రా చర్చ సాగుతోంది.

అయితే నరేంద్ర మోడీని ఎవరూ తక్కువ అంచనా వేయలేరు అని అంటున్నారు. ఆయన మౌనం వెనక ఎన్నో వ్యూహాలు ఉంటాయని చెబుతున్నారు. మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో సన్నిహిత మిత్రుడు. ఇక అమెరికా శాంతి అన్నది, చర్చలకు రెండు దేశాలూ కలిసి రావాలని సూచించింది.

అయితే పెద్దన్నగా అమెరికా ఇచ్చిన ఈ సూచనను భారత్ పాటిస్తూ ప్రపంచానికి మరోసారి పాక్ దుష్ట వైఖరి చాటి చెప్పాలని ఆలోచిస్తోందా అన్న చర్చ అయితే సాగుతోంది. నిజానికి పాక్ కి ఈ కాల్పుల నిలుపుదలలు తెలియవు, ఆ దేశం దాని చేతిలో లేదు. అదొక ఉన్మాద దేశం. అందువల్ల పాక్ బరితెగింపు అన్నది తొందరలో బయటపడుతుంది.

ఇక ఈ నెల 12న జరిగే చర్చలలో భారత్ పాక్ ముందు చాలా ప్రతిపాదనలు డిమాండ్లూ పెట్టబోతోంది అని అంటున్నారు. ఉగ్ర మూకలను మొత్తం లేకుండా నిర్మూలించాలి. ఉగ్ర పోస్టులను క్యాంపులను నిర్వీర్యం చేయాలి. అంతే కాదు పహిల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను భారత్ కి అప్పగించాలి. మోస్ట్ వాంటెడ్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ లష్కరే తోయిబా చీఫ్ అయిన మసూద్ అజార్ ని భారత్ కి అప్పగించాలి సరిహద్దులలో కవ్వింపు చర్యలు మానుకోవాలి.

ఇలా చాలానే భారత్ పాక్ కి చెప్పనుంది. మరి వాటిని పాక్ ఆమోదించి దానికి అనుగుణంగా వ్యవహరిస్తేనే ఈ చర్చలకు అర్థం ఉంటుంది. అలా కాకుండా పాక్ కనుక తోక జాడిస్తే మాత్రం భారత్ తాను ఏమి చేయాలో అదే చేస్తుంది. ఇక యుద్ధం అంటే సర్జికల్ స్ట్రైక్స్ తో మాత్రమే కాదు అనేక రకాలుగా చేయవచ్చు.

ఇప్పటికే సింధు జలాలను నిలుపు చేసి పాక్ నోరు ఎండగట్టిన భారత్ అన్ని రకాల వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసింది. వీసాలను పాక్ పౌరులకు రద్దు చేసింది. దాంతో పాటు పాక్ ఏ మాత్రం సరిహద్దులలో కెలికినా ఉగ్ర నీడ కనిపించినా దానిని యుద్ధంగానే భావించి కచ్చితంగా ప్రతీకార దాడులు చేస్తామని కూడా తీర్మానించింది.

అందువల్ల ఇది ఇక్కడితో అయిపోయింది కాదు అని అంటున్నారు. గతం వేరు వర్తమానం వేరు అన్న దానిని ఆలోచించే భారత్ చర్చలకు సిద్ధపడింది అని అంటున్నారు. ఇదంతా అంతర్జాతీయ సమాజానికి చూపించడానికే భారత్ ఇలా చేసింది అని అంటున్నారు. భారత్ లో యుద్ధ కాంక్ష కానీ పాక్ మీద అకారణంగా దాడి చేయాలని ఆసక్తి కానీ లేవని చెప్పడానికే చర్చలకు సిద్ధపడుతోంది అని అంటున్నారు.

ఇక ఈ చర్చల వేళ పాక్ ఏ మాత్రం మాట వినకపోయినా లేక కవ్వించినా భారత్ ఇక ఎవరి మాట వినదని అంటున్నారు. ఆ మాటకు వస్తే తన మాట కూడా వినదని పాక్ లెక్క తిక్కా అన్నీ సరిచేస్తుందని అంటున్నారు అందుకే మోడీ మౌనాన్ని తుపాను ముందు నిశ్శబ్దంగా అంతా చూస్తున్నారు. ఆయన మౌనం వెనక వ్యూహాలు అర్థం కావు. ఒక్కసారి మరో ఆపరేషన్ సింధూర్ ని చూశాకే ప్రపంచానికి కూడా అర్ధం అవుతుంది అని అంటున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశం కోసం ఎందాకైనా వెళ్తారన్నది నిజమని అంటున్నారు. ఆయనది గట్టి సంకల్పం అని కూడా అంటున్నారు.

Tags:    

Similar News